Nani Reaction: మీ ట్రోల్స్ కూడా ఎంజాయ్ చేశాను.. తప్పు సరిదిద్దుకుంటా.. రక్తమోడ్చి చేసిన సినిమా ఇది: నాని రియాక్షన్ వైరల్
Nani Reaction: ది పారడైజ్ మూవీపై వస్తున్న నెగటివ్ రివ్యూలు, ట్రోల్స్ పై నాని హుందాగా స్పందించాడు. ప్రశంసలనే కాదు ట్రోల్స్ ను కూడా తాను బాగా ఎంజాయ్ చేసినట్లు చెప్పడం విశేషం. ఇంకా అతడు ఏమన్నాడో చూడండి.
Nani Reaction: నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ ఏవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర హల్‌చల్ చేస్తోంది. ఒకపక్క రికార్డ్ ఓపెనింగ్స్ సాధిస్తున్నప్పటికీ, మరోపక్క సినిమాపై నెటిజన్ల నుంచి ట్రోల్స్, క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో హీరో నాని సోషల్ మీడియా వేదికగా చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది.

ట్రోల్స్ కూడా ఎంజాయ్ చేశా
ఆడియెన్స్ నుంచి వచ్చిన ప్రతీ రెస్పాన్స్ ని తాను గమనించానని నాని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నాడు. "మీరు చూపిస్తున్న ప్రేమని ఎంతగా స్వీకరించానో, మీ నుంచి వచ్చిన నవ్వు తెప్పించే ట్రోల్స్ ని కూడా అంతే ఎంజాయ్ చేశాను. ఆడియెన్స్ ఈ సినిమాని తమ సొంతం చేసుకున్న తీరు నా మనసుని తాకింది. క్రిటిక్స్, రివ్యూవర్స్ వేలెత్తి చూపించిన తప్పుల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను" అని నాని ఓపెన్ గా స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
సినిమా తీసేటప్పుడు ఎదురయ్యే కష్టాలను ప్రస్తావిస్తూ నాని మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "ఎంతో రక్తం, చెమట చిందించి 'ది పారడైజ్' సినిమాని ఒక ప్రత్యేకమైన ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి తెరకెక్కించాం. ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం లేదా జడ్జ్ చేయడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. మీరు నాపై చూపించిన ప్రేమ, చూపించిన ఉత్సాహానికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా" అంటూ తన ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు తెలిపాడు.
శ్రీకాంత్ ఓదెల కాంబో.. 'దసరా' క్రేజ్ తో వచ్చిన ప్రయోగం
'దసరా' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా కావడంతో 'ది పారడైజ్' పై ట్రేడ్ లో ఆకాశాన్నంటే అంచనాలు ఏర్పడ్డాయి. 1980ల నాటి సికింద్రాబాద్ పారడైజ్ ప్రాంత నేపథ్యంతో 'జడల్' అనే రా అండ్ రస్టిక్ రోల్ లో నాని పవర్ ఫుల్ పర్ఫార్మన్స్ ఇచ్చాడు. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ కి ప్రశంసలు దక్కుతున్నాయి.
అయితే ఫస్టాఫ్ లో ఉన్న మాస్ ఎలివేషన్స్, సీరియస్ టోన్ సెకండ్ హాఫ్ లో మిస్ అయ్యాయని, నెరేషన్ స్లో అయిందనే విమర్శలు రివ్యూవర్స్ నుంచి వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా సెకండ్ హాఫ్ సీన్లపై రకరకాల మీమ్స్, ట్రోల్స్ వైరల్ అయ్యాయి. సాధారణంగా తమ సినిమాలపై వచ్చే నెగెటివిటీని పట్టించుకోని హీరోలు ఉన్న ఈ రోజుల్లో, నాని మాత్రం ట్రోల్స్ ని కూడా పాజిటివ్ గా తీసుకోవడం ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేస్తోంది.
బాక్సాఫీస్ దగ్గర నాని రికార్డు కలెక్షన్స్
రివ్యూలు మిశ్రమంగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర నాని సత్తా చాటుతున్నాడు. నైజాం సెంటర్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్, పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.
క్రిటిక్స్ చెప్పిన పాయింట్స్ ని స్వీకరిస్తూనే, ఆడియెన్స్ ట్రోల్స్ ని స్పోర్టివ్ గా తీసుకున్న నాని మెచ్యూరిటీపై మూవీ లవర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ కాకుండా జాగ్రత్తపడతానని నాని ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చినట్లయింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


