మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న ప్యారడైజ్ చిత్ర బృందం.. ఎత్తు బంగారం ఇచ్చిన నాని
The Paradise Nani : మేడారం సమ్మక్క-సారలమ్మలను ప్యారడైజ్ చిత్ర బృందం దర్శించుకుంది. అంతేకాదు నేచురల్ స్టార్ నాని వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చారు.
తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో వెలసిన మేడారం సమ్మక్క-సారలమ్మల వనదేవతలను ‘ది ప్యారడైజ్’ చిత్రబృందం దర్శించుకుంది. ఈ సందర్భంగా కథానాయకుడు నాచురల్ స్టార్ నాని, నటుడు సంపూర్ణేష్ బాబుతో పాటు చిత్ర బృంద సభ్యులు మేడారానికి చేరుకోగా, ఆలయ అధికారులూ అర్చకులు వారికి సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.

అనంతరం నాని అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు నానికి, చిత్ర బృందానికి వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను బహూకరించారు. హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల వనదేవతలకు ఎత్తు బంగారం ఇచ్చారు. అభిమాన నటుడు నాని తమ గ్రామానికి వచ్చాడని తెలుసుకున్న స్థానికులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆలయ ప్రాంగణానికి తరలివచ్చారు.
సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైన 'ది ప్యారడైజ్' సినిమా చుట్టూ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సినిమాలో చూపించిన శంకరన్న(ఎమ్మెల్యే శంకర్ రావు) పాత్ర రూపకల్పన, మ్యానరిజమ్‌లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోలికలతో ఉన్నాయంటూ పొలిటికల్ వర్గాల్లో తీవ్ర దుమారం రేగింది. అంతేకాదు మెజారిటీ జనాలు సినిమాపై పాజిటివ్ టాక్ ఇవ్వగా.. కొందరు కావాలని నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. అయినా ఈ సినిమా జనాల్లోకి విపరీతంగా వెళ్లింది.
టాక్‌తో సంబంధం లేకుండా 'ది ప్యారడైజ్' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. దసరా కాంబినేషన్ (నాని - శ్రీకాంత్ ఓదెల) మళ్లీ రిపీట్ కావడంతో మొదటి రోజే ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ సాధించి, నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది.
1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించారు. సమాజంలో అణచివేతకు గురైన ఒక గిరిజన తెగ తమ హక్కులు, గుర్తింపు కోసం చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలో నాని జడల్ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. ఈ పాత్ర కోసం ఆయన ఊరమాస్ మేకోవర్, ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ అందరినీ ఆకట్టుకుంది.
దసరా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రమిది. సీనియర్ నటుడు మోహన్ బాబు శికంజా మాలిక్ అనే నెగెటివ్ పాత్రలో నటించగా, రాఘవ్ జుయల్, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి ఇతర కీలక పాత్రలు పోషించారు.
షూటింగ్ సమయంలో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు, గొడవలు జరిగాయంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడారు. షూటింగ్ సమయంలో నాని అన్నకు కోపం వచ్చి తిట్టిన మాట, ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిన మాట వాస్తవమే. అయితే అది పనిలో భాగమైన ఘర్షణ మాత్రమేనని, వారిద్దరి మధ్య ఉన్న బంధం సినిమాలకు అతీతమైనది. చావుకు మించినదని శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ అయ్యారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


