Nude Ad: ఒంటిపై దుస్తులు లేకుండా హీరోయిన్ స్పోర్ట్స్ యాడ్- ఆ బాల్స్ కవర్ చేస్తూ నగ్నంగా- దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Sydney Sweeney Nude Ad Controversy: హీరోయిన్ సిడ్నీ స్వీనీ చేసిన కొత్త స్పోర్ట్స్ న్యూడ్ యాడ్ తీవ్ర వివాదానికి దారితీసింది. క్రీడా పరికరాలతో ఒంటిపై దుస్తులు లేకుండా అసభ్యకరంగా ఫొటోషూట్ చేసి మహిళా అథ్లెట్ల కష్టాన్ని చులకన చేశారంటూ నెటిజన్లు, క్రీడాకారిణులు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
Sydney Sweeney Nude Ad Controversy: హాలీవుడ్ భామ, ‘యుఫోరియా’ ఓటీటీ సిరీస్ ఫేమ్ సిడ్నీ స్వీనీ మళ్లీ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. గతేడాది అమెరికన్ ఈగిల్ డెనిమ్ యాడ్‌తో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ హీరోయిన్ ఇప్పుడు 'నొవిగ్' (Novig) అనే స్పోర్ట్స్ ట్రేడింగ్ యాప్ కోసం చేసిన కొత్త ప్రచారంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

అసభ్యకర ప్రకటనలు
క్రీడల్లో మహిళల సాధికారత కోసం పోరాడుతున్న సమయంలో ఇలాంటి అసభ్యకర ప్రకటనలు తీసుకురావడం వెనకడుగు వేయడమేనని మహిళా అథ్లెట్లు మండిపడుతున్నారు. స్పోర్ట్స్ ట్రేడింగ్ యాప్ నొవిగ్ విడుదల చేసిన ఈ ప్రచార చిత్రంలో సిడ్నీ స్వీనీ ఒంటిపై దుస్తులు లేకుండా కనిపించారు.
క్రీడా పరికరాలతో వివాదాస్పద శైలిలో..
ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, హాకీ ప్యాడ్లు, టెన్నిస్ రాకెట్లు వంటి క్రీడా పరికరాలను మాత్రమే అడ్డుగా పెట్టుకుని భంగిమలు ఇచ్చారు నటి సిడ్నీ స్వీనీ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే నెటిజన్లు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రీడలను, మహిళా అథ్లెట్లను కేవలం గ్లామర్ కోణంలో చూపేలా ఈ యాడ్ ఉందని విమర్శలు గుప్పించారు.
‘మహిళా అథ్లెట్ల శ్రమను నీరుగార్చారు!’
ఈ ప్రకటనపై ప్రత్యేకించి మహిళా క్రీడాకారిణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సిడ్నీ స్వీనీ ప్రవర్తనపై కామెంట్ల వర్షం కురిపిస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు.
"మా ప్రతిభ, శక్తి, సాధించిన విజయాల ద్వారా గుర్తింపు సాధించడానికి ఏళ్లుగా పోరాడుతున్నాం. అంతే తప్ప మా శరీరాలతో గుర్తింపు తెచ్చుకోవాలని అనుకోవడం లేదు. ఒక మాజీ అథ్లెట్‌గా, ఇలాంటి వ్యాఖ్యలు ఎదుర్కొన్న మహిళగా ఈ ప్రచారం నన్ను తీవ్రంగా నిరాశపరిచింది" అని ఒక మాజీ అథ్లెట్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్క యాడ్‌తో వెనక్కి నెట్టేసినందుకు
"క్రీడల్లో మహిళలు తమ ఉనికి కోసం పడుతున్న కష్టాన్ని ఒక్క యాడ్‌తో వెనక్కి నెట్టేసినందుకు ధన్యవాదాలు" అంటూ మరొకరు ఎద్దేవా చేశారు. క్రీడలను ఈ స్థాయిలో గ్లామరైజ్ చేయడం ఏమాత్రం తగదని, ప్రచారం కోసం సిడ్నీ ఏ స్థాయికైనా దిగజారుతుందని కామెంట్లు వస్తున్నాయి. చిన్నపిల్లలు ఉండే సమాజంలో ఇలాంటి వాటిని సాధారణ విషయాలుగా మార్చకూడదని స్పష్టం చేస్తున్నారు.
వరుస వివాదాలు.. తాజా సినిమాలు
ఇదిలా ఉంటే, సిడ్నీ స్వీనీకి ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. గతేడాది జులైలో వచ్చిన డెనిమ్ ప్రకటన కూడా తీవ్ర చర్చకు దారితీసింది. వృత్తిపరంగా చూస్తే, జెండాయా, జాకబ్ ఎలోర్డీలతో కలిసి నటించిన హెచ్‌బీవో ప్రముఖ ఓటీటీ సిరీస్ ‘యుఫోరియా’ మూడో సీజన్‌లో 'క్యాసీ' పాత్రలో సిడ్నీ స్వీనీ కనిపించింది.
జియోహాట్‌స్టార్ ఓటీటీలో
ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో యుఫోరియా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. యుఫోరియా 3 సీజన్లు జియో హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు 'క్రిస్టీ' అనే స్పోర్ట్స్ డ్రామా, 'ది హౌస్‌మెయిడ్' అనే థ్రిల్లర్ చిత్రాల్లోనూ సిడ్నీ స్వీనీ కీలక పాత్రలు పోషించింది.
కేవలం ప్రచారం కోసమే
క్రీడా రంగానికి, గ్లామర్ రంగానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని దాటి కేవలం ప్రచారం కోసం ఇలాంటి ప్రకటనలు రూపొందించడంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


