OTT: ఓటీటీలోకి ఫ్యామిలీ క్రైమ్ కోర్ట్ డ్రామా ఆక్టోపస్- ఇంటిపక్కల వాళ్లంతా ఒక్కటై చేపట్టే మిషన్- రహస్యాలు, మిస్టరీతో!

Tamil Web Series Octopus OTT Streaming: రహస్యాలు, మిస్టరీసాగే థ్రిల్లింగ్ ఫ్యామిలీ క్రైమ్ కోర్ట్ డ్రామా సిరీస్ ఆక్టోపస్. కొత్తగా పెళ్లయి పొరిగింటికి వచ్చిన యువతి కోసం చుట్టుపక్కలవారంతా ఒక్కటై చేపట్టే మిషన్ కథగా ఈ ఓటీటీ సిరీస్ తెరకెక్కింది. ఆక్టోపస్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Sep 19, 2026, 14:04:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tamil Web Series Octopus OTT Release: ఇటీవల ఎప్పటికప్పుడు ఓటీటీలు సరికొత్త కంటెంట్‌తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీలోకి న్యూ ఫ్యామిలీ క్రైమ్ కోర్ట్ డ్రామా వెబ్ సిరీస్ ఆక్టోపస్ వచ్చేయనుంది.

ఓటీటీలోకి ఫ్యామిలీ క్రైమ్ కోర్ట్ డ్రామా ఆక్టోపస్- చుట్టుపక్కల వాళ్లంతా ఒక్కటై చేపట్టే మిషన్- రహస్యాలు, మిస్టరీతో!
ఓటీటీలోకి ఫ్యామిలీ క్రైమ్ కోర్ట్ డ్రామా ఆక్టోపస్- చుట్టుపక్కల వాళ్లంతా ఒక్కటై చేపట్టే మిషన్- రహస్యాలు, మిస్టరీతో!

ఓటీటీ ప్రీమియర్‌కు సిద్ధం

అయితే, జీ5 ఓటీటీ సంస్థ ఒరిజినల్ సిరీస్‌ల‌కు సంబంధించిన‌ విభాగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటూ.. విభిన్న జోన‌ర్స్‌లో ఆసక్తికరమైన ప్రాంతీయ కథలను ప్రేక్షకులకు అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ‘ఆక్టోపస్’ అనే ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఓటీటీ ప్రీమియర్‌కు సిద్ధం చేసింది.

ఈ సిరీస్‌లో శక్తివంతమైన మహిళా ప్రధాన కథతో పాటు.. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ఇప్పటివరకు ఉన్న సంప్రదాయ కథనాలకు భిన్నంగా కొత్త తరహా అనుభూతిని అందించనుంది. రహస్యాలు, మిస్టరీలతో ఈ కోర్ట్ రూమ్ డ్రామాను రూపొందించారు.

యువతి కోసం చేపట్టే మిషన్

కొత్తగా పెళ్లయి పక్కింటికి వచ్చిన ఓ యువతి కోసం చుట్టుపక్కల వాళ్లంతా ఒక్కటై చేపట్టే మిషన్ చుట్టూ ఈ ఓటీటీ సిరీస్ సాగనుందని తెలుస్తోంది. జయచంద్ర హష్మీ దర్శకత్వంలో రూపొందిన ఈ 7 ఎపిసోడ్స్‌ తమిళ జీ5 ఒరిజినల్ సిరీస్‌లో అశ్విన్, అర్చన, వినోత్ కిషన్, సిద్ధు కుమరేశన్, కలైవాణి భాస్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మిస్టరీ, భావోద్వేగాలు, ఉత్కంఠను కలగలిసిన‌ ‘ఆక్టోపస్’ కథ.. తమ ప్రాంతానికి చెందిన ఓ యువతి కనిపించకుండా పోవడంతో నిజం ఏంటో తెలుసుకునేందుకు ఒక్కటైన సన్నిహిత పొరుగువారి చుట్టూ సాగుతుంది. ఆమె అదృశ్యం వెనుక అసలు కారణాన్ని తెలుసుకునే క్రమంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి.

ఆక్టోపస్ లాంచ్ ప్రోమో

దాంతో ఇప్పటివరకు దాగి ఉన్న ఎన్నో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ.. కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. తమిళ జీ5 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ‘ఆక్టోపస్’ లాంచ్ ప్రోమో విడుదలైనప్పటి నుంచి ఈ సిరీస్‌పై ఆన్‌లైన్‌లో మంచి ఆసక్తి నెలకొంది.

ఆసక్తికరమైన కథాంశంతో పాటు అభిమానుల చర్చలు, అంచనాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలతో ‘ఆక్టోపస్’పై క్యూరియాసిటీ పెరుగుతోంది. కేవలం సస్పెన్స్ థ్రిల్లర్‌గానే కాకుండా.. నమ్మకం, సంబంధాలు, పట్టుదల, మనుషుల మధ్య ఉండే బంధాల బలం వంటి ఆసక్తికరమైన అంశాలను కూడా ఈ సిరీస్‌లో చూపించనున్నారు.

ఆక్టోపస్ ఓటీటీ స్ట్రీమింగ్

మన రోజువారీ జీవితానికి దగ్గరగా ఉండే పరిస్థితులను ఆధారంగా చేసుకుని, బలమైన భావోద్వేగాలతో సాగే కథనం ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా చూసేలా చేయడంతో పాటు.. అసలు ఏం జరగబోతోందనే ఉత్కంఠను రేకెత్తించనుంది.

కాగా, జీ5లోనే ఆక్టోపస్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. కానీ, ఆక్టోపస్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇటీవల ఆక్టోపస్ ప్రోమోను విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా జీ5 ఓటీటీ బిజినెస్ హెడ్ తమిళం, తెలుగు, మలయాళం లాయిడ్ సి. జేవియర్ ఆక్టోపస్‌కు సంబంధించిన వివరాలు చెప్పారు.

చాలా కాలంగా ఆదరిస్తున్నారు

"‘ఆక్టోపస్’ లాంచ్ ప్రోమోకు వచ్చిన రెస్పాన్స్‌ చూసి మేం ఎంతో ఆనందంగా ఉన్నాం. ఈ ఉత్కంఠభరితమైన కథను ప్రేక్షకులు చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. తమిళ ప్రేక్షకులు చాలా కాలంగా క్రైమ్ మిస్టరీలు, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లను ఆదరిస్తున్నారు. అయితే ‘ఆక్టోపస్’ ఈ జోనర్‌కు ఓ కొత్త కోణాన్ని పరిచయం చేయనుంది" అని లాయిడ్ సి జేవియర్ పేర్కొన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More