Pawan Kalyan: ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం.. నాకు వ్యాపారాలు లేవు.. సినిమా మాత్రమే ఉంది: పవన్ కల్యాణ్
Pawan Kalyan: ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ లోని డైలాగ్ ను తన ఫ్యాన్స్ కోసం ఇలా మార్చి చెప్పారు పవన్ కల్యాణ్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ స్పీచ్ పై ఓ లుక్కేయండి.
‘‘మిమ్మల్ని ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం’’.. ఇదీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్. ఈ మూవీలోని ‘‘ఇచ్చిపడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం’ డైలాగ్ ను ఫ్యాన్స్ కోసం పవన్ కల్యాణ్ ఇలా మార్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమాలు, రాజకీయాలపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

ప్రేమించే గోత్రం
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం (మార్చి 15) రాత్రి హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో ఉన్న పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ ఈవెంట్లో పవర్ స్టార్ స్పీచ్ హైలైట్ గా నిలిచింది. ఒక డైలాగ్ చెప్పమని ఫ్యాన్స్ అడగ్గా.. ‘‘మిమ్మల్ని ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం’’ అని పవన్ చెప్పడంతో అభిమానులు ఊగిపోయారు.
అన్నం పెట్టిన సినిమా
‘‘సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఇది నాకు అన్నం పెట్టింది. ప్రజలకు సేవ చేసే గుర్తింపును ఇచ్చింది. నిర్మాతలు బాగుండాలని, ఫ్యాన్స్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కథ మధ్యలో మారింది. కొవిడ్, రాజకీయాల కారణంగా మూవీ ఆలస్యమవుతూ వచ్చింది. కానీ నా విధులకు ఇబ్బంది లేకుండా 45 రోజుల్లోనే సినిమాను పూర్తి చేశాం’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
గబ్బర్ సింగ్ లా
‘‘పక్కా ప్రణాళికతో ఉంటే సినిమాలు చేయొచ్చనే భరోసా కలిగింది. నా అభిమాని దర్శకుడైతే హరీష్ శంకర్ లా ఉంటాడు. తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తి. సత్తా ఉన్నవాడు. ఈ సినిమా గబ్బర్ సింగ్ లా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. కానీ అంతిమ తీర్పు మాత్రం అభిమానులదే’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
టికెట్ రేట్లు
‘‘సినిమాను కచ్చితంగా చూడాలని ఎవరినీ బలవంతం చేయడం లేదు. అందుకే సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం ఏపీ ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఎవరైనా సరే దేహీ అని అడగాల్సిన అవసరం లేదు. నా సినిమాకు రేట్లు తక్కువే. మిగతా సినిమాలను ప్రోత్సహిస్తా. టికెట్ రేట్ల పెంపుపై ప్రతి రూపాయిలో 18 శాతం జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి అందుతుంది’’ అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
నాకు సినిమా
‘‘రాజకీయాల్లో ఉన్నవాళ్లకు వ్యాపారాలు ఉన్నాయి. కాంట్రాక్టులు చేసుకుంటున్నారు. అలా నాకు సినిమా ఉంది. రాజకీయాల్లో ఉండి సినిమాలు చేస్తున్నందుకు విమర్శలు వస్తుంటాయి. కానీ నేను పనులన్నీ మానుకుని సినిమాలు చేయడం లేదు. రోజుకు 16 గంటలు కష్టపడుతున్నా. నా సమయంలో మూణ్నాలుగు గంటలు సినిమాకు కేటాయిస్తున్నా. ఉస్తాద్ భగత్ సింగ్ తో ఇకపై కూడా సినిమాలు చేయొచ్చనే ధైర్యం కలిగింది’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది సందర్భంగా మార్చి 19న రిలీజ్ కానుంది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












