Sign in

25 ఏళ్లకు మళ్ళీ వస్తున్న మనసంతా నువ్వే.. ఉదయ్ కిరణ్ మేనకోడలు రియాక్షన్ వైరల్.. 2 నెలల పాపనంటూ వీడియో

మనసంతా నువ్వే.. ఈ సినిమా పేరు వినగానే మూవీ లవర్స్ ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోతారు. ఇప్పుడు మరోసారి ఆడియన్స్ కు ఆ మ్యాజిక్ అందించేందుకు ఈ మూవీ ఫిబ్రవరి 14న రీ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఉదయ్ కిరణ్ మేనకోడలు వీడియో ఒకటి వైరల్ గా మారింది. 

Published on: Feb 11, 2026, 11:33:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2001లో తెలుగు బాక్సాఫీస్ ను షేక్ చేసిన మూవీ మనసంతా నువ్వే. అప్పటికే చిత్రం, నువ్వు నేను సినిమాలతో సక్సెస్ అందుకున్న ఉదయ్ కిరణ్ కు మనసంతా నువ్వే మూవీ హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. ఈ సూపర్ హిట్ మూవీ ఇప్పుడు రీ రిలీజ్ కానుంది. 25 ఏళ్లకు మళ్లీ థియేటర్లకు రాబోతుంది.

మనసంతా నువ్వే పోస్టర్ (x/SrimathaCreati1)
మనసంతా నువ్వే పోస్టర్ (x/SrimathaCreati1)

మనసంతా నువ్వే రీ రిలీజ్

కల్ట్ లవ్ స్టోరీగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన సినిమాల్లో మనసంతా నువ్వే. ఇందులో ఉదయ్ కిరణ్ హీరో కాగా.. రీమాసేన్ హీరోయిన్ గా నటించింది. 2001, అక్టోబర్ 19న థియేటర్లలోకి వచ్చి సెన్సేషనల్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు రీ రిలీజ్ కాబోతుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లకు ఈ లవ్ స్టోరీ మళ్లీ రాబోతుంది.

ఉదయ్ కిరణ్ మేనకోడలు

మనసంతా నువ్వు రీ రిలీజ్ సందర్భంగా ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి ఈ మూవీ గురించి మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.

‘‘నేను ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతిని. ఈ ఫిబ్రవరి 14 చాలా స్పెషల్ గా ఉండబోతుంది. ఎందుకంటే మనసంతా నువ్వే తిరిగి థియేటర్లలోకి రాబోతుంది. ఈ మూవీ రిలీజ్ టైమ్ కు నేను రెండు నెలల పాపను. 175 రోజుల ఈవెంట్ అప్పుడు కూడా నేను చిన్న పాపనే’’ అని మహతి వీడియోలో పేర్కొంది.

25 ఏళ్లకు

‘‘ఈ మూవీని ఇప్పటికే చాలా సార్లు చూశా. ఇప్పుడు 25 ఏళ్లకు బిగ్ స్క్రీన్ పైకి ఈ సినిమా మళ్లీ రాబోతుంది. మీ అందరితో కలిసి చూడటానికి నాకెంతో ఎగ్జైటింగ్ గా ఉంది. ఫిబ్రవరి 14న థియేటర్లకు వస్తారని ఆశిస్తున్నా’’ అని మహతి వీడియో ఎండ్ చేసింది.

మనసంతా నువ్వే గురించి

మనసంతా నువ్వే సినిమాకు తెలుగు మూవీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో హీరో ఉదయ్ కిరణ్ ఇప్పుడు మన మధ్యలో లేకపోయినా మనసంతా నువ్వే లాంటి సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. విఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజు నిర్మించారు.

మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్, రీమా సేన్, తనూరాయ్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, సుధ, సునీల్, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నటించారు. చిన్నప్పుడు దూరమైన ఇద్దరు స్నేహితులు పెద్దయ్యాక తమ ప్రేమ కోసం ఎలా కలుసుకున్నారన్నదే మనసంతా నువ్వే మూవీ స్టోరీ. ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమాలోని అన్ని పాటలు ఛార్ట్ బస్టర్లుగా నిలిచాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More