Dhurandhar 2 Bookings: ధురంధర్ 2కు బంపర్ ఓపెనింగ్-ప్రివ్యూ షోలతోనే రూ.25 కోట్లు-రాకెట్ స్పీడ్‌తో టికెట్ల బుకింగ్స్!
Dhurandhar 2 Bookings: ధురంధర్ 2 మూవీ బంపర్ ఓపెనింగ్ కు రెడీ అవుతోంది. ప్రివ్యూ షోలతోనే రికార్డుల దుమ్ము దులిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అడ్వాన్స్ టికెట్ల సేల్స్ లో ఈ మూవీ రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది.
ధురంధర్ 2 సినిమా రిలీజ్ కు ఇంకా 10 రోజుల పైనే ఉంది. కానీ అప్పుడే రికార్డుల వేటకు ఈ స్పై థ్రిల్లర్ రెడీ అయిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో దూకుడుతో బంపర్ ఓపెనింగ్స్ సాధించే దిశగా ధురంధర్ 2 దూసుకుపోతోంది. ప్రివ్యూ షోలతోనే ఈ మూవీకి రూ.25 కోట్ల కలెక్షన్లు వస్తాయన్నది అంచనా.

ధురంధర్ 2 రిలీజ్
బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ సినిమాకు సీక్వెల్ గా ధురంధర్ 2 రాబోతుంది. మార్చి 19, 2026న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే అంతకంటే ఒక రోజు ముందు అంటే మార్చి 18న ధురంధర్ 2 ప్రివ్యూ షోలు వేయనున్నారు. ఈ షోల అడ్వాన్స్ టికెట్ల బుకింగ్స్ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి.
25 కోట్లు
శనివారం (మార్చి 7) ధురంధర్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ధురంధర్ 2 మూవీ ప్రివ్యూ షోలకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ సేల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ టికెట్లు జెట్ స్పీడ్ లో అమ్ముడు పోతున్నాయి. గంటకు 10 వేల టికెట్ల వరకూ అమ్ముడవుతున్నాయి. ఇదే స్పీడ్ కొనసాగితే ప్రివ్యూ షోల ద్వారానే ధురంధర్ 2 సినిమాకు రూ.25 కోట్ల కలెక్షన్లు వస్తాయని సినీ ట్రేడ్ ఎక్స్ పర్ట్ జోగిందర్ టుటేజా అంచనా వేశాడు.
ట్రెండింగ్ లో
ధురంధర్ 2 సినిమా ఇప్పుడు టికెట్ సెల్లింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ రోజు రిలీజైన ట్రైలర్ తో మూవీపై హైప్ మరింత పెరిగింది. ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో సినిమా చూడాలనుకునే ఆడియన్స్ ఉత్సాహం రెట్టింపు అయిందని మరో అనలిస్ట్ తరుణ్ ఆదరర్శ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్ల కోసం ప్రేక్షకులు పోటీపడుతున్నారని అతనన్నాడు.
ధురంధర్ 2 ట్రైలర్
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 2 సినిమా ట్రైలర్ ఇవాళ రిలీజైంది. ఈ పార్ట్ 2లో రణ్‌వీర్ సింగ్ అండర్‌కవర్ ఏజెంట్ జస్కిరాత్ సింగ్ రంగిగా తిరిగి వస్తున్నాడు. అతను ఇప్పుడు హమ్జా అలీ మజారీగా నేర ప్రపంచంలో పూర్తిగా కలిసిపోయాడు.
ధురంధర్ గురించి
ఆదిత్య ధర్ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ ధురందర్. ఈ మూవీ డిసెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్, సారా అర్జున్ తదితరులు నటించారు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా ధురంధర్ 2 రాబోతుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


