Etv Dhee 21 OTT: తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యధిక టీఆర్‌పీ సాధించిన పాపులర్ డాన్స్ రియాలిటీ షో 'ఢీ' (Dhee). ఈ షో మళ్లీ సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. 'ఢీ 21 డబుల్ ఇంపాక్ట్' (Dhee 21 Double Impact) పేరుతో రూపుదిద్దుకున్న ఈ లేటెస్ట్ సీజన్ గ్రాండ్ లాంఛ్ కు రెడీ అవుతోంది.
ప్రదీప్ మాచిరాజు రీ ఎంట్రీ

ఢీ 21 సీజన్ కు సంబంధించి చాలా స్పెషాలిటీలున్నాయి. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తిరిగి ఈ షోకు హోస్ట్ గా వస్తున్నాడు. గతంలో తన యాంకరింగ్ తో ఈ షో హిట్ కావడంలో ప్రదీప్ కీ రోల్ ప్లే చేశాడు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ తో కలిసి ఎంటర్ టైన్ చేశాడు. మధ్యలో గ్యాప్ తీసుకున్న అతను.. ఇప్పుడు మళ్లీ హోస్ట్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
వేరే లెవల్ కాంబో
ఢీ షోకు జడ్జీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ వచ్చారు. తరుణ్ మాస్టర్, సదా, ప్రియమణి, శేఖర్ మాస్టర్, పూర్ణ, నందిత, గణేష్ మాస్టర్ తదితరులు ఈ షోకు జడ్జీలుగా వ్యవహరించారు. ఇప్పుడు బ్రాండ్ న్యూ ఢీ 21 సీజన్ కు బ్యూటీఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జడ్జీగా వస్తోంది. అంతేకాకుండా స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా కమ్ బ్యాక్ ఇస్తున్నాడు.
యశ్వంత్ మాస్టర్
ఢీ 21 సీజన్ లో పోటీపడేందుకు స్టార్ కొరియోగ్రాఫర్లు కూడా రెడీ అయ్యారు. ఢీ షోతోనే తన సత్తా ఏంటో చూపించిన యశ్వంత్ మాస్టర్ ఇప్పుడు సినిమాల్లో బిజీగా మారాడు. అతను తిరిగి ఢీ 21 టైటిల్ కోసం పోటీపడేందుకు వచ్చేస్తున్నాడు. యశ్వంత్ తో పాటు జేడీ, లక్ష్మణ్, సునీల్, గోవింద్, రేవంత్, యూసుఫ్, జిత్తు తదితర మాస్టర్లు పోరుకు సై అంటున్నారు.
ఈటీవీ విన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ
బుల్లితెర డాన్స్ షోలలో ఎప్పుడూ లేని విధంగా 'ఢీ 21 డబుల్ ఇంపాక్ట్' ఓటీటీ మార్కెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. సాధారణంగా ఈటీవీ షోలు కేవలం తమ సొంత ఓటీటీ యాప్ 'ఈటీవీ విన్' (ETV Win) లో మాత్రమే ప్రసారమవుతాయి. అయితే ఈసారి అనూహ్యంగా గ్లోబల్ ఓటీటీ దిగ్గజం 'నెట్‌ఫ్లిక్స్' (Netflix) ఈ షో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
{{/usCountry}}బుల్లితెర డాన్స్ షోలలో ఎప్పుడూ లేని విధంగా 'ఢీ 21 డబుల్ ఇంపాక్ట్' ఓటీటీ మార్కెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. సాధారణంగా ఈటీవీ షోలు కేవలం తమ సొంత ఓటీటీ యాప్ 'ఈటీవీ విన్' (ETV Win) లో మాత్రమే ప్రసారమవుతాయి. అయితే ఈసారి అనూహ్యంగా గ్లోబల్ ఓటీటీ దిగ్గజం 'నెట్‌ఫ్లిక్స్' (Netflix) ఈ షో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
{{/usCountry}}రీజనల్ రియాలిటీ కంటెంట్‌కు అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్‌లలో వస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని నెట్‌ఫ్లిక్స్ ఈ భారీ డీల్ కుదుర్చుకుందని అంటున్నారు. ఇది తెలుగు బుల్లితెర నాన్-ఫిక్షన్ రంగానికి మైలురాయి లాంటిదనే టాక్ వినిపిస్తోంది.
స్ట్రీమింగ్ ఎప్పుడు?
సెప్టెంబర్ 19 నుంచి 'ఢీ 21 డబుల్ ఇంపాక్ట్' ప్రతి వారం ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్‌లలో ఒకేసారి డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది. ప్రదీప్ మార్క్ యాంకరింగ్, అనుపమ గ్లామర్, విస్మయపరిచే డాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో వస్తున్న ఈ కొత్త సీజన్ బుల్లితెరపైనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనూ భారీ వ్యూయర్‌షిప్ సాధించే అవకాశం ఉంది.