Dimple Hayathi: గ్లామ్, సాంగ్స్ మాత్రమే చూశారు.. ఫస్ట్ టైమ్ ఓ డైరెక్టర్ కేవలం నా కళ్లపైనే ఫోకస్ పెట్టాడు: డింపుల్ హయాతి

Dimple Hayathi: తెలుగు హీరోయిన్ డింపుల్ హయాతి అనగానే గ్లామర్ పాత్రలు, సాంగ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘భోగి’ సినిమాలో డింపుల్ నటనకు ప్రాధాన్యమున్న పాత్ర చేసింది. ఇదే విషయాన్ని తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తూ డింపుల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

Published on: Nov 23, 2026, 15:01:07 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Dimple Hayathi: శర్వానంద్ హీరోగా వస్తున్న అప్ కమింగ్ మూవీ ‘భోగి’. శర్వానంద్ రా అండ్ రస్టిక్ రోల్ లో నటిస్తున్న సినిమా ఇది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ తో పాటు డింపుల్ హయాతి కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా భోగి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డింపుల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గ్లామ్, సాంగ్స్ మాత్రమే చూశారు.. ఫస్ట్ టైమ్ ఓ డైరెక్టర్ కేవలం నా కళ్లపైనే ఫోకస్ పెట్టాడు: డింపుల్ హయాతి
గ్లామ్, సాంగ్స్ మాత్రమే చూశారు.. ఫస్ట్ టైమ్ ఓ డైరెక్టర్ కేవలం నా కళ్లపైనే ఫోకస్ పెట్టాడు: డింపుల్ హయాతి

డింపుల్ హయాతి కామెంట్లు

శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం (నవంబర్ 23) రాత్రి జరిగింది. ఈ ఈవెంట్లో ఎర్ర చీరలో మెరిసిపోయిన డింపుల్ హయాతి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. భోగి సినిమాలో ఆమె మందారం అనే క్యారెక్టర్ ప్లే చేస్తోంది. ఈ మూవీ గురించి, తన క్యారెక్టర్ గురించి డింపుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

క్యారెక్టర్ ఛాన్స్ ఇలా

‘‘నేనే వేరే నరేషన్ కోసం వెళ్లా. అక్కడ సంపత్ నంది కలిశారు. నా కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. నేను వేరే రోల్ కోసం వెళ్తే నాకు భోగి సినిమాలో పాత్ర దక్కింది. కథ విన్నప్పుడే నేను మందారం క్యారెక్టర్ చేయాలని ఫిక్స్ అయ్యా. నాకు ఇదొక కొత్త డిఫరెంట్. నాకు కొత్త లుక్ ఇచ్చారు’’ అని డింపుల్ హయాతి తెలిపింది.

నా కళ్లపై ఫోకస్

‘‘ఇప్పటివరకూ మీరు నా గ్లామర్, సాంగ్స్ చూశారు. డ్యాన్స్ చేయగలుగుతుందని అనుకున్నారు. కానీ ఫస్ట్ టైమ్ ఓ డైరెక్టర్ కేవలం నా కళ్ల పైనే ఫోకస్ పెట్టారు. ఆయన సంపత్ నంది. ఈ రోల్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మందారం అనేది పవర్ ఫుల్ క్యారెక్టర్. ఈ డైరెక్టర్ కు నాకేం కావాలో తెలుసు. తొలిసారి షూటింగ్ ను ఎంజాయ్ చేశా’’ అని డింపుల్ హయాతి పేర్కొంది.

గ్లామర్ రోల్స్

విజయవాడ అమ్మాయి డింపుల్ హయాతి గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితమనే పేరు ఎప్పటి నుంచో ఉంది. ఆమె చేసిన పాత్రలు కూడా అలాంటివే. తెలుగులో ఖిలాడీ, రామబాణం సినిమాల్లో డింపుల్ గ్లామర్ క్యారెక్టర్లు ప్లే చేసింది. రీసెంట్ గా వచ్చిన ఆదర్శ కుటుంబం సినిమాలో ‘నారాయణమ్మ’ అనే స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది.

ఇప్పుడు భోగి సినిమాలో యాక్టింగ్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరకడంతో డింపుల్ హయాతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ శర్వానంద్ సినిమా నవంబర్ 27న రిలీజ్ కానుంది. భోగి మూవీకి భీమ్స్ సంగీతం అందించారు.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.