ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర.. ఇంటి వద్దే చికిత్స! ఆరోగ్యంపై కీలక అప్‌డేట్
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర డిశ్చార్జ్ వార్త కాస్త ఉపశమనం కలిగించేదే.
89 ఏళ్ల సీనియర్ నటుడు ధర్మేంద్ర బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని వైద్యులు బుధవారం (నవంబర్ 12) ధృవీకరించారు. ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌తో సహా కుటుంబ సభ్యులు ఆయన్ని ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. బుధవారం ఉదయం ధర్మేంద్ర ఆరోగ్యంపై పీటీఐ ఈ అప్‌డేట్‌ను పంచుకుంది. కుటుంబం ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించడంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.

ధర్మేంద్ర డిశ్చార్జ్
89 ఏళ్ల ధర్మేంద్ర గత కొన్ని వారాలుగా పలుమార్లు ఆసుపత్రిలో చేరారు. "ధర్మేంద్ర జీ ఉదయం 7.30 గంటలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనకు ఇంట్లోనే చికిత్స అందించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇకపై చికిత్స ఇంటి వద్దే కొనసాగుతుంది" అని డాక్టర్ ప్రతీత్ సమదానీ పీటీఐకి తెలిపారు. ధర్మేంద్ర నివాసానికి అంబులెన్స్ రావడం, వెళ్లడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఈ అప్‌డేట్ వచ్చింది.
ధర్మేంద్ర ఆరోగ్యం గురించి..
మంగళవారం ఉదయం ధర్మేంద్ర ఆసుపత్రిలో మరణించారని పుకార్లు వ్యాపించాయి. అయితే ఆయన భార్య హేమ మాలిని నుండి కుమార్తె ఈషా డియోల్ వరకు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా ఈ తప్పుడు వార్తలను ఖండించారు. అభిమానులకు భరోసా ఇస్తూ సీనియర్ నటుడు బతికే ఉన్నారని, చికిత్సకు బాగా స్పందిస్తున్నారని తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.
కుటుంబం మొత్తం
ఈ వారం ప్రారంభంలో ధర్మేంద్ర ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రోజంతా ధర్మేంద్ర కుటుంబం ఆయన పక్కనే ఉంది. ఆయన పిల్లలు సన్నీ డియోల్, బాబీ డియోల్, ఈషా డియోల్, మేనల్లుడు అభయ్ డియోల్, భార్య హేమ మాలిని మంగళవారం సాయంత్రం ఆసుపత్రి నుంచి వెళ్తూ కనిపించారు. మంగళవారం అమీర్ ఖాన్, ఆయన గర్ల్‌ఫ్రెండ్ గౌరీ స్పాట్ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ధర్మేంద్రను పరామర్శించారు.
సోమవారం సాయంత్రం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ 89 ఏళ్ల ఈ సీనియర్ నటుడిని ఆసుపత్రిలో పరామర్శించిన విషయం తెలిసిందే. ధర్మేంద్ర చివరిసారిగా షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో కలిసి 'తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా' (2024) చిత్రంలో కనిపించారు. ఆయన తదుపరి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో అగస్త్య నంద నటిస్తున్న 'ఇక్కీస్' చిత్రంలో కనిపించనున్నారు. ఈ వార్ డ్రామా డిసెంబర్‌లో విడుదల కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


