The Paradise BO: 3వ రోజు పెరిగిన నాని ది ప్యారడైజ్ కలెక్షన్స్- ఇండియాలోనే 90 కోట్లు- వరల్డ్ వైడ్, ఓవర్సీస్‌లో ఎంతంటే?

Nani The Paradise Box Office Collection Day 3: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'ది ప్యారడైజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. మొదట మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ రోజురోజుకీ పాజిటివ్ టాక్ పెరుగుతోంది. దీంతో 3వ రోజున ది ప్యారడైజ్ కలెక్షన్స్ పెరిగాయి.

Published on: Sep 27, 2026, 08:33:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Nani The Paradise 3 Days Worldwide Box Office Collection: 'దసరా' వంటి ఊరమాస్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా 'ది ప్యారడైజ్'. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది.

3వ రోజు పెరిగిన నాని ది ప్యారడైజ్ కలెక్షన్స్- ఇండియాలోనే 90 కోట్లు- వరల్డ్ వైడ్, ఓవర్సీస్‌లో ఎంతంటే?
3వ రోజు పెరిగిన నాని ది ప్యారడైజ్ కలెక్షన్స్- ఇండియాలోనే 90 కోట్లు- వరల్డ్ వైడ్, ఓవర్సీస్‌లో ఎంతంటే?

పెరుగుతున్న పాజిటివ్ టాక్

మొదటి రోజు నుంచే రికార్డు స్థాయి వసూళ్లతో సునామీ సృష్టిస్తోంది ది ప్యారడైజ్ సినిమా. విమర్శకుల నుంచి కొంత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, నాని మాస్ ఇమేజ్, ఓపెనింగ్స్ హవా కలెక్షన్లను గట్టిగా నిలబెట్టాయి. ఇప్పుడు క్రమంగా ది ప్యారడైజ్ సినిమాకు పాజిటివ్ టాక్ పెరుగుతూ వస్తోంది.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జాతర

ది ప్యారడైజ్ సినిమా బుధవారం (సెప్టెంబర్ 23) రాత్రి ప్రీమియర్ షోలతో మొదలై, గురువారం (సెప్టెంబర్ 24) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నాని కెరీర్‌లోనే అత్యధికంగా రూ.46.25 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇందులో ఒక్క గురువారం రాత్రి ప్రీమియర్ షోల నుంచే రూ.11.60 కోట్లు రాగా, తొలి రోజున రూ.34.65 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు కావడం విశేషం.

రెండో రోజు అనగా శుక్రవారం (సెప్టెంబర్ 25) కలెక్షన్లలో కొంత తగ్గుదల కనిపించింది. ఆ రోజు రూ.14.90 కోట్లు రాబట్టగా, శనివారం (సెప్టెంబర్ 26) (మూడో రోజు) మళ్లీ ది ప్యారడైజ్ కలెక్షన్స్ పుంజుకున్నాయి.

ఒక్కరోజే 15.25 కోట్లు

ప్రముఖ బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల నివేదిక ప్రకారం, శనివారం నాడు ది ప్యారడైజ్ సినిమా రూ.15.25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అంటే రెండో రోజుతో పోలిస్తే 3వ రోజున 2.3 శాతం కలెక్షన్స్ పెరిగినట్లు. దీంతో భారత బాక్సాఫీస్ వద్ద మొదటి మూడు రోజుల్లో 'ది ప్యారడైజ్' రూ.76.40 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.

ఇకపోతే ఇండియాలో 3 రోజుల్లో రూ. 90.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే, రెండు రోజుల్లోనే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ. 114 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇక 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ది ప్యారడైజ్ చిత్రానికి రూ. 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయినట్లు సమాచారం.

ది ప్యారడైజ్ ఓవర్సీస్ కలెక్షన్స్

అలాగే, ఓవర్సీస్‌లో ఒక్క 3వ రోజునే ది ప్యారడైజ్ సినిమాకు రూ. 4 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఈ లెక్కన 3 రోజుల్లో ఓవర్సీస్‌లో మొత్తంగా శ్రీకాంత్ ఓదెల సినిమాకు రూ. 29 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

బాక్సాఫీస్ వద్ద తొలి రోజుతో పోలిస్తే కలెక్షన్ల గ్రాఫ్ మారినప్పటికీ, చిత్ర యూనిట్ శనివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా ది ప్యారడైజ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ సినిమాకు వస్తున్న స్పందనపై స్పందించారు.

టాక్‌పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు

“ఈ మధ్య కాలంలో ఉదయం పూట పాజిటివ్ టాక్ వచ్చి సాయంత్రానికి మారడం చూస్తున్నాం. కానీ 'ది ప్యారడైజ్' విషయంలో దానికి భిన్నంగా జరిగింది. పీరిమియర్ షోలతో ఒక రకమైన టాక్ మొదలైనా, ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ఇటీవల కాలంలో ఏ సినిమాకూ ఇలాంటి మార్పు నేను చూడలేదు” అని నాని తెలిపారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More