Dil Raju: దట్ ఈజ్ పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ ఆ రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోలేదు: దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్లు
Dil Raju: సినిమా హీరోగా కోట్లాది ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో అడుగుపెట్టి, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మంచి మనసు గురించి చెప్తూ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రశంసలు కురిపించారు.
Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి దిల్ రాజు చెప్పిన మాటలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

దిల్ రాజు కామెంట్లు
నాని అప్ కమింగ్ మూవీ ‘ది ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (సెప్టెంబర్ 21) రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు దిల్ రాజు గెస్ట్ గా వచ్చారు. తన స్పీచ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి దిల్ రాజు చెప్పారు. పవన్ కళ్యాణ్ మంచి మనసు గురించి దిల్ రాజు చెప్పిన వీడియో వైరల్ గా మారింది.
రూ.5 కోట్లు తీసుకోలేదు
‘‘ప్రొడ్యూసర్ గా ఈ 25 ఏళ్లలో చాలా సిచ్యుయేషన్స్ చూశా. ఒక విషయం గురించి చెప్పాలి. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఆయన హీరోగా మా ప్రొడక్షన్ లో ‘వకీల్ సాబ్’ మూవీ తీశాం. అయితే మా ప్రొడక్షన్ ఇచ్చిన రెమ్యునరేషన్ తో ఆయన పార్టీని నడిపానని గేమ్ ఛేంజర్ ఈవెంట్లో చెప్పారు.
కానీ, వకీల్ సాబ్ రిలీజ్ తర్వాత కొవిడ్, ఇతర పరిస్థితుల కారణంంగా మేం ఇబ్బంది పడ్డాం. అప్పుడు పవన్ కళ్యాణ్ కు ఇంకా రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాల్సింది. కానీ ఆ రెమ్యునరేషన్ ఆయన తీసుకోలేదు. దటీజ్ పవర్ స్టార్’’ అని దిల్ రాజు వెల్లడించారు.
ఫ్యాన్స్ ఖుష్
పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి టాప్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజ్ కామెంట్లు ఇప్పుడు ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ఈ వీడియో చూసి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గ్రేట్ అంటూ దిల్ రాజు మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
ది ప్యారడైజ్ గురించి
నాని హీరోగా నటించిన రా అండ్ రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ మూవీ సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది. ఇందులో నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటుడు మోహన్ బాబు తన విలనిజంతో భయపెట్టనున్నారు.
శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ కూడా షురూ అయ్యాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


