Dhurandhar Copy: ధురంధర్ కాపీ వివాదం కేసు కొట్టేసిన కర్ణాటక హైకోర్టు.. ఆదిత్య ధర్‌ను దొంగ అననని పిటిషనర్ సంతోష్ స్పష్టం!
Dhurandhar Copy Row Karnataka High Court Judgment: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్‌కు హైకోర్టు న్యాయస్థానంలో ఊరట లభించింది. 'ధురంధర్' సినిమా తన స్క్రిప్ట్ ఆధారంగా తీశారంటూ సంతోష్ కుమార్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలపై కర్ణాటక, బాంబే హైకోర్టులు కీలక ఆదేశాలు జారీ చేశాయి.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన'ధురంధర్' సినిమా కాపీ వివాదంలో దర్శకుడు ఆదిత్య ధర్ మొదటి విజయం అందుకున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు (CBFC) ఇచ్చిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలంటూ బెంగళూరుకు చెందిన స్క్రీన్ రైటర్ సంతోష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.

తన 'డి-సాహెబ్' అనే స్క్రిప్ట్‌ను దొంగిలించి ధురంధర్ సినిమా తీశారని సంతోష్ ఆరోపించారు. అయితే, జస్టిస్ కె.ఎస్. హేమలేఖ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఫిర్యాదులో ఎలాంటి పస లేదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కాపీరైట్ ఉల్లంఘనపై నష్టపరిహారం కోరుతూ సంతోష్ వేసిన మరో కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.
'దొంగ' అని అనను.. బాంబే హైకోర్టులో ఫిర్యాదుదారుడి హామీ
మరోవైపు, ఆదిత్య ధర్ తనపై దాఖలు చేసిన పరువు నష్టం దావాలో సంతోష్ కుమార్ వెనక్కి తగ్గారు. ఈ వివాదం కోర్టు పరిధిలో ఉన్నంత వరకు ఆదిత్య ధర్‌పై ఎలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయననని బాంబే హైకోర్టుకు సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు. జస్టిస్ ఆరిఫ్ డాక్టర్ సమక్షంలో సంతోష్ తరపు న్యాయవాది ఈ విషయాన్ని వెల్లడించారు.
అయితే, ఆదిత్య ధర్‌ను 'చోర్' (దొంగ) అని సంబోధించినందుకు క్షమాపణ చెప్పాలని ధురంధర్ డైరెక్టర్ తరపు లాయర్లు కోరగా, దానికి సంతోష్ బృందం నిరాకరించింది. తన వాదన సరైనదేనని సంతోష్ నమ్ముతున్నారని, అందుకే క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. కేవలం కోర్టు వెలుపల బహిరంగ ప్రకటనలు చేయబోమని మాత్రమే హామీ ఇచ్చారు.
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'ధురంధర్' సిరీస్
ఇదిలా ఉంటే, గతేడాది డిసెంబర్‌లో విడుదలైన 'ధురంధర్' బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు కొనసాగింపుగా ఈ ఏడాది మార్చిలో వచ్చిన 'ధురంధర్: ది రివెంజ్' అంతకు మించిన రికార్డులను సృష్టించింది.
ధురంధర్ 2 విడుదలైన తర్వాతే సంతోష్ కుమార్ ఈ కాపీ ఆరోపణలు తెరపైకి తెచ్చారు. తన స్క్రిప్ట్ స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ (SWA)లో నమోదై ఉందని, దాన్ని ఆదిత్య ధర్ కాపీ కొట్టారని ఆయన వాదించారు. ఈ క్రమంలోనే ఆదిత్య ధర్ మొదట లీగల్ నోటీసులు పంపి, ఆ తర్వాత బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు చిత్రాల్లో రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ వంటి అగ్ర తారలు నటించిన విషయం తెలిసిందే.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ధురంధర్ సినిమా కాపీ వివాదం ఏమిటి?
దర్శకుడు ఆదిత్య ధర్ తన 'డి-సాహెబ్' అనే స్క్రిప్ట్‌ను దొంగిలించి రణవీర్ సింగ్ హీరోగా 'ధురంధర్' సిరీస్ తీశారని సంతోష్ కుమార్ అనే రైటర్ ఆరోపిస్తున్నారు.
2. కర్ణాటక హైకోర్టు తీర్పు ఏమిటి?
ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలన్న సంతోష్ కుమార్ అభ్యర్థనను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. ఆ ఫిర్యాదులో తగిన ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది.
3. బాంబే హైకోర్టులో కేసు పరిస్థితి ఏంటి?
ఆదిత్య ధర్‌పై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయబోనని సంతోష్ కుమార్ కోర్టుకు హామీ ఇచ్చారు. అయితే క్షమాపణ చెప్పడానికి మాత్రం ఆయన నిరాకరించారు.
4. ధురంధర్ సినిమా ఎంత వసూలు చేసింది?
ధురంధర్ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1300 కోట్లు వసూలు చేయగా, రెండో భాగం అంతకంటే ఎక్కువ కలెక్షన్లతో రికార్డు సృష్టించింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


