The Paradise Collection: రెండో రోజు 14 కోట్లు- 100 కోట్లకు దగ్గరిగా నాని ది ప్యారడైజ్- వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
Nani The Paradise Box Office Collection Day 2: హీరో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ది ప్యారడైజ్ బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రికార్డు స్థాయి వసూళ్లు సాధించగా.. రెండో రోజు 14.90 కోట్లు రాబట్టింది. రెండు రోజుల్లోనే రూ. 100 కోట్లకు దగ్గరగా ఉన్న ది ప్యారడైజ్ 2 డేస్ కలెక్షన్స్ పూర్తి రిపోర్ట్ చూద్దాం.
Nani The Paradise 2 Days Worldwide Box Office Collection: నేచురల్ స్టార్ నాని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డ్రామా 'ది ప్యారడైజ్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీతో ఖాతా తెరిచింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ఈ చిత్రం బుధవారం (సెప్టెంబర్ 23) పెయిడ్ ప్రీమియర్లు, గురువారం (సెప్టెంబర్ 24) గ్రాండ్ రిలీజ్‌తో థియేటర్లలోకి వచ్చింది.

నాని కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా ది ప్యారడైజ్ నిలిచినప్పటికీ, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఫలితంగా రెండో రోజు వసూళ్లలో స్పష్టమైన తగ్గుదల కనిపించింది.
57 శాతం పడిపోయిన కలెక్షన్స్
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, శుక్రవారం (సెప్టెంబర్ 25) రెండో రోజు ది ప్యారడైజ్ చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద రూ. 14.90 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. అయితే, తొలిరోజుతో పోలిస్తే ఏకంగా 57 శాతం మేర వసూళ్లు పడిపోయాయి. దీంతో రెండ్రోజుల్లో దేశీయంగా మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 61.15 కోట్లకు చేరుకున్నాయి.
శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా 7,046 షోలు ప్రదర్శించగా, కేవలం 31 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. గతంలో నాని నటించిన 'హిట్: ది థర్డ్ కేస్' రెండో రోజు నాటికి రూ. 31.50 కోట్లు, 'దసరా' చిత్రం రూ. 32.95 కోట్లు వసూలు చేశాయి. ఈ రెండు సినిమాలు రెండో రోజు వరుసగా రూ. 10.50 కోట్లు, రూ. 9.75 కోట్ల నెట్ వసూళ్లను సాధించగా.. వాటితో పోలిస్తే 'ది ప్యారడైజ్' రికార్డు స్థాయిలో ముందంజలో ఉందనే చెప్పాలి.
రెండు రోజుల్లో ఎంతొచ్చిందంటే?
ఇక ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో ది ప్యారడైజ్ సినిమాకు రూ. 98.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన ది ప్యారడైజ్ సినిమా సుమారుగా 100 కోట్ల కలెక్షన్స్‌కు దగ్గరిగా ఉంది. అలాగే, ఇండియాలో రూ. 72.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ది ప్యారడైజ్' చిత్రానికి పెద్దగా పోటీ లేకపోవడం వీకెండ్‌లో వసూళ్లు మళ్లీ పుంజుకునేందుకు అవకాశాన్నిస్తోంది. అయితే నెగెటివ్ టాక్, విమర్శల నడుమ ఈ వీకెండ్‌లో బొమ్మ ఎలా నిలబడుతుందనేది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
రికార్డు స్థాయి ఓపెనింగ్స్..
విడుదలకు ముందు రోజు సాయంత్రం వేసిన ప్రీమియర్ల ద్వారానే ఈ చిత్రం రూ. 11.60 కోట్లు కొల్లగొట్టింది. మొదటి రోజు గురువారం రూ. 34.65 కోట్లు సాధించి, మొత్తం రూ. 46.25 కోట్ల గ్రాండ్ ఓపెనింగ్ నమోదు చేసింది. నాని కెరీర్‌లోనే ఇది ఆల్‌టైమ్ రికార్డు ఓపెనింగ్ కావడం విశేషం.
అసలు కథేంటంటే?
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి, ఇషాన్ సక్సేనా ఈ చిత్రాన్ని నిర్మించారు. 1980ల నాటి నేపథ్యంలో సాగే ఈ కథలో 'సవారి' తెగకు చెందిన ప్రజలు పౌరసత్వం కోసం చేసే పోరాటాన్ని చూపించారు.
ఈ తెగ నాయకురాలు సమ్మక్క పాత్రలో సోనాలి కులకర్ణి, ఆమె కుమారుడు జడల్ పాత్రలో నాని అద్భుతమైన నటన కనబరిచారు. భూస్వామి షికాంజా మాలిక్‌గా మోహన్ బాబు, అతడి కుమారుడు విక్రమ్ మాలిక్‌గా రాఘవ్ జుయల్ నటించారు. వ్యవస్థపై, అణచివేతపై తిరుగుబాటు చేసే కథాంశంతో సినిమా రూపుదిద్దుకుంది.
నాని రియాక్షన్
ఇకపోతే సినిమాపై వస్తున్న విమర్శలపై "మీ స్పందనలు, ప్రతిచర్యలన్నింటినీ చూశాను. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు, అలాగే మీ సరదా ట్రోళ్లను కూడా సమానంగా ఆస్వాదించాను. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తమదిగా భావించిన విధానం నా మనసును తాకింది. విమర్శకులు, రివ్యూయర్లు ఎత్తిచూపిన లోపాల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను" అని హీరో నాని పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


