పీరియ‌డ్స్‌తో ఉన్న‌ప్పుడు ఆ సాంగ్ చేశా..నొప్పితో ఏడ్చేశా..ధురంధ‌ర్ బ్యూటీ ఆయేషా కామెంట్లు..హ్యాట్సాఫ్ అంటున్న నెటిజ‌న్లు

స్పై థ్రిల్లర్ ధురంధర్ ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ మూవీలోని షరారత్ సాంగ్ తెగ వైరల్ గా మారింది. అయితే తాను పీరియడ్స్ తో ఉన్నప్పుడు ఈ సాంగ్ కోసం డ్యాన్స్ చేశానని ఆయేషా ఖాన్ వెల్లడించింది. దీంతో నెట్టింట్లో ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Published on: Feb 08, 2026 7:27 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం క్రియేట్ చేసిన మూవీ ధురంధర్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసింది. ఇందులోని షరారత్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇందులో ఆయేషా ఖాన్ తన డ్యాన్స్ తో మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ ధురంధర్ అదరగొడుతున్న నేపథ్యంలో షరారత్ సాంగ్ గురించి ఆయేషా మాట్లాడింది.

శరారత్ సాంగ్ లో అయేషా
శరారత్ సాంగ్ లో అయేషా

పీరియడ్స్ తో డ్యాన్స్

ధురంధర్ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని షరారత్ సాంగ్ మరోసారి వైరల్ గా మారింది. ఈ పాట కోసం షూటింగ్ చేస్తున్న సమయంలో తాను పీరియడ్స్ తో ఉన్నానని ఆయేషా ఖాన్ తాజాగా వెల్లడించింది. పింక్ విల్లాతో ఇంటరాక్షన్ సందర్భంగా ఆయేషా ఈ విషయాన్ని తెలిపింది.

చాలా అలసిపోయా

‘‘రెండు రోజుల షూటింగ్ జరిగింది. అప్పుడు చాలా బిజీగా అనిపించింది. ఆ సమయంలో నేను పీరియడ్స్ తో ఉన్నా. చాలా అన్ కంఫర్ట్ గా ఉంది. కానీ నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా. టైమ్ తక్కువ ఉండటంతో సాంగ్ షూటింగ్ త్వరగా పూర్తి చేయాలనుకున్నారు. నేను చాలా అలసిపోయా’’ అని ఆయేషా ఖాన్ తెలిపింది.

నొప్పితో ఏడ్చా

‘‘చాలా డ్యాన్స్ చేశా. ఎముకలు చాలా నొప్పి కలిగించాయి. పీరియడ్స్ లో ఉన్నా కాబట్టి మరింత నొప్పి కలిగింది. ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోయా. ఏడ్చేశా. బాధను తట్టుకున్నా. సాంగ్ బాగా రావడంతో తర్వాత ఆనందంతో కూడిన కన్నీళ్లు వచ్చాయి’’ అని ఆయేషా ఖాన్ వెల్లడించింది.

ఇంటర్నెట్ రియాక్షన్

పీరియడ్స్ తో ఉన్నా కూడా డ్యాన్స్ చేసిన ఆయేషా ఖాన్ పై నెట్టింట్లో ప్రశంసలు కురుస్తున్నాయి. అందరూ ఆమె డెడికేషన్ ను మెచ్చుకుంటున్నారు. ‘‘ఓహ్.. పీరియడ్స్ లో కూడా మీరు ఎలా డ్యాన్స్ చేయగలిగారు? మీరు ఎంతో టఫ్ టైమ్ ఫేస్ చేశారు. మీకు హ్యాట్సాఫ్’’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ‘‘పీరియడ్స్ తో ఉన్నా అద్భుతంగా డ్యాన్స్ చేశారు. మీకు హ్యాట్సాఫ్’’ అంటూ మరొకరు పోస్టు చేశారు.

200 మిలియన్ వ్యూస్

రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ మూవీలో పెళ్లి వేడుకల సందర్భంగా ఈ షరారత్ పాట వస్తుంది. ఈ పాటను శాశ్వత్ సచ్ దేవ్ స్వరపరిచారు. మధుబంతి బాగ్చి, జాస్మిన్ శాండ్లాస్ పాడారు. విజయ్ గంగూలీ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. యూట్యూబ్ లో షరారత్ ఇప్పటికే 200 మిలియన్ వ్యూస్ సాధించింది.