Dhurandhar 2: ధురంధర్ 2 విధ్వంసం-రిలీజ్ ముందే రూ.120 కోట్లు-పవన్ కల్యాణ్ ఓజీ, ప్రభాస్ బాహుబలి రికార్డులు బ్రేక్

Dhurandhar 2: ధురంధర్ 2 సినిమాకు మామూలు క్రేజ్ లేదు. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లోనూ ఈ మూవీ రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దీని అడ్వాన్స్ కలెక్షన్లు రూ.120 కోట్లకు చేరాయి. పఠాన్, ఓజీ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను ధురంధర్ 2 బద్దలు కొట్టింది. 

Published on: Mar 16, 2026, 12:18:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇది మామూలు హైప్ కాదు. ఈ క్రేజ్ వేరే లెవల్. మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ధురంధర్ 2 ఒకటి. కానీ దీని కోసం ఆడియన్స్ మరీ ఇంతలా వెయిట్ చేస్తున్నారా? అనేలా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. మూవీ రిలీజ్ కు ముందే ధురంధర్ 2 సంచలనంగా మారింది.

ధురంధర్ 2లో ర‌ణ్‌వీర్ సింగ్‌
ధురంధర్ 2లో ర‌ణ్‌వీర్ సింగ్‌

ధురంధర్ 2 ప్రీమియర్ షో

ర‌ణ్‌వీర్ సింగ్‌ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2. ఇది బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ కు సీక్వెల్ గా వస్తుంది. మార్చి 19న థియేటర్లలో ధురంధర్ 2 రిలీజ్ కానుంది. ఒక రోజు ముందు అంటే మార్చి 18న సాయంత్రం ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఈ ప్రీమియర్ షోల అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే ధురంధర్ 2 మూవీ రూ.32.44 కోట్లు ఖాతాలో వేసుకుంది.

ఓజీ రికార్డు బ్రేక్

2025లో రిలీజైన పవన్ కల్యాణ్ ‘ఓజీ’ మూవీ ప్రీమియర్ షోలతో రూ.25 కోట్లు సంపాదించింది. ఇప్పుడా రికార్డును ధురంధర్ 2తో ర‌ణ్‌వీర్ సింగ్‌ బ్రేక్ చేశాడు. ఇప్పటికే ఆ మూవీ ప్రీమియర్ షో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ తోనే రూ.32.44 కోట్లు సొంతం చేసుకుంది. ఈ సంఖ్య రూ.40 కోట్లు దాటే అవకాశముంది.

అడ్వాన్స్ బుకింగ్స్

ఇక ధురంధర్ 2 మూవీ జనరల్ షోల అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా వేరే లెవల్ లో ఉన్నాయి. గురువారం నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్ షోల టికెట్ల కోసం ప్రేక్షకులు ఎగబడుతున్నారు. రెండు రోజులకు దాదాపు 10 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ట్రేడ్ ఇన్సైడర్ల ప్రకారం ఇండియాలో ఫస్ట్ వీకెండ్ లో ధురంధర్ 2 మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రూ.60 కోట్లు దాటింది.

ఓవర్సీస్ లోనూ

ఓవర్సీస్ లోనూ ధురంధర్ 2 ఊచకోత కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ లో 5 మిలియన్ డాలర్ల మార్కును దాటిన మొదటి భారతీయ చిత్రంగా ధురంధర్ 2 నిలిచింది. పఠాన్, ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 లాంటి సినిమా రికార్డులను ధురంధర్ 2 బ్రేక్ చేసింది. ఇవన్నీ కూడా నార్త్ అమెరికాలో 4 మిలియన్ డాలర్లకు పైగా సంపాదించాయి. కానీ 5 మిలియన్ డాలర్లను మాత్రం చేరుకోలేకపోయాయి.

రూ.120 కోట్లు

నార్త్ అమెరికా సహా ఇతర దేశాల్లో కలిపి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 6 మిలియన్ డాలర్లకు పైగా సంపాదించింది. దీంతో ఇండియా ప్లస్ ఓవర్సీస్ అడ్వాన్స్ కలెక్షన్లు కలుపుకొంటే ఈ నంబర్ రూ.120 కోట్లకు చేరింది. మూవీ రిలీజ్ కు ఇంకా టైమ్ ఉండటంతో ధురంధర్ 2 అడ్వాన్స్ కలెక్షన్లు రూ.150 కోట్లు దాటే సూచనలు కనిపిస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More