Nani: ఇలాంటి సినిమా మీరు ఇండియన్ స్క్రీన్‌పై చూసి ఉండరు.. ఆ కలెక్షన్లే నా సమాధానం.. అతని నెక్ట్స్ మూవీ అద్భుతం: నాని

Nani: నాని తన నెక్ట్స్ బ్లడీ రోమియోతోపాటు ది పారడైజ్ మూవీ వసూళ్లు, ట్రోల్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతేకాదు శ్రీకాంత్ ఓదెల నెక్ట్స్ మూవీ చిరంజీవితో అని, అది అద్భుతంగా ఉండబోతోందని చెప్పారు.

Published on: Oct 6, 2026, 21:52:46 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Nani: నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' (The Paradise) బాక్సాఫీస్ దగ్గర రూ. 150 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసినప్పటికీ, కంటెంట్ విషయంలో ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అయితే తన తదుపరి చిత్రం 'బ్లడీ రోమియో' (Bloody Romeo) గురించి ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. డైరెక్టర్ సుజీత్‌తో చేయబోయే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇండియన్ సినిమాలో నెవర్ బిఫోర్ కాన్సెప్ట్‌తో ఉండబోతోందని స్పష్టం చేశారు.

Nani: ఇలాంటి సినిమా మీరు ఇండియన్ స్క్రీన్‌పై చూసి ఉండరు.. ఆ కలెక్షన్లే నా సమాధానం.. అతని నెక్ట్స్ మూవీ అద్భుతం: నాని
Nani: ఇలాంటి సినిమా మీరు ఇండియన్ స్క్రీన్‌పై చూసి ఉండరు.. ఆ కలెక్షన్లే నా సమాధానం.. అతని నెక్ట్స్ మూవీ అద్భుతం: నాని

'ది పారడైజ్' రూ. 150 కోట్ల రికార్డు.. నాని, శ్రీకాంత్ ఓదెల నేర్చుకున్న పాఠం

షాకింగ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన ‘ది పారడైజ్’.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ నమోదు చేసింది. వరల్డ్‌వైడ్‌గా మొదటి రోజే రూ. 76 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, ఇప్పటివరకు ఇండియాలో రూ. 100 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ దక్కించుకుంది.

ఈ సినిమా జర్నీ తమకు ఒక పెద్ద పాఠం నేర్పిందని నాని వెల్లడించారు. ఒక సినిమా మేకింగ్‌కు ఎంత టైమ్ పట్టినా, షూటింగ్ కంటే ప్రి ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకే 60 నుంచి 70 శాతం సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శ్రీకాంత్ ఓదెల మూడో సినిమా మెగాస్టార్ చిరంజీవితో ఉండబోతోందని, అది కచ్చితంగా ఒక అద్భుతం కాబోతోందని నాని ధీమా వ్యక్తం చేశారు.

ది పారడైజ్ విషయంలో వచ్చిన ట్రోల్స్ గురించి తాను పట్టించుకోనని మరోసారి నాని స్పష్టం చేశారు. ఈ రూ.150 కోట్ల వసూళ్లే తాను ఇచ్చే సమాధానం అని నాని అనడం గమనార్హం.

సుజీత్ 'బ్లడీ రోమియో'.. హింసలో ట్విస్ట్

'సాహో', 'ఓజీ' లాంటి హై-వోల్టేజ్ స్టైలిష్ యాక్షన్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సుజీత్.. ఈసారి నానితో 'బ్లడీ రోమియో' ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ గురించి నాని మాట్లాడుతూ.. "ఈ జానర్‌లో ఇలాంటి సినిమా తెలుగులోనే కాదు, ఇండియన్ స్క్రీన్‌పైనే మనం ఇంతవరకు చూడలేదు" అని చెప్పడం విశేషం.

'ది పారడైజ్' ఇంటెన్స్ డ్రామాకు ఇది పూర్తి వ్యతిరేకంగా ఉంటుందని నాని పేర్కొన్నారు. ఈ సినిమాలో హింస ఉన్నప్పటికీ సుజీత్ ఒక డిఫరెంట్ విట్టీ ట్విస్ట్‌తో కథను మలిచారని, ప్రతీ ఒక్కరికీ పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుందని చెప్పారు. ఈ క్రేజీ యాక్షన్ డ్రామాలో ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోంది.

బ్యాక్ టు బ్యాక్ ప్రొడక్షన్.. నాని బిగ్గెస్ట్ లైనప్ ఇదే

కేవలం హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా నాని ఫుల్ బిజీగా మారారు. శ్రీకాంత్ ఓదెల - చిరంజీవి కాంబినేషన్ భారీ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్‌తో కలిసి నాని సమర్పిస్తున్నారు.

మరోవైపు తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాలో హిట్ ఫ్రాంచైజీకి చెందిన 'హిట్: ది ఫోర్త్ కేస్' (HIT 4) ను శైలేష్ కొలను దర్శకత్వంలో నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. వరుస విభిన్న కథలతో నాని బాక్సాఫీస్ దగ్గర తన హవా కొనసాగించడానికి పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More