పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మూవీ ధురందర్. గతేడాది చివర్లో విడుదలైన ఈ ఆదిత్య ధర్ మూవీ బాలీవుడ్‌కు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. మొదటి భాగం సృష్టించిన ఈ సంచలనం.. ఇప్పుడు దాని సీక్వెల్ 'ధురంధర్: ది రివేంజ్' (Dhurandhar 2) మీద అంచనాలను పీక్స్‌కి తీసుకెళ్లింది. ఎంతలా అంటే ఈ సినిమా ఒక్క టికెట్ కూడా ఇంకా అమ్మకముందే నిర్మాతలకు రూ.250 కోట్ల లాభాలు రావడం విశేషం.
ధురంధర్.. అంచనాలకు అందని గ్రోత్

సాధారణంగా సీక్వెల్స్‌కు డిమాండ్ ఉండటం సహజమే. కానీ 'ధురంధర్ 2' విషయంలో అది పదింతలు పెరిగింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మొదటి భాగానికి, రెండో భాగానికి జరిగిన బిజినెస్ వ్యత్యాసం చూస్తే మతిపోతుంది.
మొదటి భాగం మ్యూజిక్ రైట్స్ సరిగమ సంస్థ కేవలం రూ. 20 కోట్లకు దక్కించుకుంది. పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు రెండో భాగం ఆడియో రైట్స్ కోసం టీ-సిరీస్ (T-Series) ఏకంగా రూ. 60 కోట్లు చెల్లించినట్లు వెరైటీ ఇండియా నివేదించింది.
ఇక మొదటి భాగాన్ని నెట్‌ఫ్లిక్స్ రూ. 85 కోట్లకు కొనుగోలు చేయగా.. ఇప్పుడు సీక్వెల్ కోసం జియోహాట్‌స్టార్ (JioHotstar) రికార్డు స్థాయిలో రూ. 150 కోట్లు వెచ్చించినట్లు బాలీవుడ్ హంగామా పేర్కొంది. అటు స్టార్ టీవీ గతంలో రూ. 25-30 కోట్లు చెల్లించగా, ఈసారి ఆ మొత్తం భారీగా పెరగనుంది.
పుష్ప రేంజ్ సక్సెస్ ఫార్ములా
గతంలో 'పుష్ప' సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. పుష్ప-1 నాన్-థియేట్రికల్ రైట్స్ రూ. 100 కోట్లకు అమ్ముడుపోతే.. క్రేజ్ పెరిగాక పుష్ప-2 బిజినెస్ రూ. 400 కోట్లు దాటింది. ఇప్పుడు 'ధురంధర్' కూడా అదే బాటలో పయనిస్తోంది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం 'ధురంధర్ 2' నాన్-థియేట్రికల్ బిజినెస్ (థియేటర్ల ఆదాయం కాకుండా) సులభంగా రూ. 250 కోట్లు దాటనుంది.
ముందే వచ్చేసిన 'టేబుల్ ప్రాఫిట్'
అసలు కిటుకంతా బడ్జెట్ ప్లానింగ్‌లోనే ఉంది. మొదట దీన్ని రూ. 400 కోట్లతో ఒకే సినిమాగా తీయాలనుకున్నారు. కానీ నిడివి ఎక్కువవడంతో రెండు భాగాలుగా విడగొట్టారు. దీంతో 'ధురంధర్ 2' నిర్మాణ వ్యయం సుమారు రూ. 200 కోట్లు అయ్యింది. మార్కెటింగ్ ఖర్చులు కలుపుకున్నా, సినిమా ల్యాండింగ్ కాస్ట్ రూ. 250 కోట్లుగా ఉంది.
{{/usCountry}}అసలు కిటుకంతా బడ్జెట్ ప్లానింగ్‌లోనే ఉంది. మొదట దీన్ని రూ. 400 కోట్లతో ఒకే సినిమాగా తీయాలనుకున్నారు. కానీ నిడివి ఎక్కువవడంతో రెండు భాగాలుగా విడగొట్టారు. దీంతో 'ధురంధర్ 2' నిర్మాణ వ్యయం సుమారు రూ. 200 కోట్లు అయ్యింది. మార్కెటింగ్ ఖర్చులు కలుపుకున్నా, సినిమా ల్యాండింగ్ కాస్ట్ రూ. 250 కోట్లుగా ఉంది.
{{/usCountry}}ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. సినిమా విడుదలకు ముందే కేవలం డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ ద్వారానే రూ. 250 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. అంటే థియేటర్‌లో బొమ్మ పడకముందే నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్లడమే కాకుండా లాభాల్లోకి వచ్చేశారు. ఇక థియేటర్లలో వచ్చేదంతా బోనస్ లాభమే. మొదటి భాగం రూ. 400 కోట్ల లాభం తెచ్చిపెట్టగా, రెండో భాగం దాన్ని మించే అవకాశం ఉంది.
మార్చి 19న అసలైన యుద్ధం
రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి భారీ స్టార్లతో వస్తున్న 'ధురంధర్: ది రివేంజ్' మార్చి 19న విడుదల కానుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు యశ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' (Toxic) నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.