Dhurandhar 2 First Review: ఇదో మాస్టర్‌పీస్.. ఎపిక్ బ్లాక్‌బస్టర్.. ధురంధర్ 2పై ఫస్ట్ రివ్యూ వచ్చేసింది
Dhurandhar 2 First Review: ధురంధర్ 2 మూవీపై ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అదిరిపోయే రివ్యూ ఇచ్చాడు. ఇది ఓ మాస్టర్ పీస్ అని, ఎపిక్ బ్లాక్‌బస్టర్ అని కొనియాడటం విశేషం. ఈ సినిమా ప్రీమియర్ షోలు బుధవారం (మార్చి 18) పలు నగరాల్లో ప్రదర్శించారు.
ధురంధర్ 2.. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ సీక్వెల్. ఈ సినిమా గురువారం (మార్చి 19) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా.. ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు వేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ సినిమాకు తన ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. అతడు తన ఎక్స్ అకౌంట్లో ఓ సుదీర్ఘ పోస్ట్ రాశాడు. అందులో ఏముందో చూడండి.

తరణ్ ఆదర్శ్ ధురంధర్ 2 రివ్యూ.. ఎపిక్ బ్లాక్‌బస్టర్
ధురంధర్ 2 మూవీపై తరణ్ ఆదర్శ్ ఇచ్చిన రివ్యూ వైరల్ అవుతోంది. “ఒక్క మాటలో చెప్పాలంటే.. ధురంధర్ ది రివేంజ్ ఒక మాస్టర్‌పీస్. సినిమా అంటే ఇలా ఉండాలి అనిపించేలా ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. స్కేల్, డ్రామా, ఎమోషన్స్, యాక్షన్, పర్ఫార్మెన్సెస్, ఇంపాక్ట్.. ఇలా ప్రతి విషయంలోనూ సినిమా అదరగొట్టేసింది. డైరెక్టర్ ఆదిత్య ధర్ (Aditya Dhar)కి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇది పక్కా ఎపిక్ బ్లాక్‌బస్టర్” అని తరణ్ అన్నాడు.
భారీ అంచనాలను మించిపోయిన సీక్వెల్
“ఫస్ట్ పార్ట్ ధురంధర్ కి సీక్వెల్ అనగానే సహజంగానే ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటాయి. అదృష్టవశాత్తూ ఈ ధురంధర్ ది రివేంజ్ ఆ భారీ అంచనాలను రీచ్ అవ్వడమే కాదు.. అంతకు మించి అనే రేంజ్‌లో వాటన్నింటినీ దాటేసింది. డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈసారి ఇంకా బిగ్గర్, షార్పర్, ఫుల్ అంబిషియస్ విజన్‌తో తిరిగి వచ్చాడు. ఫస్ట్ పార్ట్ కేవలం ఫౌండేషన్ వేస్తే.. ఈ సినిమా స్టోరీ నెరేషన్‌ను ఒక సరికొత్త లెవల్‌కు ఎలివేట్ చేసింది” అని తరణ్ అభిప్రాయపడ్డాడు.
రణ్‌వీర్ సింగ్ కెరీర్ బెస్ట్ యాక్టింగ్
“పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ ఇరగదీశారు. రణ్‌వీర్ సింగ్ ఒక టవరింగ్ యాక్ట్‌తో అదరగొట్టాడు. తన క్యారెక్టర్‌లోని స్ట్రెంగ్త్, ఇంటెన్సిటీ, వల్నరబిలిటీని ఒకే లెవల్‌లో చాలా బ్యాలెన్స్‌డ్‌గా చూపించాడు. ఈ సీక్వెల్‌కు అతనే వెన్నెముక, ఆత్మ, లైఫ్‌లైన్ అంతా. డౌట్ లేకుండా ఇది అతని కెరీర్‌లోనే 'ది బెస్ట్' పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఈ రెండు సినిమాలు అతని కెరీర్‌లో అతిపెద్ద ల్యాండ్‌మార్క్ మైల్‌స్టోన్స్‌గా మిగిలిపోతాయి” అని తరణ్ స్పష్టం చేశాడు.
అసలు ఆ బడే సాబ్ ఎవరు?
ఇక అందరినీ తొలిచేస్తున్న ఆ పెద్ద ప్రశ్న.. అసలు 'బడే సాబ్' ఎవరు? దానికి సమాధానం చూసి మీరు షాక్ అవ్వడానికి రెడీగా ఉండండి అని కూడా తరణ్ అన్నాడు. అలాగే ఒక పవర్‌ఫుల్ హీరోయిన్ ఇచ్చిన క్యామియో అప్పియరెన్స్ కూడా అదిరిపోయిందని చెప్పాడు.
మ్యూజిక్, యాక్షన్, ఎడిటింగ్‌పై..
ధురంధర్ ఫస్ట్ పార్ట్ లాగానే శాశ్వత్ సచ్‌దేవ్ ఈసారి కూడా కొన్ని సాలిడ్ మ్యూజిక్ ట్రాక్స్ ఇచ్చాడని తరణ్ వెల్లడించాడు. ఇక యాక్షన్ సీక్వెన్సెస్‌ను అద్భుతమైన స్టైల్, స్కేల్‌లో ప్రెజెంట్ చేసినట్లు తెలిపాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని డ్రామాను గొప్పగా ఎలివేట్ చేసినట్లు చెప్పాడు.
"బాక్సాఫీస్ సునామీకి మరోసారి రెడీ అయిపోండి. హిస్టరీ మళ్లీ క్రియేట్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఈ సినిమా పాత రికార్డ్స్‌ను మొత్తం బద్దలు కొట్టి, సరికొత్త బెంచ్‌మార్క్స్ సెట్ చేయడం పక్కా" అని తరణ్ తన రివ్యూని ముగించాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


