Nani Srikanth: ది ప్యారడైజ్ బాలేదన్నవాళ్లే పండగ చేసుకునేలా నెక్ట్ మూవీ తీస్తాం: శ్రీకాంత్ ఓదెలతో హ్యాట్రిక్‌పై హీరో నాని

Nani About 3rd Movie With Srikanth Odela: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'ది ప్యారడైజ్' సినిమాకు మొదట్లో వచ్చిన మిక్స్‌డ్ టాక్‌పై హీరో నాని స్పందించారు. లోపాలను ఒప్పుకుంటూనే, శ్రీకాంత్ ఓదెలతో వచ్చే హ్యాట్రిక్ సినిమాతో చాలా గట్టిగా కొడతామని హీరో నాని హామీ ఇచ్చారు.

Published on: Sep 27, 2026, 20:21:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Nani About 3rd Movie With Srikanth Odela: 'దసరా' సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఎనలేని అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ భారీ చిత్రం 'ది ప్యారడైజ్' ఇటీవల సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చింది.

ది ప్యారడైజ్ బాలేదన్నవాళ్లే పండగ చేసుకునేలా నెక్ట్ మూవీ తీస్తాం: శ్రీకాంత్ ఓదెలతో హ్యాట్రిక్‌పై హీరో నాని
ది ప్యారడైజ్ బాలేదన్నవాళ్లే పండగ చేసుకునేలా నెక్ట్ మూవీ తీస్తాం: శ్రీకాంత్ ఓదెలతో హ్యాట్రిక్‌పై హీరో నాని

ది ప్యారడైజ్ కలెక్షన్స్

అయితే, మొదటి షో నుంచే ది ప్యారడైజ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన ఎదురైంది. ఒక వర్గం మేకింగ్, రా నెరేషన్‌ను మెచ్చుకుంటుంటే, మరొక వర్గం మాత్రం కథనంలోని లోపాలను వేలెత్తి చూపింది.

ఇప్పుడిప్పుడు ది ప్యారడైజ్ సినిమాకు పాజిటివిటీ పెరుగుతూ వస్తోంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ది ప్యారడైజ్ చిత్రం రూ. 136 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, ది ప్యారడైజ్ మూవీపై వచ్చిన నెగెటివిటీ, మిక్స్‌డ్ టాక్‌ను నాని, శ్రీకాంత్ ఓదెల విశ్లేషించుకున్నారు.

విమర్శలపై హుందాగా నాని రియాక్షన్

సాధారణంగా మిశ్రమ స్పందన వచ్చినప్పుడు చిత్ర బృందాలు సైలెంట్ అయిపోతాయి లేదా ఫలితాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తాయి. కానీ.. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన దారి ఎంచుకుంది. విమర్శల పట్ల ఎంతో హుందాగా వ్యవహరించిన నాని ప్రేక్షకులు చెబుతున్న ప్రతి లోపాన్ని స్వీకరిస్తున్నామని స్పష్టం చేశారు.

విమర్శలను స్వీకరిస్తూ నాని సంచలన కామెంట్స్

"ఈరోజు 'ది ప్యారడైజ్' విషయంలో ప్రేక్షకులు ఇచ్చిన ప్రతి ఫీడ్‌బ్యాక్‌ను, ఎత్తిచూపిన లోపాలను పూర్తి బాధ్యతతో స్వీకరిస్తున్నాం. ఇప్పుడు చూపిస్తున్న నెగెటివ్‌లను మా తదుపరి పనిలో ప్లస్ పాయింట్లుగా మార్చుకుంటాం" అని నాని అన్నారు.

"శ్రీకాంత్ నుంచి వచ్చే తదుపరి సినిమా, నా నుంచి వచ్చే సినిమా లేదా మేమిద్దరం కలిసి చేసే ప్రాజెక్ట్ ఏదైనా సరే మునుపటి కంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు అందరు ఎవరైతే సినిమా బాలేదని ఫైట్ చేస్తున్నారో వాళ్లు కూడా సెలబ్రేట్ (పండగ) చేసుకోవాలి. అలాంటి ఒకటి కచ్చితంగా తీస్తాం" అని హీరో నాని తేల్చి చెప్పారు.

లోపాలు అంగీకరించిన దర్శకుడు శ్రీకాంత్

ది ప్యారడైజ్ సినిమా మేకింగ్‌లో జరిగిన పొరపాట్లను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సైతం దాచకుండా ఒప్పుకున్నారు. ఎడిటింగ్ విభాగంలో దొర్లిన కొన్ని పొరపాట్ల వల్లే కథనం సరిగ్గా ప్రేక్షకులకు చేరలేకపోయిందని ఆయన తెలిపారు. అయితే ఈ అనుభవాలు తనను మరింత రాటుదేలేలా చేశాయని, రాబోయే సినిమాలో ప్రతీ లోపాన్ని సరిదిద్ది పవర్‌ఫుల్ అవుట్‌పుట్ ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు.

కథనంపై వస్తున్న ప్రతికూల వ్యాఖ్యలను నాని ఎంతో పాజిటివ్‌గా విశ్లేషించారు. "సినిమా నచ్చలేదనే వారిలో ఎంత కోపం ఉందో, నచ్చిందనే వారిలోనూ అంతే ఆవేశం కనిపిస్తోంది. ఇది కేవలం ఒక సినిమాపై అభిప్రాయం మాత్రమే కాదు, మా కాంబినేషన్‌పై ప్రేక్షకులు ఉన్న అమితమైన నమ్మకానికి నిదర్శనం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి భవిష్యత్తులో మరింత సత్తా చాటుతాం" అని నాని స్పష్టం చేశారు.

హ్యాట్రిక్ కాంబోపై అభిమానుల్లో జోష్

సాధారణంగా ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద తడబడితే హీరోలు, దర్శకులు ఆ కాంబినేషన్‌ను రిపీట్ చేయడానికి సాహసించరు. కానీ, లోపాలను నిక్కచ్చిగా ఒప్పుకుంటూనే, "మా ప్రయాణం ఆగదు.. నెక్ట్స్ కొడితే అందరి నోళ్లూ మూతపడాల్సిందే" అనే రీతిలో నాని, శ్రీకాంత్ మళ్లీ జతకట్టేందుకు సిద్ధమవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటికీ అయితే అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా ఖాయమని తెలియడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ది ప్యారడైజ్ విడుదల తర్వాత పోస్ట్ రిలీజ్ టాక్స్ ఇంటర్వ్యూలో హీరో నాని ఈ కామెంట్స్ చేయడం వైరల్ అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More