...
...
Next Story

ధనుష్ మరో సూపర్ లవ్ స్టోరీ.. తేరే ఇష్క్ మే ట్రైలర్ రిలీజ్.. తమిళ స్టార్ నటనకు ఫ్యాన్స్ ఫిదా

ధనుష్, కృతి సనన్ కాంబినేషన్ లో వస్తున్న తేరే ఇష్క్ మే ట్రైలర్ రిలీజైంది. ఇందులో మరోసారి అతడు ఓ భగ్న ప్రేమికుడిగా కనిపించబోతున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

Published on: Nov 14, 2025, 22:12:22 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

తమిళ స్టార్ హీరో ధనుష్ నెక్ట్స్ మూవీ వచ్చేస్తోంది. ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ డైరెక్షన్ లో 'తేరే ఇష్క్ మే' (Tere Ishk Mein) ట్రైలర్ శుక్రవారం (నవంబర్ 14) విడుదలైంది. 12 సంవత్సరాల క్రితం వచ్చిన 'రాంజనా' (Raanjhanaa) తర్వాత ధనుష్, ఆనంద్ ఎల్. రాయ్ కలయికలో వస్తున్న చిత్రమిది.

ట్రైలర్‌లో ఎలా ఉందంటే?

ధనుష్ మరో సూపర్ లవ్ స్టోరీ.. తేరే ఇష్క్ మే ట్రైలర్ రిలీజ్.. తమిళ స్టార్ నటనకు ఫ్యాన్స్ ఫిదా
ధనుష్ మరో సూపర్ లవ్ స్టోరీ.. తేరే ఇష్క్ మే ట్రైలర్ రిలీజ్.. తమిళ స్టార్ నటనకు ఫ్యాన్స్ ఫిదా

'తేరే ఇష్క్ మే' మూవీలో ధనుష్‌తో పాటు కృతి సనన్ కూడా నటించింది. ఈ కథ ధనుష్ పోషించిన ఓ ఆవేశంతో కూడిన, హింసాత్మక ప్రవృత్తి ఉన్న యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను ముక్తి (కృతి సనన్) ప్రేమలో పడతాడు. కానీ ముక్తి త్వరగానే అతడిపై మనసు మార్చుకుని, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

అమ్మాయి తిరస్కరణకు గురైన ధనుష్ పాత్ర పగతో రగిలిపోతుంది. తన విఫల ప్రేమ కోసం 'ఢిల్లీ మొత్తాన్ని బూడిద చేస్తానని' ప్రతిజ్ఞ చేస్తాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా అతడు ఓ ఫైటర్ జెట్ పైలెట్ గా మారతాడు. కానీ విచిత్రంగా ఇటు ముక్తి మాత్రం తాగుడికి బానిస అవుతుంది. 1990ల్లో వచ్చిన విఫల ప్రేమ కథలలాగా ఈ మూవీ ట్రైలర్ సాగిపోయింది. అయితే ఇందులో ధనుష్, కృతి నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

ట్రైలర్‌పై అభిమానుల రియాక్షన్ ఇలా

తేరే ఇష్క్ మే ట్రైలర్ కు అభిమానుల నుంచి పాజిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి. "కృతి నటన అద్భుతంగా ఉంది. ధనుష్ ఎప్పటిలాగే మమ్మల్ని స్క్రీన్‌కు కట్టిపడేస్తున్నాడు" అని ఒక అభిమాని ప్రశంసించారు. మరొకరు.. "భాయ్, సయ్యారా (Saiyaara) కా బాప్ నవంబర్ 28న లోడ్ అవుతోంది" అని అనడం విశేషం.

'తేరే ఇష్క్ మే' మూవీ నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్, కృతి సనన్ కలిసి నటించిన మొదటి చిత్రం ఇదే. ధనుష్ ప్రస్తుతం తన 'D54' మూవీ కోసం పనిచేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జులైలో 'పోర్ తొళిల్' దర్శకుడు విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ప్రారంభమైంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks