Dhanush Nakshatra: నీ దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటా.. ఇరుముడి పాప నక్షత్రకు ధనుష్ వీడియో కాల్.. 100 కోట్లు కొట్టిన మూవీ!

Dhanush Nakshatra: 'ఇరుముడి' సినిమాలో అద్భుత నటనతో అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్రపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ఈ పాపకు నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ సర్ ప్రైజ్ వీడియో కాల్ చేశారు. నీ దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటానన్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది. మరోవైపు ఇరుముడి రూ.100 కోట్లను అందుకుంది.

Published on: Aug 25, 2026, 13:28:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dhanush Nakshatra: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కేవలం 4 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటింది. ముఖ్యంగా రవితేజతో పాటు ఆయన కుమార్తె పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ 'బేబీ నక్షత్ర' తన సహజ నటనతో అందరినీ కట్టిపడేసింది. ఈ నేపథ్యంలో ధనుష్ ప్రశంసలు వైరల్ గా మారాయి.

నీ దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటా.. ఇరుముడి పాప నక్షత్రకు ధనుష్ వీడియో కాల్.. 100 కోట్లు కొట్టిన మూవీ!
నీ దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటా.. ఇరుముడి పాప నక్షత్రకు ధనుష్ వీడియో కాల్.. 100 కోట్లు కొట్టిన మూవీ!

ధనుష్ వీడియో కాల్

ఇరుముడి సినిమా సాధించిన భారీ విజయం నేపథ్యంలో మూవీ టీమ్ సోమవారం (ఆగస్టు 24) ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఆ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ.. జాతీయ ఉత్తమ నటుడు, తమిళ సూపర్‌స్టార్ ధనుష్‌కు బేబీ నక్షత్రను వీడియో కాల్ ద్వారా పరిచయం చేశారు. ఈ సంభాషణలో ధనుష్ బేబీ నక్షత్ర నటన గురించి ధనుష్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

యాక్టింగ్ నేర్చుకుంటా

‘‘ఏదో ఒక రోజు నిన్ను కలిసినప్పుడు నీ దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటా. నాకు నేర్పిస్తావా? సో వండర్ ఫుల్, సో బ్యూటీఫుల్. నీ పర్ఫార్మెన్స్ కు ఫిదా అయ్యా. నిన్ను కలవాలని ఉంది. ఒకరోజు కచ్చితంగా కలుద్దాం’’ అని నక్షత్రతో ధనుష్ చెప్పారు.

దర్శకుడు శివ నిర్వాణ పక్కన ఉండగా ధనుష్ తో మాట్లాడుతూ నక్షత్ర పొంగిపోయింది. యాక్టింగ్ నేర్పిస్తావా? అన్నప్పుడు ఆశ్చర్యపోయిన ఆమె.. ఆ తర్వాత ఓకే అని చెప్పింది.

వీడియో వైరల్

ధనుష్‌తో జరిగిన ఈ ప్రత్యేక సంభాషణకు సంబంధించిన వీడియోను బేబీ నక్షత్ర తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక దిగ్గజ నటుడి నుంచి ఇంతటి ప్రశంసలు లభించడంపై సినీ అభిమానులు, నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రూ.100 కోట్ల క్లబ్‌లో 'ఇరుముడి'

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడి చిత్రంలో తండ్రీకూతుళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. శివ నిర్వాణ దర్శకత్వ ప్రతిభ, రవితేజ, నక్షత్రల కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల గ్రాస్ దాటిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను నమోదు చేసే దిశగా దూసుకుపోతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More