...
...
Next Story

స్టెప్ ఏస్తే భూకంపం.. పవన్ కల్యాణ్ స్టైలిష్ డ్యాన్స్.. దేఖ్‌లేంగే సాలా సాంగ్‌.. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ పాట రిలీజ్

పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. ఫ్యాన్స్ ను ఊపేసేలా స్టైలిష్ మూవ్స్ తో పవర్ స్టార్ అదరగొట్టారు. దేఖ్‌లేంగే సాలా అంటూ ఈ పాట సాగుతోంది.

Published on: Dec 13, 2025, 18:35:06 IST
Advertisement

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అలర్ట్. మీరు ఎదురు చూసిన రోజు వచ్చింది. పవర్ స్టార్ స్టైలిష్ మూవ్స్ తో అదరగొట్టిన సాంగ్ రిలీజైంది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘దేఖ్‌లేంగే సాలా’ అంటూ సాగే పాటను ఇవాళ మేకర్స్ రిలీజ్ చేశారు. క్యాచీ ట్యూన్, పెప్పీ బీట్ తో ఈ పాట అదిరిపోయింది.

దేక్‌లేంగే సాలా సాంగ్

పవన్ కల్యాణ్ (x/UBSTheFilm)
పవన్ కల్యాణ్ (x/UBSTheFilm)

హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ హీరోగా యాక్ట్ చేస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజైంది. ‘రమ్ పమ్ పమ్ రమ్ పమ్ పమ్.. స్టెప్ ఎస్తే భూకంపం’ అంటూ మొదలయ్యే సాంగ్ అదిరిపోయింది. మధ్యలో ‘దేఖ్‌లేంగే సాలా.. చూసినామ్లే చాలా’ అనే హుక్ లైన్ పాటకు మరింత జోష్ తెచ్చింది.

ఫ్యాన్స్ రిలీజ్

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి రిలీజైన దేక్‌లేంగే సాలా సాంగ్ లిరికల్ షీట్ ను ఫ్యాన్స్ రిలీజ్ చేయడం విశేషం. దీని కోసం వెబ్ సైట్లో ఓ క్విజ్ పెట్టారు. లక్ష మంది ఫ్యాన్స్ రిజిస్టర్ కాగానే దేఖ్‌లేంగే సాలా లిరికల్ షీట్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ తర్వాత రాజమండ్రిలోని ఆదిత్య యూనివర్సిటీలో జరిగిన సాంగ్ లాంఛ్ ఈవెంట్లో ఈ పాటను విడుదల చేశారు.

పవర్ డ్యాన్స్

చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ డ్యాన్స్ ను దేఖ్‌లేంగే సాలా సాంగ్ లో చూడొచ్చు. ఇందులో పవర్ స్టార్ తో కలిసి యూత్ సెన్సేషన్ శ్రీలీల కూడా ఆడిపాడింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ డైరెక్టర్. దేఖ్‌లేంగే సాలా పాటను భాస్కరబట్ల రాశారు. దీన్ని విశాల్ దద్లాని, హరిప్రియ పాడారు. పవన్ కల్యాణ్ తో దినేశ్ మాస్టర్ అదిరే స్టెప్పులు వేయించారు.

మరో హిట్ కోసం

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks