ప్రేక్షకులను అలరించడానికి ఏదో ఒక కొత్తదనంతో ముందుకొచ్చే నటుడు ఆర్. మాధవన్. 'విక్రమ్ వేద', 'రాకెట్రీ', 'సైతాన్' వంటి విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాధవన్.. త్వరలో ‘ధురంధర్: ది రివెంజ్’తో మరోసారి రాబోతున్నాడు. అయితే 2016లో 'సాలా ఖడూస్' (తెలుగులో గురు) సినిమాకు ముందు అతడు దాదాపు నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తాజాగా 'అన్‌ఫిల్టర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్' షోలో మాధవన్ బయటపెట్టాడు.
ఆ స్విస్ రైతు చూపు నన్ను మార్చేసింది

ఆ సమయంలో తాను చేస్తున్న పనుల పట్ల తనకు అసంతృప్తి ఉండేదని మాధవన్ తెలిపాడు. "ఒకసారి స్విట్జర్లాండ్‌లో ఓ తమిళ పాట షూటింగ్ జరుగుతోంది. నేను డ్యాన్స్ చేస్తున్నాను. అక్కడ ఒక స్విస్ రైతు టీ తాగుతూ నన్ను చాలా ఈసడింపుగా చూశాడు. 'వీళ్ళేంటి ఇలా గెంతుతున్నారు' అన్నట్టుగా ఉంది ఆయన చూపు. మొదట నాకు చాలా కోపం వచ్చింది. కానీ వెంటనే నా బుర్రలో లైట్ వెలిగింది" అని మాధవన్ గుర్తు చేసుకున్నాడు.
"నిజమే కదా.. నేను ఇతరుల ట్యూన్స్ కు అనుగుణంగా ఆడుతున్నాను. నాకు గుర్రపు స్వారీ వచ్చు, తుపాకులు వాడటం వచ్చు, పబ్లిక్ స్పీకింగ్ వచ్చు, రిమోట్ విమానాలు నడపగలను.. ఇన్ని నైపుణ్యాలు ఉండి కూడా సినిమాల్లో అవేవీ చూపించకుండా కేవలం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే ప్రయత్నిస్తున్నాను. సూపర్ స్టార్ అవ్వాలనే తాపత్రయంలో నేను చేస్తున్న తప్పు నాకు అప్పుడే అర్థమైంది" అని మాధవన్ నిజాయితీగా అంగీకరించాడు.
భార్య అడిగిన ఆ ఒక్క ప్రశ్న..
తనలోని అసంతృప్తిని తన భార్య సరిత ముందే గుర్తించిందని మాధవన్ చెప్పాడు. "ఒకరోజు నా భార్య నన్ను అడిగింది.. 'అసలు నీకేమైంది? షూటింగ్ నుంచి ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేద్దామా అన్నట్టుగానే పనికి వెళ్తున్నావ్' అని. ఆ మాటలో నాకు చాలా అర్థం కనిపించింది. అందుకే బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను" అని అతడు వివరించాడు.
నాలుగేళ్లు దేశమంతా తిరిగి..
ఆ నాలుగేళ్ల బ్రేక్ లో తాను ఏం చేశానో మాధవన్ వెల్లడించాడు. "నేను యాడ్స్ చేయడం ఆపేశాను. గడ్డం పెంచాను. చెన్నైతో పాటు దేశవ్యాప్తంగా సామాన్యుడిలా తిరిగాను. ఆటోవాలాలతో మాట్లాడేవాడిని. వాళ్లకు నిజంగా ఏది ముఖ్యం? ఏ ఖర్చులు వాళ్ళని భయపెడుతున్నాయి? దేశం ఎటు వెళ్తోంది అన్నది తెలుసుకున్నాను. ఆ నాలుగేళ్ల అనుభవమే ఇప్పుడు నన్ను నటుడిగా నిలబెట్టింది" అని అతడు అన్నాడు.
{{/usCountry}}ఆ నాలుగేళ్ల బ్రేక్ లో తాను ఏం చేశానో మాధవన్ వెల్లడించాడు. "నేను యాడ్స్ చేయడం ఆపేశాను. గడ్డం పెంచాను. చెన్నైతో పాటు దేశవ్యాప్తంగా సామాన్యుడిలా తిరిగాను. ఆటోవాలాలతో మాట్లాడేవాడిని. వాళ్లకు నిజంగా ఏది ముఖ్యం? ఏ ఖర్చులు వాళ్ళని భయపెడుతున్నాయి? దేశం ఎటు వెళ్తోంది అన్నది తెలుసుకున్నాను. ఆ నాలుగేళ్ల అనుభవమే ఇప్పుడు నన్ను నటుడిగా నిలబెట్టింది" అని అతడు అన్నాడు.
{{/usCountry}}ఆ బ్రేక్ తర్వాతే తనకు అర్థమైంది.. తాను అప్పటివరకు పనిచేసిన దర్శకుల ఆలోచనా విధానం కన్నా తన ఆలోచనలు ఇంకాస్త ముందున్నాయని, అందుకే కొత్తవారితో ప్రయాణం మొదలుపెట్టానని తెలిపాడు.
'టాక్సిక్'తో తలపడనున్న ‘ధురంధర్ 2’
ఇక మాధవన్ సినిమాల విషయానికి వస్తే.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో 2025లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'ధురంధర్'కు సీక్వెల్‌గా 'ధురంధర్: ది రివెంజ్' రాబోతోంది. ఇందులో మాధవన్ ఐబీ డైరెక్టర్ అజయ్ సన్యాల్ (అజిత్ దోవల్ పాత్ర ఆధారంగా) పాత్రలో మరోసారి కనిపించనున్నాడు.
రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి స్టార్లు ఉన్న ఈ మూవీ మార్చి 19న విడుదల కానుంది. యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమాతో ఇది బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. మొదటి భాగం కేవలం హిందీలో విడుదలవ్వగా.. ఈ సీక్వెల్ మాత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.