Producer: నేను లాభపడకపోయినా ఫర్వాలేదు కానీ నష్టపోవడానికి సిద్దంగా లేను.. నిర్మాత పైలా ప్రసాద్ రావు కామెంట్స్
Kalyanam Kamaneeyam Jeevitham Producer Comments: ఖాన్ దురాని, సాహితి వంచ హీరో హీరోయన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ కళ్యాణం కమనీయం జీవితం. రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత పైలా ప్రసాద్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Kalyanam Kamaneeyam Jeevitham Producer Comments: వీవీఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కిన సినిమా "కళ్యాణం కమనీయం జీవితం". ఈ సినిమాకు రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించగా.. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మించారు.

కళ్యాణం కమనీయం జీవితం ట్రైలర్ లాంచ్
కళ్యాణం కమనీయం జీవితం సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. "కళ్యాణం కమనీయం జీవితం" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ మంగళవారం (సెప్టెంబర్ 8) సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఈ కళ్యాణం కమనీయం జీవితం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్, నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత పైలా ప్రసాద్ రావు, సంగీత దర్శకుడు శ్రీ మురళి కార్తికేయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఆ ఒక్క పాటతో అవకాశం
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ మురళీ కార్తికేయ మాట్లాడుతూ.. "నేను కంపోజ్ చేసిన ఒక పాట వల్ల నాకు ఈ మూవీ అవకాశం వచ్చింది. ఈ సినిమాకు మంచి సాంగ్స్, బీజీఎమ్ అందించే అవకాశం దక్కింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం కావాల్సినంత సమయం లభించింది. పాట ట్యూన్‌తో పాటు సాహిత్యం అద్భుతంగా కుదిరాయి. మీ అందరికీ నచ్చేలా మా మూవీ ఉంటుంది" అని అన్నారు.
ప్రొడ్యూసర్ పైలా ప్రసాద్ రావు మాట్లాడుతూ.. "యూఎస్‌లో సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న మాకు సినిమా అంటే ప్యాషన్. మేము గతంలో 24 కిస్సెస్ మూవీ నిర్మించాం. కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తూ ఇన్నోవేటివ్ కంటెంట్‌ను ఆడియెన్స్‌కు చూపించాలనే ప్రయత్నంతో మా సొంత బ్యానర్‌పై కళ్యాణం కమనీయం జీవితం సినిమాను నిర్మించాం" అని చెప్పారు.
నష్టపోడానికి సిద్ధంగా లేను
"నేను లాభపడకపోయినా ఫర్వాలేదు కానీ నష్టపోవడానికి సిద్దంగా లేను. మనందరిలో ఒకరికి జరిగే లాంటి కథే ఇది. ఈ సినిమాలో లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మా సినిమా ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి" అని నిర్మాత పైలా ప్రసాద్ రావు అన్నారు.
"ఈ సినిమాకు పనిచేసింది కొత్త వారైనా ఎక్కడా కొత్త వారు చేసిన సినిమాలా అనిపించదు. శ్రీ మురళీ కార్తికేయ అందించిన మ్యూజిక్ ఆకర్షణగా నిలుస్తుంది. మా సినిమాను అందంగా రూపొందించారు డైరెక్టర్ రవి లోకిరెడ్డి. నాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించిన కిషోర్ గారికి థ్యాంక్స్. మా మూవీని మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా" అని ప్రొడ్యూసర్ పైలా ప్రసాద్ రావు కోరారు.
సినిమా తీసినవాళ్లు చిన్నోళ్లు కాదు
డైరెక్టర్ వీవీవినాయక్ మాట్లాడుతూ.. "ఈ సినిమా చిన్నదే గానీ సినిమా తీసిన వాళ్లు చిన్న వాళ్లు కాదు. ఈ చిత్రంతో ఒక కొత్త దర్శకుడికి అవకాశం కల్పించినందుకు ప్రొడ్యూసర్స్ ప్రసాదరావు, కిషోర్ గారికి మా డైరెక్టర్స్ అందరి తరుపున థ్యాంక్స్ చెబుతున్నా" అని చెప్పారు.
"మా సత్యనారాయణ రెడ్డి గారికి మంచి మిత్రులు రాజవంశీ ఈ సినిమాను చూసి నచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వారికి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి. అలాగే ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి మూవీలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ మంచి పేరు, గుర్తింపు రావాలి. ఈ సినిమా సక్సెస్ తో ప్రొడ్యూసర్స్ ప్రసాదరావు గారికి, కిషోర్ గారికి మరిన్ని మూవీస్ చేసే బలం చేకూరాలని కోరుకుంటున్నా" అని దర్శకుడు వినాయక్ ఆకాంక్షించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


