Dhurandhar 2: ధురంధర్ 2నా మజాకా.. హాట్ కేకుల్లా టికెట్లు.. ప్రీమియర్ షోలతోనే సరికొత్త రికార్డు
Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా క్రేజ్ మామూలుగా లేదు. రిలీజ్ కు ముందే ఈ మూవీ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రీమియర్ షోలతోనే రికార్డు ఖాతాలో వేసుకుంది. ఈ ప్రీమియర్ షో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన ధురంధర్ 2 క్రేజ్ మామూలుగా లేదు. సినిమా రిలీజ్ కంటే ముందే ఈ మూవీ కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. రికార్డుల వేటలో దూసుకెళ్తోంది. ధురంధర్ 2 ప్రీమియర్ షో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ టికెట్ల సేల్స్ లోనే ధురంధర్ 2 కొత్త రికార్డు నమోదు చేసింది.

ధురంధర్ 2
ఆదిత్య ధర దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 19, 2026న రిలీజ్ కానుంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్స్ సేల్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా గత వారం సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ టికెట్ల సేల్స్ లో ధురంధర్ 2 కొత్త రికార్డు ఖాతాలో వేసుకుంది.
2 లక్షలకు పైగా
ధురంధర్ 2 మూవీ ప్రీమియర్స్ టికెట్ బుకింగ్స్ రికార్డు సృష్టించాయి. ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్‌లు మార్చి 7న, ఉదయం 11:01 గంటలకు ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రారంభమయ్యాయి. 24 గంటల్లోనే కేవలం బుక్‌మైషోలోనే ఈ మూవీ 87 వేల టికెట్లు సేల్ అయ్యాయి. మార్చి 9 ఉదయం నాటికి ఈ సంఖ్య బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌లో 1.5 లక్షలకు పైగా నమోదైంది. ఓవరాల్ గా మిగతా ప్లాట్ ఫామ్స్ లోనూ కలిపి మొత్తం 2 లక్షల నంబర్ దాటింది.
అత్యధిక వసూళ్లు
సక్నిల్క్ ప్రకారం ధురంధర్ 2 ప్రీమియర్ షోల కోసం ఇప్పటికే ఇండియాలో 2.06 లక్షల టికెట్లు సేల్ అయ్యాయి. ఈ టికెట్ల అమ్మకం ద్వారా రూ.12.29 కోట్లు వచ్చాయి. ఈ వసూళ్లలో ఎక్కువ భాగం ఒరిజినల్ హిందీ వెర్షన్ నుంచే ఉన్నాయి. అయితే తమిళ డబ్బింగ్ అంచనాలను అధిగమించి, ప్రీమియర్ షోల నుండి దాదాపు రూ.10 లక్షలను రాబట్టింది. ఓవరాల్ ప్రీమియర్ కలెక్షన్లతో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా ధురంధర్ 2 నిలిచింది.
స్ట్రీ 2 రికార్డు
స్ట్రీ 2 చిత్రం గతంలో రూ.10 కోట్లతో నెలకొల్పిన రికార్డును ధురంధర్ 2 దాటేసింది. ప్రీమియర్ షోల ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది. ప్రీమియర్ ఇంకా 9 రోజులు ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని సినిమాల ఓపెనింగ్ డే వసూళ్ల కంటే ధురంధర్ 2 ప్రీమియర్స్ కు ఎక్కువ కలెక్షన్లు రావడం గమనార్హం.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


