The Paradise Record: ఏకంగా 10 సినిమాల రికార్డును బ్రేక్ చేసిన నాని ది ప్యారడైజ్- శ్రీకాంత్ ఓదెల సినిమా అసలు క్రేజ్ ఇది!

Nani The Paradise Breaks 10 Movies Records: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'ది ప్యారడైజ్' బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తోంది. ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ సినిమా ఏకంగా 10 సినిమాల రికార్డులను తుడిచిపెట్టి మూవీ అసలు క్రేజ్ ఏంటో చాటిచెప్పింది.

Published on: Sep 26, 2026, 05:29:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Nani The Paradise Breaks 10 Movies Records: అగ్ర దర్శకుడు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తొలి సినిమా దసరాతో డైరెక్టర్‌గా తానేంటో నిరూపించుకున్నాడు. నేచురల్ స్టార్ నానితో తెరకెక్కించిన దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ఏకంగా 10 సినిమాల రికార్డును బ్రేక్ చేసిన నాని ది ప్యారడైజ్- శ్రీకాంత్ ఓదెల సినిమా అసలు క్రేజ్ ఇది!
ఏకంగా 10 సినిమాల రికార్డును బ్రేక్ చేసిన నాని ది ప్యారడైజ్- శ్రీకాంత్ ఓదెల సినిమా అసలు క్రేజ్ ఇది!

ఎంగేజింగ్‌గా ఉందన్న ఇన్‌ఫ్యూయెన్సర్స్

ఇప్పుడు నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రెండోసారి వచ్చిన సినిమా ది ప్యారడైజ్. దసరా కాంబినేషన్ కావడంతో ది ప్యారడైజ్‌పై బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఆయా షేర్, ఏష నాగుల కట్ట సాంగ్స్‌తో ఆ క్రేజ్ మరింత పెరిగింది.

అయితే, భారీ అంచనాలతో సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైన ది ప్యారడైజ్ సినిమాకు నెగెటివ్ టాక్ ఎక్కువ వస్తోంది. కానీ, సోషల్ మీడియాలో వస్తోన్న ట్రోలింగ్ అంత నెగెటివ్‌గా సినిమా లేదని, చాలా వరకు ఎంగేజింగ్‌గానే సినిమా ఉందని పలువురు ఇన్‌ఫ్ల్యూయెన్సర్స్ చెబుతున్నారు.

ది ప్యారడైజ్ అసలు క్రేజ్

ఇలా పాజిటివ్, నెగెటివ్ టాక్ మధ్య శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ది ప్యారడైజ్ ఏకంగా 10 సినిమాల రికార్డ్‌ను బ్రేక్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎంత నెగెటివిటీ జరుగుతున్న అదంతా పటాపంచలు చేస్తూ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద బీభత్సమైన కలెక్షన్స్ రాబట్టి ది ప్యారడైజ్ అసలు క్రేజ్ ఏంటో చాటిచెప్పింది.

మొదటి రోజే బాక్సాఫీస్ ఊచకోత!

నాని సరికొత్త రగ్గడ్ అవతార్, చిత్ర యూనిట్ అనుసరించిన వినూత్నమైన ప్రమోషన్ వ్యూహం ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఈ చిత్రం రూ. 11.60 కోట్లు రాబట్టగా, తొలిరోజు ప్రదర్శనలతో కలిపి భారతదేశ వ్యాప్తంగా ఏకంగా రూ. 46.25 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ఇందులో ఒక్క గురువారమే (సెప్టెంబర్ 24) రూ. 34.65 కోట్ల వసూళ్లు రావడం విశేషం. నాని కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ ఓపెనింగ్‌లలో ఒకటిగా నిలిచింది.

భాషల వారీగా కలెక్షన్ల వివరాలు

తెలుగు రాష్ట్రాల్లో ది ప్యారడైజ్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఒక్క తెలుగు భాషలోనే తొలిరోజు రూ. 42.90 కోట్ల భారీ నెట్ కలెక్షన్లు నమోదయ్యాయి. పాన్-ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం హిందీ వర్షన్‌లో రూ. 2.25 కోట్లు, తమిళంలో రూ. 1.10 కోట్లు రాబట్టింది.

ఇక ఇండియాలో ది ప్యారడైజ్ సినిమాకు రూ. 54.90 కోట్ల గ్రాస్ రాగా వరల్డ్ వైడ్‌గా అయితే రూ. 76.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్‌లో రూ. 22 కోట్ల గ్రాస్ దక్కించుకుంది ఈ సినిమా. ఇలా భారీ కలెక్షన్స్ రాబట్టిన ది ప్యారడైజ్ పది సినిమాల రికార్డులను తుడిచిపెట్టేసింది.

10 పెద్ద సినిమాల రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి

'ది ప్యారడైజ్' దాడికి సౌత్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన పలు భారీ చిత్రాల ఫస్ట్ డే రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. ఇటీవల విడుదలైన అక్షయ్ కుమార్ 'వెల్‌కమ్ టు ది జంగిల్' (రూ. 15.25 కోట్లు), రితేష్ దేశ్‌ముఖ్ 'రాజా శివాజీ' (రూ. 12.4 కోట్లు), అలియా భట్ 'ఆల్ఫా' (రూ. 9.25 కోట్లు), షాహిద్ కపూర్- తమన్నాల 'ఓ రోమియో' (రూ. 9.01 కోట్లు) వంటి చిత్రాల తొలిరోజు కలెక్షన్లను నాని సినిమా సునాయాసంగా దాటేసింది.

వీటితో పాటు పూజా హెగ్డే-మృణాల్ ఠాకూర్ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' (రూ. 8.65 కోట్లు), 'ఇక్కీస్' (రూ. 7.28 కోట్లు), 'పతి పత్నీ ఔర్ వో 2' (రూ. 4.38 కోట్లు), 'మర్దానీ 3' (రూ. 4 కోట్లు), 'చాంద్ మేరా దిల్' (రూ. 3.31 కోట్లు), రామ్ చరణ్ 'పెద్ది' (రూ. 3 కోట్లు) చిత్రాలను కూడా 'ది ప్యారడైజ్' మొదటి రోజే వెనక్కి నెట్టింది.

మాస్ లుక్‌లో నాని విస్ఫోటనం

ఇదిలా ఉంటే, 2 గంటల 45 నిమిషాల నిడివితో వచ్చిన ది ప్యారడైజ్ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి అత్యంత నిర్మాణ విలువలతో నిర్మించారు. పొడవాటి జుట్టు, రెండు జడలతో మాస్ అవతార్‌లో నాని చేసిన యాక్షన్ సీన్లు థియేటర్లలో ఈలలు వేయిస్తున్నాయి.

మోహన్ బాబు పవర్‌ఫుల్ విలనిజం పండించగా.. సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయాల్, కయాదు లోహర్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. 'ది ప్యారడైజ్' హంగామా ఇలా ఉండగానే, నాని తన తదుపరి చిత్రం 'బ్లడీ రోమియో' ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీ కానున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More