The Paradise OTT: ది ప్యారడైజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా? ఇక డిజిటల్ స్ట్రీమింగ్ లో జడల్ జమానా!
The Paradise OTT: థియేటర్లను షేక్ చేస్తున్న జడల్ జమానా ఇక ఓటీటీీలోకి రాబోతుంది. నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ పై తాజా బజ్ వైరల్ గా మారింది. మరి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రాబోతుంది? ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది? అనే విషయాలపై ఓ లుక్కేయండి.
The Paradise OTT: నేచురల్ స్టార్ నాని, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'ది ప్యారడైజ్'. థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ ఓటీటీ రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది.

ది ప్యారడైజ్ కలెక్షన్లు
నాని హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా ఈ చిత్రం కలెక్షన్లలో అదరగొడుతోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.180 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించారు. నాని కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్‌గా ఈ ఫిల్మ్ దూసుకుపోతోంది. ఈ వారాంతంతో ఈ చిత్రం థియేటర్లలో మూడో వారంలోకి అడుగుపెడుతోంది.
నాని మాస్ యాక్టింగ్
భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ మిక్స్‌డ్ టాక్ రావడంతో ది ప్యారడైజ్ బాక్సాఫీస్ రన్ కొద్దిగా మందగించింది. అయినప్పటికీ నాని మాస్ యాక్టింగ్, శ్రీకాంత్ ఓదెల టేకింగ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఈ చిత్రంలో కాయదు లోహర్ హీరోయిన్‌గా నటించగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్‌ఫుల్ విలన్ రోల్‌లో కనిపించారు.
అలాగే రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషించారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.
ది ప్యారడైజ్ ఓటీటీ
ది ప్యారడైజ్ మూవీ థియేటర్లలో ఇంకా రన్ అవుతుండగానే ది ప్యారడైజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ (OTT Release) పై సోషల్ మీడియాలో ఒక క్రేజీ బజ్ నడుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అక్టోబర్ 23, 2026 నుంచి 'ది ప్యారడైజ్' స్ట్రీమింగ్ కానుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
అయితే దీనిపై మేకర్స్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషల్లో, హిందీలో కూడా మల్టీ లాంగ్వేజ్ ఓటీటీ రిలీజ్ కావడం కన్ఫర్మ్ అయింది. థియేటర్లలో మిస్ అయిన వారు ఈ క్రేజీ యాక్షన్ డ్రామాను ఓటీటీలో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


