100 రూపాయలతో టికెట్ కొంటే డబుల్ ఎంజాయ్ చేస్తారు, చాలా ట్విస్టులు ఉంటాయి.. ఛాలెంజ్ చేసిన డైరెక్టర్ రవి లోకిరెడ్డి
Director Ravi Lokireddy On Kalyanam Kamaneeyam Jeevitham Movie: తెలుగులో వస్తున్న సరికొత్త ఫ్యామిలీ డ్రామా సినిమా కళ్యాణం కమనీయం జీవితం. సెప్టెంబర్ 25న రిలీజ్ సందర్భంగా నిర్వహించిన మూవీ ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ రవి లోకిరెడ్డి, నిర్మాత పైలా ప్రసాద్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Director Ravi Lokireddy On Kalyanam Kamaneeyam Jeevitham Movie: వీవీఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా "కళ్యాణం కమనీయం జీవితం". ఈ సినిమాకు రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించారు. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మించారు.

కళ్యాణం కమనీయం జీవితం ప్రెస్ మీట్
కళ్యాణం కమనీయం జీవితం చిత్రాన్ని ఈ నెల 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా "కళ్యాణం కమనీయం జీవితం" సినిమా టీమ్ సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
నిర్మాత పైలా ప్రసాద్ రావు మాట్లాడుతూ.. "రీసెంట్‌గా మా కళ్యాణం కమనీయం జీవితం సినిమాని మా ఫ్రెండ్స్‌కి , శ్రేయోభిలాషులకు కొంతమంది మీడియా మిత్రులకు చూపించడం జరిగింది. సినిమాని చూసిన తర్వాత సినిమా చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. మంచి వ్యక్తులతో ఈ సినిమా ప్రారంభమైంది" అని అన్నారు.
సినిమా చిన్నదైనా కంటెంట్ పెద్దది
"లెజండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు సినిమా పోస్టర్‌ను, చంద్రబోస్ గారు పాటను విడుదల చేశారు. వీవీ వినాయక్ గారు కూడా మా ఈవెంట్‌కు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. మంచి ఫ్యామిలీ, యూత్ ఓరియంటెడ్ మూవీగా మా డైరెక్టర్ తీర్చిదిద్దారు. ఈ మూవీలో నటించిన యాక్టర్స్ అంతా ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు" అని నిర్మాత పైలా ప్రసాద్ రావు తెలిపారు.
"శ్రీ మురళి కార్తికేయ మంచి పాటలను, సంగీతాన్ని అందించారు. ఈ నెల 25న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. మూవీ చిన్నదైనా కంటెంట్ చాలా పెద్దది. డైరెక్టర్ రవి లోకిరెడ్డి, రైటర్ అరవింద్ ఏకలవ్య మంచిగా సినిమాని తీర్చిదిద్దారు. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉంది" అని పేర్కొన్నారు ప్రొడ్యూసర్ పైలా ప్రసాద్ రావు.
100 రూపాయలు పెట్టి టికెట్ కొంటే
డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. "టైటిల్ విని మా నిర్మాతలు ఈ సినిమాని ఒకే చేశారు. ఇందులో సాంగ్స్, ట్రైలర్‌కు మంచిరెస్పాన్స్ వచ్చింది. మేమందరం చాలా కష్టపడి ఈ సినిమాని తీర్చిదిద్దాము. మంచి పాటలు ఉంటాయి, మంచి కథ ఉంటుంది, మంచి ఎమోషన్ ఉంటుంది" అని అన్నారు.
"నటీనటులు కొత్త వారైనా చాలా బాగా నటించారు. సత్యానంద్ గారు కూడా నటించారు ఆయన ఎంతోమంది నటీనటులకు నటనలో శిక్షణ ఇచ్చారు. సినిమాకొచ్చిన ఆడియెన్స్ డిసప్పాయింట్ అవ్వరు. 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటే దానికి డబల్ మీరు ఎంజే చేస్తారు చాలా ట్విస్టులు ఉంటాయి" అని దర్శకుడు రవి లోకిరెడ్డి హామీ ఇచ్చారు.
ప్రేమతో చూస్తారని ఆశిస్తున్నా
"ఈనెల 25 న ఆంధ్ర, తెలంగాణలో మా సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. సినిమా చూసిన వారు అసలు డిసప్పాయింట్ అవ్వరు. ఇది నా ఛాలెంజ్" అని సవాలు విసిరారు డైరెక్టర్ రవి లోకిరెడ్డి.
హీరోయిన్ సాహితి ఆవంచ మాట్లాడుతూ.. "నేను ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించాను. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకుడు గారికి థాంక్స్. నన్ను నమ్మి నాతో నటించిన అందరికీ థాంక్స్. కళ్యాణం కమనీయం జీవితం సినిమా ఈనెల 25న రిలీజ్ అవుతోంది. చాలా ఎగ్జైట్‌గా ఉన్నాను. ప్రేమతో చేసిన ఈ సినిమాని అంతే ప్రేమతో ఆడియన్స్ చూస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


