Dil Raju Vrushakarma: వృషకర్మ కోసం దిల్ రాజు అంత భారీ మొత్తం ఖర్చు చేశారా? నాగ చైతన్యపై ఓ రేంజ్ నమ్మకం

Dil Raju Vrushakarma: నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా, 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ఈ మూవీ ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక హక్కులను ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భారీ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు.

Published on: Oct 27, 2026, 15:50:46 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Dil Raju Vrushakarma: టాలీవుడ్ అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సోషియో-ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ 'వృషకర్మ' (Vrushakarma). సాయి ధరమ్ తేజ్‌తో 'విరూపాక్ష' వంటి సంచలన బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు కార్తీక్ (Karthik) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో సినిమా ప్రారంభం నుంచే పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ అపారమైన అంచనాలు నెలకొన్నాయి.

Dil Raju Vrushakarma: వృషకర్మ కోసం దిల్ రాజు అంత భారీ మొత్తం ఖర్చు చేశారా? నాగ చైతన్యపై ఓ రేంజ్ నమ్మకం
Dil Raju Vrushakarma: వృషకర్మ కోసం దిల్ రాజు అంత భారీ మొత్తం ఖర్చు చేశారా? నాగ చైతన్యపై ఓ రేంజ్ నమ్మకం

ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో బాక్సాఫీస్ థియేట్రికల్ బిజినెస్ విపరీతమైన వేడిని పుట్టిస్తోంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌కు సంబంధించి ఒక మైండ్ బ్లాకింగ్ డీల్ అధికారికంగా కుదిరింది. ప్రసిద్ధ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 38 కోట్ల అడ్వాన్స్ + రూ. 5 కోట్ల రికవరబుల్ అమౌంట్‌కు దిల్ రాజు డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిల్ రాజు చేతికి 'వృషకర్మ' హక్కులు

టాలీవుడ్‌లో అత్యంత పవర్‌ఫుల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ కలిగిన ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజు (Dil Raju) 'వృషకర్మ' ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక మూడు కీలక ప్రాంతాల థియేట్రికల్ హక్కులను చేజిక్కించుకున్నారు.

అయితే తాజాగా గ్రేట్ ఆంధ్రా రిపోర్టు ప్రకారం.. దిల్ రాజు ఈ 3 రీజియన్ల పంపిణీ హక్కుల కోసం రూ. 38 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించారు. దీనికి అదనంగా మరో రూ. 5 కోట్ల రికవరబుల్ అమౌంట్ (Recoverable Amount) మీద ఈ డీల్ పూర్తయింది. నాగ చైతన్య సోలో కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థియేట్రికల్ రైట్స్ డీల్‌గా ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఈ బిజినెస్ డీల్ ఇటు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‌కు, అటు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు ఇద్దరికీ ఎంతో ప్రయోజనకరంగా కుదిరినట్లు తెలుస్తోంది.

ఆ సీన్లతో నాగ చైతన్య ఫుల్ కాన్ఫిడెంట్

ఈ మధ్య కాలంలో ఇతర భాషలకు చెందిన పలు భారీ చిత్రాలను నైజాంలో పంపిణీ చేసిన దిల్ రాజు.. చాలా రోజుల తర్వాత ఒక పక్కా తెలుగు స్ట్రెయిట్ బిగ్ ప్రాజెక్ట్‌ను ఇంతటి భారీ ధరకు సొంతం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దర్శకుడు కార్తీక్ రాసుకున్న వినూత్నమైన కథాంశం, గ్రాండ్ విజువల్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సులపై నాగ చైతన్య ఎంతో నమ్మకంతో ఉన్నారు.

శ్రీ వెంకటేశ్వర చలనచిత్ర (SVCC) బ్యానర్‌పై సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత బ్రహ్మాండమైన నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు. వరుస విజయాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన అందాల భామ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ఇందులో కథానాయికగా నటిస్తోంది.

డిసెంబర్ 4న బాక్సాఫీస్ వద్ద రచ్చ

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'వృషకర్మ' చిత్రాన్ని వచ్చే డిసెంబర్ 4న (December 4) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దిల్ రాజు వంటి అగ్ర పంపిణీదారుడు రంగంలోకి దిగడంతో నైజాం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన థియేటర్లలో ఈ సినిమాకు భారీ స్థాయిలో స్క్రీన్లు లభించడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More