Nani: 18 ఏళ్లు.. 33 సినిమాల్లో నాకు తొలిసారి ఇలా జరిగింది.. మన నెక్ట్స్ సినిమా ఇలా ఉండకూడదు: ది ప్యారడైజ్‌పై నాని
Nani: ది ప్యారడైజ్ మూవీకి తొలి షో నుంచే చాలా తీవ్రమైన రియాక్షన్లు రావడంపై నాని స్పందించారు. నెగటివ్ అయినా, పాజిటివ్ అయినా వచ్చిన రియాక్షన్లు చాలా తీవ్రంగా ఉన్నాయని, తన 18 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదని నాని చెప్పారు.
Nani: నేచురల్ స్టార్ నాని లీడ్ రోల్‌లో వచ్చిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' (The Paradise) సెప్టెంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. తొలిరోజే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఈ మూవీకి ఊహించని విధంగా ఆడియన్స్ నుంచి చాలా తీవ్రమైన నెగటివ్ రియాక్షన్లు వచ్చాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్, అగ్రెసివ్ ఫీడ్‌బ్యాక్ రావడంపై హీరో నాని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌పై రిలీజ్ ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ప్రీమియర్ల నుంచే సినిమాకి డివైడ్ టాక్ స్టార్ట్ కావడంతో మరుసటి రోజు కలెక్షన్లలో డిప్ కనిపించింది.
నా 33 సినిమాల్లో ఇలాంటి రెస్పాన్స్ ఫస్ట్ టైమ్
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో నాని తన మనసులోని మాటను ఓపెన్‌గా పంచుకున్నారు. "నా 18 ఏళ్ల కెరీర్‌లో 33 సినిమాలు తీశాను. కానీ ఒక సినిమాకి ఇంతటి ఎక్స్‌ట్రీమ్ రియాక్షన్లు రావడం నా లైఫ్‌లో ఇదే మొదటిసారి" అని నాని స్పష్టం చేశారు.
ఒకవైపు కొందరు సినిమాను నెత్తికెత్తుకుంటుంటే, మరికొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. అయితే ఈ నెగెటివ్ రియాక్షన్ల వెనుక కూడా ప్రేక్షకుల ప్రేమ, నిజాయతీ ఉందన్నారు. ఒక సినిమా వర్కవుట్ కాలేదని అంత ఇంటెన్సిటీతో చెబుతున్నారంటే, అది కూడా ఒక రకంగా పాజిటివ్ సైన్ అని నాని విశ్లేషించారు.
'దసరా' ఇచ్చిన నమ్మకం.. శ్రీకాంత్ ఓదెల కాంబోపై అంచనాలు
'దసరా' వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా కావడంతో ఆడియన్స్ అంచనాలు పీక్స్‌లో ఉన్నాయని నాని చెప్పారు. "మా కాంబోపై ఆడియన్స్‌కి ఉన్న నమ్మకమే ఆ ఎమోషనల్ రియాక్షన్లకు కారణం. మేం ఏ సీన్‌ని కూడా లైట్‌గా తీసుకోలేదు, హార్ట్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేశాం" అని తెలిపారు.
ఈ సినిమా ఫలితం నుంచి నేర్చుకున్న పాఠాలతో, తమ కాంబినేషన్‌లో రాబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను కచ్చితంగా ఒక బిగ్గెస్ట్ ప్లస్‌గా మలుస్తామని నాని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. మన నెక్ట్స్ సినిమాకు ఇలాంటి టాక్ రాకూడదని శ్రీకాంత్ తో నాని చెప్పడం గమనార్హం.
బాక్సాఫీస్ కలెక్షన్లు.. ఫస్ట్ డే రికార్డు నుండి ట్రెండ్
సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర నాని క్రేజ్ గట్టిగానే వర్కవుట్ అయింది. డే 1 ఇండియన్ నెట్ కలెక్షన్ల రూపంలో ఈ మూవీ ఏకంగా రూ.34.65 కోట్లు రాబట్టి నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ నమోదు చేసింది. ఆ తర్వాత రోజు కలెక్షన్స్ రూ.14 కోట్లకు పడిపోయినా, వీకెండ్‌లో మళ్లీ పికప్ అయింది.
ప్రస్తుతం ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా రూ.97.10 కోట్ల నెట్ వసూలు చేయగా, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.144.85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
1980ల బ్యాక్‌డ్రాప్.. 'సవారీ' తెగ పోరాటం
1980ల కాలంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసించే 'సవారీ' అనే గిరిజన తెగ పౌరసత్వం కోసం చేసే పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో సమ్మక్క పాత్రలో సోనాలీ కుల్కర్ణి, ఆమె కొడుకు జడల్ పాత్రలో నాని పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. భూస్వామి షికంజా మాలిక్‌గా సీనియర్ నటుడు మోహన్ బాబు, ఆయన కొడుకు విక్రమ్ మాలిక్‌గా రాఘవ్ జుయల్ విలనిజం పండించారు.
అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ కథనంలో లోపాలు, క్లైమాక్స్ ఎగ్జిక్యూషన్ వీక్‌గా ఉండటం వల్ల డివైడ్ టాక్ వచ్చిందని విమర్శకులు అభిప్రాయపడ్డారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


