Kavya Kalyanram: తమ్ముడితో సినిమా.. అన్నతో ప్రేమ.. కావ్య కళ్యాణ్‌ రామ్ మాత్రమే కాదు.. ఈ హీరోయిన్ల లవ్ స్టోరీలు అలాంటివే!

Kavya Kalyanram: టాలీవుడ్ లో కొత్త లవ్ జంట వైరల్ గా మారింది. హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్-కాళభైరవ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తమ రిలేషన్ షిప్ ను వీళ్లు అనౌన్స్ చేేసేశారు. అయితే కాళభైరవ తమ్ముడితో కావ్య సినిమా చేసింది. ఇలా తమ్ముడితో సినిమాలు చేసి అన్నను ప్రేమించిన హీరోయిన్లు ఇంకా ఉన్నారు.

Published on: Sep 1, 2026, 06:16:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kavya Kalyanram: చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'గంగోత్రి' చిత్రంలో అలరించి, 'బలగం' సినిమాలో హీరోయిన్ గా అదరగొట్టిన కావ్య కళ్యాణ్ రామ్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి పెద్ద కుమారుడు, యువ సంగీత దర్శకుడు కాలభైరవతో ఆమె లవ్ లో ఉండటమే కారణం. త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు.

తమ్ముడితో సినిమా.. అన్నతో ప్రేమ.. కావ్య కళ్యాణ్‌ రామ్ మాత్రమే కాదు.. ఈ హీరోయిన్ల లవ్ స్టోరీలు అలాంటివే!
తమ్ముడితో సినిమా.. అన్నతో ప్రేమ.. కావ్య కళ్యాణ్‌ రామ్ మాత్రమే కాదు.. ఈ హీరోయిన్ల లవ్ స్టోరీలు అలాంటివే!

తమ్ముడితో సినిమా

కావ్య కళ్యాణ్ రామ్- కాళ భైరవ లవ్ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వార్త బయటకు రావడంతోనే సినీ లవర్స్ లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కావ్య కళ్యాణ్‌ రామ్ 'ఉస్తాద్' చిత్రంలో కాలభైరవ తమ్ముడు శ్రీసింహా కోడూరి సరసన హీరోయిన్ గా నటించింది.

ఈ హీరోయిన్లు కూడా

​వెండితెరపై తమ్ముడితో జంటగా కనిపించిన కావ్య, నిజ జీవితంలో మాత్రం అన్న కాలభైరవతో ఏడడుగులు వేస్తుండటం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఒక హీరోతో సినిమా చేసి, ఆ తర్వాత వారి సోదరుడిని వివాహం చేసుకోవడం సినీ పరిశ్రమలో ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ కొంతమంది హీరోయిన్లు ఇలా చేశారు.

​శ్రీదేవి - అనిల్ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్‌తో కలిసి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించారు. 'మిస్టర్ ఇండియా', 'జుదాయి', 'రూప్ కీ రాణి చోరోన్ కా రాజా' వంటి విజయవంతమైన చిత్రాలు వీరి కాంబినేషన్‌లో వచ్చి ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.

అయితే, తెరపై అనిల్ కపూర్‌తో జంటగా మెరిసిన శ్రీదేవి.. నిజ జీవితంలో మాత్రం ఆయన సొంత అన్నయ్య, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు.

​శ్రియా రెడ్డి - విశాల్

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పొగరు' (తమిళంలో 'తిమిరు') చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న 'ఈశ్వరి' పాత్రతో ప్రేక్షకులను భయపెట్టిన నటి శ్రియా రెడ్డి, ఆ సినిమాలో హీరో విశాల్‌తో కలసి నటించారు. ఆ చిత్రంలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ, వెండితెరపై విశాల్‌ను ఢీకొట్టిన శ్రియా రెడ్డి.. రియల్ లైఫ్‌లో విశాల్ సొంత సోదరుడు, నిర్మాత విక్రమ్ రెడ్డిని పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలయ్యారు.

​లావణ్య త్రిపాఠి - మెగా ఫ్యామిలీ

ఇక టాలీవుడ్ లో అందాల రాక్షసిగా గుర్తింపు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి వివాహం కూడా ఇలాగే సాగిందని చెప్పొచ్చు. మెగా హీరోలు సాయిధరమ్ తేజ్‌తో 'ఇంటెలిజెంట్', అల్లు శిరీష్‌తో 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాల్లో లావణ్య హీరోయిన్ గా నటించింది.

ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది లావణ్య. రీల్ లైఫ్‌లో వరుసకు అన్నలు అయ్యే హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని, రియల్ లైఫ్‌లో వరుణ్ తేజ్ సగభాగమయ్యారు లావణ్య.

​సోనియా- ధనుష్

తమిళ చిత్ర పరిశ్రమలో 'కాదల్ కొండేన్', '7జి రెయిన్‌బో కాలనీ', 'పుదుపేట్టై' వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన హీరోయిన్ సోనియా అగర్వాల్. అయితే 'పుదుపేట్టై' చిత్ర చిత్రీకరణ సమయంలో ధనుష్ సొంత సోదరుడు, ఆ చిత్ర దర్శకుడు సెల్వరాఘవన్‌తో ప్రేమలో పడి ఆయనను వివాహం చేసుకుంది సోనియా. కానీ 2010లో ఈ జంట విడిపోయింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More