లైవ్ కాన్సర్ట్‌లో అమ్మాయిల‌ను అస‌భ్యంగా తాకుతూ వేధింపులు .. అప్పుడు సింగ‌ర్ చేసిన పనికి నెటిజ‌న్లు ఫిదా

ధురంధర్ ఫేమ్ సింగర్ జాస్మిన్ సాండ్లాస్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె చేసిన ఓ పనికి అందరూ ఫిదా అవుతున్నారు. తన కాన్సర్ట్ సందర్భంగా అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన యువకులపై జాస్మిన్ సీరియస్ అయింది. వాళ్లను అక్కడి నుంచి పంపించేంతవరకు పాడనని చెప్పింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

Published on: Feb 11, 2026, 14:02:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ మూవీ టైటిల్ ట్రాక్ పాడిన జాస్మిన్ సాండ్లాస్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఆమె చేసిన ఓ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో జాస్మిన్ కాన్సర్ట్ నిర్వహించింది. అక్కడ కొంతమంది అమ్మాయిల పట్ల యువకులు అసభ్యంగా ప్రవర్తించారు.

జాస్మిన్ (Instagram/ @instantbollywood)
జాస్మిన్ (Instagram/ @instantbollywood)

మధ్యలోనే ఆపేసి

ఢిల్లీలో ధురంధర్ సింగర్ జాస్మిన్ కాన్సర్ట్ జరిగింది. అయితే ఆమె ఒక్కసారిగా మధ్యలోనే పాడటం ఆపేసింది. అందరూ ఏమైందోనని అనుకున్నారు. కానీ జాస్మిన్ తన కాన్సర్ట్ కు వచ్చినవాళ్లలో కొంతమంది అమ్మాయిలను యువకులు అసభ్యంగా తాకుతూ వేధించడం చూసింది. ఆ యువకులపై జాస్మిన్ సీరియస్ అయింది.

అమ్మాయిలతో అసభ్యంగా

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో జాస్మిన్ మధ్యలో తన సింగింగ్ ఆపేసింది. ‘‘సెక్యూరిటీ దయచేసి ఈ ఇద్దరు యువకులను బయటకు తీసుకెళ్లండి. వారు ఈ అమ్మాయిలకు ఇబ్బంది కలిగిస్తున్నారు’’ అని జాస్మిన్ చెప్పింది. తన కాన్సర్ట్ లో అమ్మాయిలు సేఫ్ గా ఫీల్ కాకపోతే తాను పాటలు పాడనని కూడా జాస్మిన్ చెప్పింది. వెంటనే అసభ్యంగా ప్రవర్తిస్తూ, వేధించిన యువకులను సెక్యూరిటీ బయటకు తీసుకెళ్లారు.

నెటిజన్ల రియాక్షన్

జాస్మిన్ వ్యవహరించిన తీరు పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ఎలాంటి బూతులను ఆమె వాడలేదు. ఎవరిపైనా అరవలేదు. ఎలాంటి డ్రామా లేదు. అమ్మాయిల రక్షణ కోసం బలంగా నిలబడింది. ఆమెకు హ్యాట్సాఫ్’’ అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.

ఇలాంటి వాళ్లు కావాలి

‘‘ఆమె మనసులు గెలుచుకుంది’’ అని మరొక యూజర్ జాస్మిన్ ను పొగుడుతూ కామెంట్ చేశాడు. ‘‘జాస్మిన్ ను అభినందిస్తున్నా. ఆ యువకులను పోలీసులకు పట్టించాలి’’ అని ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. ‘‘మన చుట్టూ ఇలాంటి జాస్మిన్ లు ఉండాలి. ఇలాంటి స్టార్లు దేశానికి అవసరం. ఆమె ఓ రాణి’’ అని మరో యూజర్ రాసుకొచ్చాడు.

హుషారుగా కాన్సర్ట్

ఢిల్లీలో జాస్మిన్ నిర్వహించిన కాన్సర్ట్ హుషారుగా సాగింది. మధ్యలో ఈ యువకుల మిస్ బిహేవియర్ మినహా కార్యక్రమం సందడిగా సాగింది. షరారత్ పాటలో సినిమాలో డ్యాన్స్ చేసిన నటి ఆయేషా ఖాన్ కూడా స్టేజీపైకి వచ్చి డ్యాన్స్ చేసింది.

జాస్మిన్ సింగర్ గా తరాస్, యార్ నా మిలే, ఇల్లీగల్ వెపన్ 2.0 లాంటి పాటలతో పాపులర్ అయింది. ఆమె గతంలో బైపోలార్ డిజార్డర్, డిప్రెషన్ తో బాధపడింది. ఆ సవాళ్లను దాటి సింగర్ గా అదరగొడుతోంది. ఇప్పుడు ఆమె చేసిన పనితో మరింత ఫేమస్ అయింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More