Kalyanam Kamaneeyam Jeevitham Review: కళ్యాణం కమనీయం జీవితం రివ్యూ- జెన్‌జీ లవ్‌స్టోరీకి థ్రిల్లర్ ట్విస్ట్- ఎలా ఉందంటే?

Kalyanam Kamaneeyam Jeevitham Review And Rating In Telugu: ఖాన్ దుర్రానీ, సాహితి అవంచ జంటగా తెరకెక్కిన చిత్రం 'కళ్యాణం కమనీయం జీవితం'. జెన్‌జీ ఆలోచనలకు ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించిన ఈ లవ్ థ్రిల్లర్ ఎలా ఉందో నేటి కళ్యాణం కమనీయం జీవితం రివ్యూలో చూద్దాం.

Published on: Sep 25, 2026, 20:36:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Kalyanam Kamaneeyam Jeevitham Review And Rating In Telugu: ప్రేమ, పెళ్లి, అనుమానం, ప్రతీకారం అనే అంశాలు వెండితెరకు కొత్తేమీ కావు. అయితే, నేటితరం జెన్‌జీ యువత ఆలోచనలకు పాతకాలపు భావోద్వేగాలను, ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ కోణాన్ని జోడించి చెప్పిన సినిమానే 'కళ్యాణం కమనీయం జీవితం'.

కళ్యాణం కమనీయం జీవితం రివ్యూ- జెన్‌జీ లవ్‌స్టోరీకి థ్రిల్లర్ ట్విస్ట్- ఎలా ఉందంటే?
కళ్యాణం కమనీయం జీవితం రివ్యూ- జెన్‌జీ లవ్‌స్టోరీకి థ్రిల్లర్ ట్విస్ట్- ఎలా ఉందంటే?

లవ్ థ్రిల్లర్ డ్రామా

రవి లోకిరెడ్డి దర్శకత్వంలో ఖాన్ దుర్రానీ, సాహితి అవంచ జంటగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని వీవీఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పైలా ప్రసాదరావు, కిషోర్ గుండాల నిర్మించారు. రాజవంశీ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన ఈ లవ్ థ్రిల్లర్ ఇవాళ (సెప్టెంబర్ 25) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి కళ్యాణం కమనీయం జీవితం రివ్యూలో తెలుసుకుందాం.

రెండు దారుల నడుమ జెన్‌జీ సందిగ్ధత.. కథేంటంటే?

హీరోయిన్ సునయన ఒక ఆధునిక జెన్‌జీ యువతి. తన జీవితంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఎవరిని ఎంచుకోవాలనే పెద్ద సందిగ్ధంలో పడుతుంది. నిజమైన ప్రేమకు, కేవలం ఆకర్షణకు తేడా ఏంటో తెలియక సతమతమవుతున్న సమయంలో ఒక సముద్ర తీరంలో విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ ఒక భిక్షగాడు ఆమెకు 'కల్యాణ్–కమనీయ' అనే దంపతుల ప్రేమకథను వివరిస్తాడు.

ఎంతో అన్యోన్యంగా సాగుతున్న ఆ దంపతుల జీవితంలోకి రాహుల్ అనే వ్యక్తి ప్రవేశిస్తాడు. అతడి పగ, గతం, కుట్రల కారణంగా ఆ దంపతుల నడుమ అనుమానాలు, వివాదాలు మొదలవుతాయి. అసలు కల్యాణ్-కమనీయ కథకు, నేటితరం సునయన నిర్ణయాలకు ఉన్న లింక్ ఏంటి? రాహుల్ ఎవరు? చివరికి సునయన ఏ నిర్ణయం తీసుకుంది? అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

దర్శకుడి ఆలోచన.. నటీనటుల ప్రతిభ!

రొటీన్ రొమాంటిక్ డ్రామాలా కాకుండా, గతాన్ని వర్తమానంతో ముడిపెడుతూ సస్పెన్స్ ఎలిమెంట్స్ తోడయ్యేలా దర్శకుడు రవి లోకిరెడ్డి కథనాన్ని రాసుకున్నారు. బంధాల్లో నమ్మకం ఎంత కీలకమో చెప్పే ప్రయత్నం చేశారు. సెకండాఫ్‌లో ఉత్కంఠ రేకెత్తించే ట్విస్టులను మరికాస్త బలంగా రాసుకుని ఉంటే థ్రిల్లర్ మోతాదు మరింత పెరిగేది.

హీరో ఖాన్ దుర్రానీ తన పాత్రలో ఒదిగిపోయారు. ప్రేమ సన్నివేశాలతో పాటు భావోద్వేగాలు, గందరగోళం ఉండే దృశ్యాల్లో చక్కని నటన కనబరిచారు. హీరోయిన్ సాహితి అవంచ సరికొత్త హావభావాలతో మెప్పించారు. ప్రేమ, కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోయే పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. కథను నడిపించే సునయన పాత్ర నేటి యువత వైఖరికి ప్రతిబింబంగా నిలుస్తుంది.

సాంకేతిక బలం.. నిర్మాణ విలువలు!

సినిమాకు సాంకేతిక విభాగం మంచి సహకారం అందించింది. ఎడిటర్ ఉద్ధవ్ గతం, వర్తమానం మధ్య సాగే సన్నివేశాలను గందరగోళం లేకుండా ఎడిట్ చేసి స్క్రీన్ ప్లే ఫోని చాలా బాగా కాపాడారు. శ్రీమురళి కార్తికేయ అందించిన పాటలు, నేపథ్య సంగీతం రొమాంటిక్, థ్రిల్లర్ మూడ్‌ను ఎలివేట్ చేయడంలో తోడ్పడ్డాయి.

కెమెరా పనితనం ప్రతి దృశ్యాన్ని ఆకట్టుకునేలా ఆవిష్కరించింది. సత్యానంద్ లంక, కాకినాడ నాని, సోనీ రెడ్డి, ధనలక్ష్మి బల్ల తమ పరిధి మేరకు మంచి నటన కనబరిచారు.

ఫైనల్‌గా చెప్పాలంటే?

మొత్తానికి 'కళ్యాణం కమనీయం జీవితం' సినిమా కేవలం ఒక రొమాంటిక్ డ్రామా మాత్రమే కాదు. నమ్మకం, భావోద్వేగాలు, సస్పెన్స్ మిళితమైన మంచి ప్రయత్నం. జెన్‌జీ ప్రేమకథలను, ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లర్ కథాంశాలను కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు.

రేటింగ్: 2.5/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More