The Paradise: చనిపోయాడనుకుంటే మళ్లీ వచ్చాడేంటి? ది ప్యారడైజ్ ఇంటర్వెల్ ట్విస్ట్‌పై నటుడి క్లారిటీ- ఆ బ్యాండేజ్ చూడలేదా?
The Paradise: ది ప్యారడైజ్ ఇంటర్వెల్ సీన్‌పై వస్తున్న విమర్శలకు నటుడు సాయికిరణ్ గట్టి క్లారిటీ ఇచ్చారు. ఇంటర్వెల్ సీన్‌లో బుల్లెట్ తగిలి పడిపోయిన తన పాత్ర, సెకండాఫ్‌లో మళ్లీ కనిపించడంపై ప్రేక్షకులు వ్యక్తంచేస్తున్న సందేహాలను ఆయన పటాపంచలు చేశారు.
The Paradise: ది ప్యారడైజ్ మూవీపై ఓ వైపు విమర్శలు.. మరోవైపు ట్రోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు చనిపోయిన ఓ నటుడు.. ఇంటర్వెల్ తర్వాత మళ్లీ సినిమాలో కనిపించాడని కొంతమంది దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోల్స్ పై ది ప్యారడైజ్ నటుడు క్లారిటీనిచ్చారు.

నెటిజన్ల ట్రోల్స్
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన 'ది ప్యారడైజ్' థియేటర్లలో భారీ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్‌పై సోషల్ మీడియాలో చిన్నపాటి చర్చ నడుస్తోంది. ఇంటర్వెల్‌లో సాయికిరణ్ పోషించిన పాత్రకు బుల్లెట్ తగలడం, ఆయన కిందపడిపోవడంతో ఆ పాత్ర చనిపోయిందని ప్రేక్షకులు భావించారు.
అయితే సెకండ్ హాఫ్‌లో మళ్లీ ఆ పాత్ర ప్రత్యక్షమవ్వడంతో కంటిన్యూటీ మిస్సయ్యిందంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాలో చూసుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు.
నటుడి క్లారిటీ
ఈ వివాదంపై ఇవాళ (సెప్టెంబర్ 26) నిర్వహించిన మీడియా ములాకత్‌లో నటుడు సాయికిరణ్ స్పందించారు. "ఇంటర్వెల్‌లో నా పాత్రకు బుల్లెట్ తగిలిన మాట వాస్తవమే, కానీ నేను చనిపోయినట్లు ఎక్కడా చూపించలేదు. దెబ్బ తగిలి కింద పడ్డాను అంతే. చాలామంది గమనించలేదు కానీ సెకండాఫ్‌లో నాకు బుల్లెట్ తగిలిన చోట బ్యాండేజ్ కట్టుకుని ఉంటాను. కావాలంటే మరోసారి సినిమా చూసి ఆ బ్యాండేజ్ ఉన్న సీన్ ఫోటోలు నాకు పంపండి" అంటూ క్లారిటీ ఇచ్చారు.
ది ప్యారడైజ్ ర్యాంపేజ్
శ్రీకాంత్ ఓదెల విజన్‌తో రూపొందిన 'ది ప్యారడైజ్' సినిమాలో మోహన్ బాబు, సోనాలి కుల్కర్ణి, రాఘవ్ జుయల్, కాయాదు లోహర్, సాయికిరణ్ తదితరులు నటించారు. రా అండ్ రస్టిక్ కంటెంట్‌కు తోడు అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ మూవీ రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.114 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.
ఇంటర్వెల్ లాజిక్స్
మాస్ అండ్ యాక్షన్ సినిమాలలో ఇంటర్వెల్ బ్యాంగ్స్ చాలా కీలకంగా మారాయి. కథను మలుపు తిప్పే ఇటువంటి సీన్లలో ప్రేక్షకుల దృష్టి చాలా ముఖ్యం. 'ది ప్యారడైజ్' వంటి బిగ్ స్కేల్ మూవీస్‌లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతి చిన్న విషయాన్ని పకడ్బందీగా డిజైన్ చేశారు.
అయితే ప్రేక్షకులు సీన్ ముగిసిపోయిందనుకోవడం వల్ల ఏర్పడిన ఈ చిన్న పొరపాటుపై సాయికిరణ్ ఇప్పుడు క్లారిటీనిచ్చారు. ఇది సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచడమే కాకుండా, రెండోసారి థియేటర్‌కు వెళ్లి అబ్జర్వ్ చేసేలా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతుందనే టాక్ వినిపిస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


