...
...
Next Story

ఒకే ఏడాది రూ.2000 కోట్ల కలెక్షన్లు.. విలన్ పాత్రలో దూకుడు.. ఇండస్ట్రీలో 30 ఏళ్లుగా ఉన్నా..

ఒకే ఏడాది రూ.2 వేల కోట్ల వసూలు చేసిన హీరోలు ఎంత మంది తెలుసు? కానీ ఓ విలన్ పాత్ర పోషించిన నటుడు ఇప్పుడీ జాబితాలో చేరాడు. అతని పేరు అక్షయ్ ఖన్నా. ఈ మధ్యే ధురంధర్ సినిమాలో నటనకుగాను అతనికి మంచి ప్రశంసలు దక్కాయి.

Published on: Jan 5, 2026, 15:53:26 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మూడు దశాబ్దాల కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా 2025 ఏడాది బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నాకు కలిసొచ్చింది. ఒకే ఏడాదిలో ఏకంగా రూ. 2000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన రెండో భారతీయ నటుడిగా అతడు చరిత్ర సృష్టించాడు. షారుక్ ఖాన్ తర్వాత ఈ ఘనత సాధించింది అక్షయ్ మాత్రమే కావడం విశేషం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ అతడు చేసింది విలన్ పాత్రలే.

విలనిజం వర్కౌట్ అయ్యింది..

Akshaye Khanna played gangster Rehman Dakait in Dhurandhar.
Akshaye Khanna played gangster Rehman Dakait in Dhurandhar.

హీరోగా కంటే విలన్‌గానే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు అక్షయ్ ఖన్నా. 2025లో అతడు నటించిన రెండు సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. అక్షయ్ ఖన్నా గతేడాది రెండు భారీ చిత్రాల్లో నటించాడు. ఇవి రెండూ బ్లాక్ బస్టర్లే.

మొదట గతేడాది జనవరిలో విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన ఛావా సినిమాలో అక్షయ్ ఖన్నా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో నటించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 809 కోట్లు రాబట్టింది.

ఇక డిసెంబర్‌లో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్‌ ధురంధర్ మూవీలో గ్యాంగ్‌స్టర్ రెహ్మాన్ డకైత్ పాత్రలో అక్షయ్ జీవించేశాడు. రణ్‌వీర్ సింగ్ హీరో అయినప్పటికీ, అక్షయ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా ఇప్పటివరకు రూ. 1200 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ రెండు సినిమాలు కలిపి 2025లో అక్షయ్ ఖన్నా ఖాతాలో రూ. 2000 కోట్లకుపైగా గ్రాస్ జమ కావడం విశేషం.

షారుక్ తర్వాత అక్షయే

ఇంతకుముందు ఈ రికార్డు ఒక్క షారుక్ ఖాన్ పేరు మీద మాత్రమే ఉండేది. 2023లో షారుక్ నటించిన పఠాన్, జవాన్, డంకీ సినిమాలు కలిపి రూ. 2685 కోట్లు వసూలు చేశాయి. ఇప్పుడు ఈ మార్క్ దాటిన నటుడిగా అక్షయ్ నిలిచాడు.

అక్షయ్ ఖన్నా ఇప్పుడు తెలుగులోకీ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న 'మహాకాళి' (Mahakali) సినిమాలో అక్షయ్ ఖన్నా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఒక ఫోటో బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ అక్షయ్ ఖన్నా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న పూజా కొల్లూరు.. అక్షయ్ ఖన్నాతో దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఈ సినిమాలో భూమి శెట్టి 'మహా' అనే ప్రధాన పాత్రలో నటిస్తుండగా, అక్షయ్ ఖన్నా రోల్ ఏంటనేది సస్పెన్స్ గా ఉంచారు. కానీ అతని పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందట.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe