Dhurandhar 2: ధురంధర్ 2 కోసం 30 ఏళ్ల రికార్డు బ్రేక్! డీడీఎల్‌జే షో టైమ్ మార్చిన మరాఠా మందిర్.. రణ్‌వీర్ సింగ్ క్రేజ్
Dhurandhar 2: ధురంధర్ 2 మేనియా మామూలుగా లేదు. ఈ మూవీకి వస్తున్న డిమాండ్ కారణంగా 24 గంటల పాటు షోలు ప్రదర్శిస్తారనే వార్తలు వైరల్ గా మారాయి. ఈ సినిమా కోసం మారఠా మందిర్ లో కంటిన్యూగా ప్రీమియర్ అవుతున్న దిల్ వాలే దుల్హానియా లేేజాయేంగే మూవీ షో టైమ్ ను మార్చారు.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ మేనియా నెక్ట్స్ లెవల్ లో ఉంది. టిక్కెట్ల అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లలో ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే భారతీయ సినిమాలో అతిపెద్ద ప్రీమియర్‌గా నిలిచింది. మిలియన్ టిక్కెట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఈ భారీ డిమాండ్‌తో థియేటర్లు కొత్త షోలను యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

డీడీఎల్‌జే కొత్త స్లాట్
ధురంధర్ 2కు ఎంతటి క్రేజ్ ఉందో చెప్పేందుకు డీడీఎల్‌జే మూవీ షో టైమ్ ను మార్చడం పర్ఫెక్ట్ ఉదాహరణ. ముంబయిలోని మరాఠా మందిర్ లో 30 సంవత్సరాలుగా నిరంతరాయంగా 'దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే' (DDLJ)ని ప్రదర్శిస్తున్నారు.
ఈ మూవీ షో ప్రతిరోజూ ఉదయం 11.30 గంటలకు స్టార్ట్ అవుతుంది. కానీ ధురంధర్ 2 కారణంగా ఈ షో టైమింగ్ ను ఉదయం 10 గంటలకు మార్చారు. ఇది హీరో రణ్‌వీర్ సింగ్ క్రేజ్ ను చాటుతోంది.
30 ఏళ్ల రికార్డు
ధురంధర్ 2 మూవీ డీడీఎల్‌జే 30 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. భారీ సినిమాలు వచ్చినప్పుడే అత్యంత అరుదుగా మారాఠా మందిర్ లో డీడీఎల్‌జే షో టైమింగ్ మారుస్తారు. గతంలో యానిమల్, పుష్ప 2, స్త్రీ 2 లాంటి భారీ రన్ టైమ్ ఉన్న సినిమాల కోసం డీడీఎల్‌జే టైమ్ ను ఉదయం 10.30 గంటలకు మార్చారు. కానీ ధురంధర్ 2 కోసం షో టైమింగ్ ను ఉదయం 10 గంటలకు మార్చడం మాత్రం 30 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి.
24 గంటల షోలు
ధురంధర్ 2 మూవీ రిలీజ్ కు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు తిరగరాస్తున్న ఈ మూవీకి నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో థియేటర్లు కొత్త షోలు యాడ్ చేయబోతున్నాయి. దీంతో ఈ మూవీ 24 గంటల పాటు ప్రీమియర్ అయ్యే చిత్రంగా అరుదైన ఘనత సొంతం చేసుకోబోతుంది.
అర్ధరాత్రి కూడా
ధురంధర్ 2 మూవీ రన్ టైమ్ దాదాపు 4 గంటలు ఉంది. జనరల్ గా అయితే ఇంత రన్ టైమ్ ఉన్న సినిమాకు రోజుకు నాలుగు కంటే ఎక్కువ షోలు వేయడం కష్టం. 'హిందుస్థాన్ టైమ్స్'కు అందిన సమాచారం ప్రకారం ప్రధాన థియేటర్ చైన్‌లు ఈ మూవీ కోసం ప్రతి షోకు 4 గంటల 40 నిమిషాల టైమ్ విండోను ఉంచుతున్నాయి. ఇందులో ట్రైలర్‌లు, విరామం, షోల మధ్య గ్యాప్ కూడా ఉంటుంది. ఈ పరిస్థితిలో ధురంధర్ 2 కోసం అర్ధరాత్రి షోలనూ థియేటర్లు ప్లాన్ చేస్తున్నాయి.
కంటిన్యూగా
ధురంధర్ 2 సినిమా షోలను కంటిన్యూగా వేసేందుకు థియేటర్లు రెడీ అవుతున్నాయి. ముంబయి, థానేలో పీవీఆర్ చకాలా, మూవీ మ్యాక్స్ సియోన్ వంటి థియేటర్లు వీకెండ్ లో అర్ధరాత్రి 1.50 గంటలకు ధురంధర్ 2 షో స్టార్ట్ చేయబోతున్నాయి. అప్పటి నుంచి రాత్రి 11.30 గంటలకు స్టార్ట్ అయ్యే షోల వరకూ కంటిన్యూగా మూవీని ప్రదర్శిస్తూనే ఉంటారు.
థానేలోని మూవీ మ్యాక్స్, అహ్మదాబాద్‌లోని కాన్‌ప్లెక్స్ సినిమాస్‌లో గురువారం (మార్చి 19) నుంచే అర్ధరాత్రి తర్వాత షోలు స్టార్ట్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


