Mohan Babu: ఇంత భయంకరంగా చూపిస్తాడనుకోలేదు, మా గురువు దాసరి గుర్తొచ్చారు, నాని పడిన కష్టం దేవుడికే తెలుసు: మోహన్ బాబు

Mohan Babu About Srikanth Odela Nani The Paradise: నాని హీరోగా మోహన్ బాబు విలన్‌గా తెరకెక్కిన సినిమా ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ మూవీ సక్సెస్ మీట్‌ను తాజాగా నిర్వహించారు. ది ప్యారడైజ్ సక్సెస్ మీట్‌లో దాసరి నారాయణరావును గుర్తు చేసుకున్న మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Sep 27, 2026, 12:02:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Mohan Babu About Srikanth Odela Nani The Paradise: బాక్సాఫీస్ వద్ద తాండవం చేస్తున్న నేచురల్ స్టార్ నాని సినిమా ‘ది ప్యారడైజ్’. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఇంత భయంకరంగా చూపిస్తాడనుకోలేదు, మా గురువు దాసరి గుర్తొచ్చారు, నాని పడిన కష్టం దేవుడికే తెలుసు: మోహన్ బాబు
ఇంత భయంకరంగా చూపిస్తాడనుకోలేదు, మా గురువు దాసరి గుర్తొచ్చారు, నాని పడిన కష్టం దేవుడికే తెలుసు: మోహన్ బాబు

ది ప్యారడైజ్ సక్సెస్ మీట్

ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ భారీ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. మొదటి నుంచి వచ్చిన నెగెటివిటీ పోయి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ది ప్యారడైజ్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

మీడియా ములాఖాత్‌లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ.. "అందరికీ హృదయపూర్వక వందనాలు, ఆశీస్సులు. నిర్మాత సుధాకర్ గారు ఎక్కడా కూడా డబ్బుకి వెనకాడకుండా ఈ సినిమా చేశారు. ఆ భగవంతుడు ఆయనకు విజయాన్ని ఇచ్చాడు" అని అన్నారు.

దాసరిపై ఇలాగే నమ్మకం పెట్టుకునేవారు

"దర్శకుడిపై భారం వేసి, సినిమాను నిర్మించిన వాళ్లలో ఒకరిద్దరినే చూశా. మా గురువుగారు దాసరి గారు కూడా ఇలాగే నిర్మాతలు నమ్మకం పెట్టుకునేవారు. ఇప్పుడు శ్రీకాంత్‌పై సుధాకర్‌ చెరుకూరి అదే నమ్మకం ఉంచారు. సుధాకర్ లాంటి నిర్మాత సినిమా పరిశ్రమకు కావాలి. నిర్మాత ఆయన పదికాలాలపాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను" అని మోహన్ బాబు కోరారు.

"దర్శకుడు శ్రీకాంత్ ఈ కథని నాకు చాలా ధైర్యంగా చెప్పాడు. చాలా సులువుగా అర్థమయ్యేలాగా అద్భుతంగా చెప్పాడు. నా సుదీర్ఘ సినీ కెరీర్‌లో 500లకు పైగా చిత్రాల్లో నటించాను కానీ, సికంజా మాలిక్‌లాంటి భయంకరమైన పాత్ర చేయడం నా లైఫ్‌లో ఫస్ట్ టైం. నన్ను ఇంత భయంకరంగా చూపిస్తాడని అనుకోలేదు" అని మోహన్ బాబు తెలిపారు.

ఎక్కువ టేకులు తీసుకున్న డైరెక్టర్ ఇతనే

"నా లైఫ్‌లో ఎక్కువ టేకులు తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్. మా గురువుగారు దాసరి నారాయణరావు గారు కూడా చాలా టేకులు తీసుకునేవారు. “నువ్వు చేసినవన్నీ బాగున్నాయి. కానీ ఇంకా అద్భుతంగా వస్తుందని” చెప్పేవారు. శ్రీకాంత్‌తో పనిచేస్తున్నప్పుడు నాకు మా గురువుగారు గుర్తొచ్చారు" అని మోహన్ బాబు తన గురువును గుర్తు చేసుకున్నారు.

"శ్రీకాంత్ ఎక్స్‌ట్రార్డినరీ డైరెక్టర్. పాత్రని ఆ పాత్రగానే చూశాడు. ఒక నటుడిగా తనలో ఉన్న టాలెంట్‌ని చూసి గర్వించాను. తను దర్శకుడిగా ఇప్పటికే నిరూపించుకున్నాడు. తను దేశంలోనే టాప్ డైరెక్టర్ అవుతాడు. సినిమా పరిశ్రమ అందరిదీ. ఎవరికి ప్రతిభ ఉంటే వాళ్లని ముందుకు తీసుకెళుతుంది. శ్రీకాంత్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అని మంచు మోహన్ బాబు పేర్కొన్నారు.

నాని పడిన కష్టం భగవంతుడికే తెలుసు

"ఈ సినిమాలో నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ అద్భుతంగా చేశారు. నానిని నేను ఎంతో అభిమానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఒక నటుడిగా గౌరవిస్తున్నాను. ఈ సినిమాలో నాని పడిన కష్టం ఆ భగవంతుడికే తెలుసు. ప్రజలు ఆశీర్వదించారు. ‘ప్యారడైజ్‌’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది" అని మోహన్ బాబు అన్నారు.

"నాని గొప్ప కళాకారుడు. ‘దసరా’లో ఒక రకంగా చేశాడు. ‘ప్యారడైజ్’లో అందుకు పూర్తి భిన్నంగా చేశాడు. జడలు వేసుకోవడం మామూలు విషయం కాదు. తనతో ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఆ జడలు పట్టుకున్నప్పుడు తనకు ఎంతో బాధ కలిగింది. అది నాకు తెలుసు" అని మోహన్ బాబు వెల్లడించారు.

ప్రతి షాట్ అద్భుతంగా చేశాడు

"నాని ఇంకా ఎన్నో గొప్ప విజయాలు సాధించాలని మనసా వాచా కోరుకుంటున్నాను, ఈ స్నేహం కలకాలం ఉండాలి. తను ప్రతి షాట్‌ని అద్భుతంగా చేశాడు. టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్" అని మోహన్ బాబు తన స్పీచ్ ముగించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More