Dhee Raju Audio Leak: డ్యాన్స్ షో ‘ఢీ’తో పాపులర్ అయిన రాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అమ్మాయిపై లైంగిక వేధింపుల కేసులో ఢీ రాజు అరెస్టైన సంగతి తెలిసిందే. అతనికి కోర్టు రిమాండ్ విధించింది. అయితే తాజాగా అతని ఆడియో కాల్ ఒకటి లీక్ అయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.
ఢీ రాజు ఆడియో కాల్ లీక్

ఢీ 10, 20 సీజన్లలో విన్నర్ గా నిలిచిన రాజుకు సంబంధించిన ఆడియో కాల్ ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయిందనే వార్తలు వస్తున్నాయి. అందులో అతను శిరీష అనే అమ్మాయితో మాట్లాడుతున్నట్లు ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఆడియో కాల్ లీక్ హాట్ టాపిక్ గా మారింది. అయితే అందులో మాట్లాడుతుంది ఢీ రాజు అనేదానిపై అఫీషియల్ సమాచారం ఏం లేదు.
ప్రేమించా రాజు
సోషల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం శిరీష్ అనే అమ్మాయితో ఢీ రాజు ఫోన్లో మాట్లాడుతున్నట్లు ఆ ఆడియోలో ఉంది. రాజు వేరే అమ్మాయితో తిరుగుతుండటాన్ని శిరీష ప్రశ్నిస్తున్నట్లుగా అందులో ఉంది. ‘నిన్ను ప్రేమించాను రాజు. వదులుకోలేను’ అంటూ ఆ అమ్మాయి ఎమోషనల్ అవుతుంది.
అమ్మాయితో పెళ్లి
‘‘నేను వేరేవాళ్లను పెళ్లి చేసుకుంటా. నీతో ఫ్రెండ్లీగా ఉంటా. రెండు రోజులకోసారి కలుస్తా. నీకు ఓకేనా? ఎందుకు ఓకే చెప్పట్లేదు. మనం బయట కలుస్తాం. అలా ఓకే కదా. లైఫ్ లాంగ్ నీతో ఫ్రెండ్లీగా ఉండాలని అనుకుంటున్నా శిరీష. నీకు అలాగే ఉందా’’ అని ఆ అమ్మాయిని రాజు అడిగినట్లు ఆ ఆడియో కాల్ లో ఉంది.
చిట్టి మాస్టర్ కు ఏం చెప్తావని రాజును శిరీష అడుగుతుంది. ‘‘నా వల్ల కాదు రాజు. నువ్వు డబ్బులు కట్టి వెళ్లిపోతానన్నావ్ కాదు వెళ్లు. మనస్ఫూర్తిగా ప్రేమించా. నిన్ను అలాగే చూశా. నిన్ను వేరే అమ్మాయితో ఊహించుకోవడం తట్టుకోలేను’’ అని శిరీష ఏడ్చేస్తుంది.
నా దారి నాది
{{/usCountry}}చిట్టి మాస్టర్ కు ఏం చెప్తావని రాజును శిరీష అడుగుతుంది. ‘‘నా వల్ల కాదు రాజు. నువ్వు డబ్బులు కట్టి వెళ్లిపోతానన్నావ్ కాదు వెళ్లు. మనస్ఫూర్తిగా ప్రేమించా. నిన్ను అలాగే చూశా. నిన్ను వేరే అమ్మాయితో ఊహించుకోవడం తట్టుకోలేను’’ అని శిరీష ఏడ్చేస్తుంది.
నా దారి నాది
{{/usCountry}}‘‘నా వరకు నేను సినిమాలు చూసుకుంటుంటే పక్కవాళ్లు రెచ్చగొట్టారు. అమ్మాయితో తిరుగుతున్నావన్నారు. నువ్వు తిరుగుతున్నావ్. నువ్వు ఉంటే నాతో ఉండాలి. లేదంటే నా దారి నాది, నీ దారి నీది. డబ్బులు ఇవ్వడానికి ఇంకో వారం ఎక్స్ ట్రా తీసుకో. డబ్బులు తీసుకున్నాక పెళ్లి చేసుకోవాలని గట్టిగా అడిగే హక్కు నాకు ఉండదు’’ అని ఆ అమ్మాయి చెప్తుంది.
రూ.4 లక్షలు ఇస్తానని రాజు రిక్వెస్ట్ చేస్తాడు. ‘‘నువ్వు మనసు మార్చుకొని వస్తే రూ.50 లక్షలు నీ చేతిలో పెడతా. నేను నాలుగు సంవత్సరాలు కష్టపడి రూ.30 లక్షలు దాచుకున్నా’’ అని శిరీష చెప్పినట్లు ఉంది. రూ.7 లక్షలు కాకపోయినా రూ.5 లక్షలకైనా ఓకే చెప్పు శిరీష అని రాజు రిక్వెస్ట్ చేస్తాడు.
ఏం జరుగుతుందో?
ప్రస్తుతం ఢీ రాజు ఆడియో కాల్ లీక్ వైరల్ గా మారింది. మరి ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన రాజు వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇప్పటికే అమ్మాయి స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డు చేశారు.