Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్ ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ షురూ-ఉదయం 6 గంటల నుంచే షోలు-రికార్డుల మోతే-రన్‌టైమ్ ఎంతంటే?
Dhurandhar 2: బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి ధురంధర్ 2 వచ్చేసింది. ప్రీమియర్ షోల టికెట్ సేల్స్ తోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ అదరగొట్టేందుకు రెడీ అయింది. శనివారం ధురంధర్ 2 మూవీ నార్మల్ షోలకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.
బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపేందుకు, రికార్డులు మోత మోగించేందుకు ధురంధర్ 2 వచ్చేస్తోంది. మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీమియర్ షో టికెట్ సేల్స్ కు ఇప్పటికే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక మూవీ రిలీజ్ ఫస్ట్ డే స్పెషల్ షోల నుంచి నార్మల్ షోల వరకూ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఇవాళ స్టార్ట్ అయింది.

ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్
మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ధురంధర్ 2 మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ విషయాన్ని హీరో రణ్‌వీర్ సింగ్ తన ఎక్స్ లో పోస్టు చేశాడు.
“ఇక ఆటలను మొదలెట్టండి. ధురంధర్ ది రివెంజ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ దేశవ్యాప్తంగా స్టార్ట్ అయ్యాయి. మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి. మార్చి 19న ఉగాది, గుడి పడ్వా, ఈద్ సందర్భంగా ధురంధర్ ది రివెంజ్ రిలీజ్ అవుతుంది’’ అని రణ్‌వీర్ సింగ్ పోస్టులో పేర్కొన్నాడు.
ధురంధర్ 2 షో టైమింగ్స్
ధురంధర్ ది రివేంజ్ టికెట్లు ఇప్పుడు ఇండియాలోని అన్ని నగరాల్లో టిక్కెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. బుక్ మై షో ప్రకారం మెట్రో నగరాల్లో మొదటి షోలు ఉదయం 6:15–6:30 గంటల మధ్య ప్రారంభమవుతాయి. రాత్రి లాస్ట్ షోలను సుమారు 11:30–11:45 గంటల మధ్య షెడ్యూల్ చేశారు. కొన్ని థియేటర్లలో రాత్రి 11:55 గంటలకు లాస్ట్ షో స్టార్ట్ కానుంది.
ధురంధర్ 2 రన్ టైమ్
బాలీవుడ్ హంగామా ప్రకారం ధురంధర్ 2 సినిమా సుమారు 235 నిమిషాల (3 గంటల 55 నిమిషాలు) రన్‌టైమ్‌ను కలిగి ఉంటుందని తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో 3 గంటల 40 నిమిషాల నిడివి ఉన్న సినిమాను ప్రదర్శిస్తారని సమాచారం. ఈ చిత్రం దాని ప్రీక్వెల్ ధురంధర్ రన్ టైమ్ 214.01 నిమిషాల (3 గంటలు, 34 నిమిషాలు, 1 సెకను) రన్‌టైమ్‌ను అధిగమించింది.
ప్రీమియర్ షోలు
ధురంధర్ 2 ప్రీమియర్ షో టికెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ ప్రీమియర్ షో టికెట్ల సేల్స్ ద్వారానే రూ.100 కోట్లు కొల్లగొట్టే దిశగా ధురంధర్ 2 దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఖాతాలో చేరాయని సమాచారం. మరి అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ తో ధురంధర్ 2 ఇంకాా ఎన్ని రికార్డులు ఖాతాలో వేసుకుంటుందో చూడాలి. ధురంధర్ 2 మూవీకి ఆదిత్య ధర్ డైరెక్టర్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


