హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర.. సన్నీ డియోల్, బాబీ డియోల్ తండ్రి.. ఆందోళనలో ఫ్యాన్స్.. అసలేమైందంటే?
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ధర్మేంద్ర కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ తమ తండ్రి ఆరోగ్యాన్ని నిశితంగా గమనిస్తున్నారు. వైద్య పరీక్షలు, వాటి ఫలితాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
త్వరలో 90వ పుట్టినరోజు జరుపుకోనున్న బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆసుపత్రిలో చేరిన వార్త ఆన్‌లైన్‌లో వ్యాపించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే, ఆయన సన్నిహిత వర్గాలు ఈ వదంతులకు తెరదించుతూ, ఆ దిగ్గజ నటుడు ఆరోగ్యంగానే ఉన్నారని, సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రికి వచ్చారని స్పష్టం చేశాయి.

ఆసుపత్రిలో ధర్మేంద్ర
89 ఏళ్ల ధర్మేంద్ర ఈ వారం ప్రారంభంలో ఆసుపత్రిలో చేరారు. ఆయన సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోవడానికే అక్కడికి వెళ్లారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
“అవును, ధర్మేంద్ర ప్రస్తుతం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోనే ఉన్నారు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. సాధారణ వైద్య పరీక్షల కోసం తరచుగా ఆసుపత్రికి వస్తుంటారు, ఇప్పుడు కూడా అందుకే వచ్చారు. ఎవరో ఆయన్ను అక్కడ చూసి ఉంటారు. దాంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కానీ ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందున కంగారు పడాల్సిన పనిలేదు” అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కారణం ఇదే
వాస్తవానికి ప్రతిరోజూ పరీక్షల కోసం ఆసుపత్రికి రావడం, వెళ్లడం కన్నా.. అన్ని పరీక్షలు ఒకేసారి పూర్తి చేసుకునేందుకు ఆసుపత్రిలోనే ఉండాలని ధర్మేంద్ర స్వయంగా నిర్ణయించుకున్నారని ఆ వర్గాలు తెలిపాయి. “ధర్మేంద్ర చేయించుకోవాల్సిన సాధారణ పరీక్షలు పూర్తి కావడానికి సాధారణంగా రెండు నుంచి మూడు రోజులు పడుతుంది. ఆయన వయసు 89 ఏళ్లు కావడంతో ఈ వయసులో రోజూ ప్రయాణం చేయడం అలసటగా ఉంటుంది. అందుకే, ప్రతిరోజూ రాకపోకలు సాగించే బదులు, ఆసుపత్రిలోనే ఉండి అన్ని పరీక్షలు ఒకేసారి పూర్తి చేసుకోవాలని ఆయనే నిర్ణయించుకున్నారు” అని ఆ వర్గాలు వెల్లడించాయి.
ధర్మేంద్ర కుమారులు
“ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, తమ తండ్రి ఆరోగ్యాన్ని నిశితంగా గమనిస్తూ, వైద్య పరీక్షలు, వాటి ఫలితాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు” అని కూడా ఆ వర్గాలు జోడించాయి.
ధర్మేంద్ర గురించి
నటి, రాజకీయ నాయకురాలైన హేమ మాలినిని వివాహం చేసుకున్న ధర్మేంద్ర, ఈ ఏడాది డిసెంబర్‌లో 90వ ఏట అడుగుపెట్టనున్నారు. గత ఏప్రిల్‌లో ధర్మేంద్ర కంటి శుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ధర్మేంద్ర చివరిసారిగా షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో కలిసి 'తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా' (2024) చిత్రంలో కనిపించారు.
ధర్మేంద్ర తదుపరి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో, అగస్త్య నంద హీరోగా నటిస్తున్న 'ఇక్కీస్' చిత్రంలో కనిపించనున్నారు. ఈ వార్ డ్రామా, అత్యంత పిన్న వయసులో పరమవీర చక్ర పురస్కారం పొందిన అరుణ్ ఖేతర్‌పాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జైదీప్ అహ్లావత్, సికందర్ ఖేర్ కూడా నటిస్తున్నారు. ఇది డిసెంబర్‌లో విడుదల కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


