OTT Record: ఓటీటీ రికార్డు.. ఢీ డబుల్ ఇంపాక్ట్ డ్యాన్స్ షో సరికొత్త హిస్టరీ.. 2 ఎపిసోడ్లకే ఎన్ని కోట్ల వ్యూస్ అంటే?

OTT Record: పాపులర్ డ్యాన్స్ షో ‘ఢి’ ఓటీటీ ఎంట్రీలోనూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సీజన్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకు ఓటీటీ ఆడియన్స్ నుంచి గ్రేట్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ షో తొలి రెండు ఎపిసోడ్లకు ఎన్ని కోట్ల వ్యూస్ దక్కాయో ఓ సారి చూసేయండి. 

Published on: Oct 9, 2026, 12:47:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Record: తెలుగు వినోద ప్రపంచంలో డ్యాన్స్ షో అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు 'ఢీ'. గడచిన 17 ఏళ్లుగా సరికొత్త టాలెంట్‌ను వెలికితీస్తూ వస్తున్న ఈ రియాలిటీ సిరీస్, ఇప్పుడు 21వ సీజన్‌తో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఈసారి ప్రతిష్టాత్మక నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్‌లలో ఒకేసారి స్ట్రీమింగ్ అవుతుండటంతో ఓటీటీ రికార్డులు బ్రేక్ చేస్తోంది.

ఓటీటీ రికార్డు.. ఢీ డబుల్ ఇంపాక్ట్ డ్యాన్స్ షో సరికొత్త హిస్టరీ.. 2 ఎపిసోడ్లకే ఎన్ని కోట్ల వ్యూస్ అంటే? (x)
ఓటీటీ రికార్డు.. ఢీ డబుల్ ఇంపాక్ట్ డ్యాన్స్ షో సరికొత్త హిస్టరీ.. 2 ఎపిసోడ్లకే ఎన్ని కోట్ల వ్యూస్ అంటే? (x)

ఢీ 21 ఓటీటీ రికార్డు

మొదటి వారం నుంచే 'ఢీ డబుల్ ఇంపాక్ట్' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సంచలన రికార్డులు నమోదు చేస్తోంది. కేవలం ఈటీవీ విన్ అందించిన అధికారిక డేటా ప్రకారం.. తొలి 2 ఎపిసోడ్‌లకు గాను 61 లక్షలకు పైగా వ్యూస్ నమోదయ్యాయి. ప్రతి ఆడియన్ యావరేజీగా 7.3 నిమిషాల ప్రసార సమయాన్ని కేటాయించారు.

స్ట్రీమింగ్ మినిట్స్

ఓటీటీలో ఢీ 21 సీజన్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఫస్ట్ 4.47 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాల (44.8 Million Mins) వాచ్ టైమ్‌ను ఈ సీజన్ సొంతం చేసుకుంది. రాబోయే వారాల్లో పోటీ తీవ్రతరం అయ్యే కొద్దీ ఈ వ్యూయర్‌షిప్ సంఖ్యలు మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రదీప్ మాచిరాజు హోస్టింగ్

ఈ ఢీ డబుల్ ఇంపాక్ట్ సీజన్‌కు స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తన మార్కు టైమింగ్, హ్యూమర్‌తో హోస్టింగ్‌ను సరికొత్త ప్రజెంట్ చేస్తున్నారు. విచిత్రమైన కంటెస్టెంట్లు, హై-వోల్టేజ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు జడ్జ్ చేసేందుకు స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) జడ్జీలుగా ఉన్నారు. మెంటార్స్ గా తేజస్వి మడివాడ, నిఖిల్ విజయేంద్ర సింహ ఎంటర్ టైన్ చేస్తున్నారు.

డ్యాన్స్ షోకు డిమాండ్

ఓటీటీలో ఢీ 21 సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈటీవీ విన్ ప్రకారం తెలుగులోనే అత్యధిక మంది చూసిన డ్యాన్స్ షోగా ఇది నిలిచింది. రియాలిటీ షోలలో సగటున 7.3 నిమిషాల వాచ్ టైమ్ సాధించడం అనేది డిజిటల్ కంటెంట్ పరంగా చాలా బలమైన ఎంగేజ్‌మెంట్ సూచిక. సాధారణంగా ఓటీటీలలో నాన్-స్క్రిప్టెడ్ కంటెంట్‌కి ఆడియన్స్ డ్రాప్-ఆఫ్ రేట్ ఎక్కువగా ఉంటుంది.

కానీ, 'ఢీ' సాధించిన 44.8 మిలియన్ మినిట్స్ డిజిటల్ స్పేస్‌లో నాన్-ఫిక్షన్ కంటెంట్‌కు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను చాటుతోంది. రీజియనల్ ఓటీటీ అయిన ఈటీవీ విన్ వద్ద సౌత్ ఆడియన్స్ ఉండగా, నెట్‌ఫ్లిక్స్ ద్వారా మల్టీ-లింగువల్ డబ్బింగ్ ఆడియన్స్ లభిస్తున్నారు. ఈ విధానం వల్ల నిర్మాణ వ్యయం భారీగా రికవర్ అవ్వడమే కాక, కంటెంట్ లైఫ్-స్పాన్ పెరుగుతుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More