బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. అందులో అతని కుటుంబ సభ్యులతోపాటు హాస్పిటల్ సిబ్బంది, ఇతరులు కూడా ఉన్నారు. అయితే అందులో ఎవరో ఏడుస్తుండటం, ఆమెను సన్నీ డియోల్ ఓదార్చడం కూడా చూడొచ్చు.
హాస్పిటల్ బెడ్‌పై ధర్మేంద్ర

ధర్మేంద్ర పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అతడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రస్తుతం అతడు ఇంటికి వెళ్లినా.. అసలు కదల్లేని స్థితిలో ఉన్నాడు. ఈ వీడియోలోనూ హాస్పిటల్ బెడ్ పై అచేతనంగా పడి ఉన్న ధర్మేంద్ర చుట్టూ అతని ఫ్యామిలీ మెంబర్స్ ఉండటం చూడొచ్చు.
అతని చిన్న కొడుకు బాబీ డియోల్ బాధగా కనిపించగా.. పెద్ద సన్నీ డియోల్ ఎవరినో ఓదారుస్తూ కనిపించాడు. వాళ్లతోపాటు ఆ రూమ్ లో ఇంకొంత మంది కూడా ఉన్నారు. ఈ వీడియోను జాలీ క్రిస్టియన్ అనే ఎక్స్ అకౌంట్ షేర్ చేసింది.
ధర్మేంద్ర చనిపోయాడన్న పుకార్లు
నిజానికి నాలుగు రోజుల కిందటే ధర్మేంద్ర చనిపోయాడన్న పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అతని కూతురు ఇషా డియోల్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. హేమా మాలిని కూడా కొన్ని న్యూస్ ఛానెల్స్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయని విమర్శించింది. అతడు బాగానే ఉన్నాడని, చికిత్సకు స్పందిస్తున్నాడని అతని ఫ్యామిలీ తెలిపింది. రెండు రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఇప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
మీడియాపై సన్నీ డియోల్ ఆగ్రహం
ఇక ధర్మేంద్ర పెద్ద కొడుకు, నటుడు సన్నీ డియోల్ గురువారం (నవంబర్ 13) మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. అందులో ఇంట్లోకి వెళ్తున్న అతన్ని వీడియో తీస్తున్న కొందరిపై సన్నీ కోప్పడ్డాడు. మీ ఇంట్లో కూడా తల్లి, తండ్రి, అక్కా చెల్లెళ్లు ఉంటారు కదా.. కాస్తయినా సిగ్గు తెచ్చుకోండి.. ఇలా వీడియో తీస్తే ఎలా అని అతడు అనడం ఆ వీడియోలో వినిపిస్తోంది.
{{/usCountry}}ఇక ధర్మేంద్ర పెద్ద కొడుకు, నటుడు సన్నీ డియోల్ గురువారం (నవంబర్ 13) మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. అందులో ఇంట్లోకి వెళ్తున్న అతన్ని వీడియో తీస్తున్న కొందరిపై సన్నీ కోప్పడ్డాడు. మీ ఇంట్లో కూడా తల్లి, తండ్రి, అక్కా చెల్లెళ్లు ఉంటారు కదా.. కాస్తయినా సిగ్గు తెచ్చుకోండి.. ఇలా వీడియో తీస్తే ఎలా అని అతడు అనడం ఆ వీడియోలో వినిపిస్తోంది.
{{/usCountry}}