Pawan Kalyan Birthday: తొలిప్రేమ నుంచి OG వరకు-పవన్ కళ్యాణ్ కెరీర్‌ను మార్చేసిన 7 ఐకానిక్ సినిమాలు-ఓటీటీలో ఓ లుక్కేయండి

Pawan Kalyan Birthday: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే తెలుగు రాష్ట్రాల్లో అదొక పండగ. పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచి, బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 7 ఆల్‌టైమ్ బెస్ట్ సినిమాలు మీ కోసం. అవి ఏ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

Published on: Sep 2, 2026, 05:44:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Pawan Kalyan Birthday: ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో వెండితెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ స్టార్. తనదైన స్టైల్, మేనరిజమ్స్, ఆటిట్యూడ్‌తో ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన 'కల్ట్ ఫాలోయింగ్'ను సంపాదించుకున్నారు పవన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నప్పటికీ, వెండితెరపై ఆయన క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు.

తొలిప్రేమ నుంచి OG వరకు-పవన్ కళ్యాణ్ కెరీర్‌ను మార్చేసిన 7 ఐకానిక్ సినిమాలు-ఓటీటీలో ఓ లుక్కేయండి
తొలిప్రేమ నుంచి OG వరకు-పవన్ కళ్యాణ్ కెరీర్‌ను మార్చేసిన 7 ఐకానిక్ సినిమాలు-ఓటీటీలో ఓ లుక్కేయండి

యువతలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇవాళ (సెప్టెంబర్ 2) పవన్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొట్టిన ఆ 7 సినిమాలను చూసేయండి.

తొలిప్రేమ (Tholi Prema)

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: ఆహా (Aha)

కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్‌ను యూత్ ఐకాన్‌గా మార్చడమే కాకుండా నేషనల్ అవార్డును కూడా గెలుచుకుంది. బాలు పాత్రలో పవన్ అమాయకత్వం, అను పట్ల ఉన్న ప్రేమని చాటుకునే విధానం కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కెరీర్‌లో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచింది. ఇప్పటికీ ఓటీటీలో క్రేజ్ దక్కించుకుంటోంది.

తమ్ముడు (Thammudu)

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)

స్పోర్ట్స్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్ మేళవింపుతో వచ్చిన 'తమ్ముడు' చిత్రం అప్పట్లో ఒక ఊపు ఊపింది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పవన్ మేనరిజమ్స్, హెయిర్ స్టైల్ యూత్‌లో పెద్ద ట్రెండ్‌గా మారాయి.

ఖుషి (Kushi)

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (Netflix)

సిద్ధు, మధు మధ్య సాగే ఈగో వార్, ఫ్రెండ్‌షిప్, లవ్ ట్రాక్ తెలుగు సినిమా హిస్టరీలోనే ఒక బెంచ్ మార్క్. ఎస్‌.జె. సూర్య మేకింగ్, మణిశర్మ మ్యూజిక్, పవన్ కళ్యాణ్-భూమికల కెమిస్ట్రీ ఈ చిత్రాన్ని ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి. ఇటీవల రీ-రిలీజ్‌లోనూ ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను సాధించడం దీని మేనియాకు నిదర్శనం.

జల్సా (Jalsa)

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ఇది. తీవ్రవాదిగా మారి తిరిగి నార్మల్ లైఫ్‌లోకి వచ్చే సంజయ్ సాహు పాత్రలో పవన్ నటన, డిఫరెంట్ కామెడీ టైమింగ్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. దేవిశ్రీ ప్రసాద్ ఆల్బమ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.

గబ్బర్ సింగ్ (Gabbar Singh)

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: జియోహాట్ స్టార్ (JioHotstar)

దాదాపు దశాబ్ద కాలంగా సరైన హిట్ లేక నిరాశలో ఉన్న అభిమానులకు హరీష్ శంకర్ అందించిన ఊరమాస్ కానుక 'గబ్బర్ సింగ్'. పోలీస్ ఆఫీసర్ గబ్బర్ సింగ్‌గా పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, అంతాక్షరి సీన్, కేక పుట్టించే డైలాగులతో థియేటర్లలో రికార్డుల సునామీ సృష్టించింది.

అత్తారింటికి దారేది (Attarintiki Daredi)

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసిన చిత్రం ఇది. పైరసీ బారిన పడి విడుదలైనప్పటికీ, తెలుగు చిత్రసీమలో అప్పటివరకు ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.

దే కాల్ హిమ్ ఓజీ (They Call Him OG)

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా పవన్ కళ్యాణ్‌ను సరికొత్త ఓజస్ గంభీర పాత్రలో ఆవిష్కరించింది. 1990ల ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించి, నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‌లో నిలిచింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More