Egilivaranga Lyrics: మనసును తాకుతున్న తెలంగాణ బతుకు పాట- ట్రెండింగ్ లో భోగి సినిమాలోని ఎగిలివారంగా సాంగ్- లిరిక్స్ ఇవే!
Egilivaranga song Lyrics: తెలంగాణ మనుషులను, ఇక్కడి బతుకులను, మట్టి వాసనను చాటేలా సాగుతున్న ‘ఎగిలివారంగా’ సాంగ్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘భోగి’ సినిమాలోని ఈ పాటను జనాలు తెగ వింటున్నారు. అద్భుతమైన సాహిత్యంతో సాగుతున్న ఈ పాట లిరిక్స్ మీ కోసం.
Egilivaranga song Lyrics: తెలంగాణ పాటలకు, ఇక్కడి సాహిత్యానికి ఇప్పుడు తెలుగు సినిమాల్లో గొప్ప స్థానం దక్కుతోంది. తెలంగాణ జానపదాలు ఇప్పుడు బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. ఆ క్రమంలోనే శర్వానంద్ మూవీ ‘భోగి’లో నుంచి ఇటీవల ‘ఎగిలివారంగా’ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

తెలంగాణ మట్టి వాసన
భోగి మూవీ నుంచి వచ్చిన ఎగిలివారంగా సాంగ్ తెలంగాణ మట్టి వాసనను చాటుతోంది. ఇక్కడి మనుషులు, ఆచార సంప్రదాయాలు, కులవృత్తులను ప్రస్తావిస్తూ సాగుతోంది. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాసిన ఈ పాట సాహిత్యం అద్భుతంగా ఉంది. నల్లొండ గద్దర్ నర్సన్న, కందుకూరి శంకర్ బాబు, రేలారే గోపాల్ అంతే అమోఘంగా పాడారు. ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూసేయండి.
ఎగిలివారంగ లేసి
ఇల్లలికి పూధిచ్చి
ఇల్లలికి పూధిచ్చి
దీగుట్ల దేవతలకు దీపాలు ముట్టించి
దీపాలు ముట్టించి
కొట్టంలో బర్లు గొడ్లకు కుడితీనే దాపించి
కుడితీనే దాపించి
పజ్జొన్న గటకలోకి సల్లానీళ్లే పోసి
సల్లానీళ్లే పోసి
బుత్తంతా నోట్లోబెట్టి కడుమాది సద్ది గట్టి
కడుమాది సద్ది గట్టి
సెలకల్లో తొవ్వబట్టి
సేను తొవ్వబట్టి
సేను తొవ్వబట్టి
ఎదురువడ్డోళ్లతోని పారాషాకాలాడి
పారాషాకాలాడి
కండ్లపడ్డోళ్లతోని
కారెడ్డాలాడుతూ
ఈరెడ్డాలాడుతూ
బండ్ల బాటల్లా పోతు
ముండ్ల బాటల్లా పోతు
లొందల్లా పోతు పోతు
లొందల్లా పోతు పోతు
భూదేవి కడుపులోనా
భూలచ్చిమి గడపలోనా
భూదేవి కడుపులోనా భూలచ్చిమి గడపలోనా
రెక్కలు ముక్కలు జేసే బక్కజీవులం బడుగు జీవులం
బక్కజీవులం బడుగు జీవులం
రామ రామ రామ రామ ...రామొజ్జ రామ రామ ..
రామొజ్జ రామ రామ ... రామ రామ రామ రామ ... రామ రామ రామ రామ ...రామొజ్జ రామ రామ
అరె ఓటుంటే ఓటి లేదు
రామొజ్జ రామ రామ
నాగలుంటే ఎద్దు లేదు
రామొజ్జ రామ రామ
ర్యాగడుంటే నీళ్లు లేవు
రామొజ్జ రామ రామ
చెమట నీళ్ల సేద్యము
రామొజ్జ రామ రామ
రగతమే పెట్టుబడి
రామొజ్జ రామ రామ
అటు తిప్పి ఇటు తిప్పి
ఆ పంట పండించి
కల్లాలు ఉడిపించి బండ్ల మీదికెక్కించి
గుమ్మిలోన నింపించి కుంచమన్ని దీపించి
కుండలోన ఉడికించి
రామా...
రామొజ్జ రామ రామ .... రామొజ్జ రామ రామ ... రామొజ్జ రామ రామ ... రామొజ్జ రామ రామ .. రామొజ్జ రామ రామ
మేధారి నరసన్నా బుట్టాలు తేవంగా తట్టాలు తేవంగా
కమ్మారి గంగన్నా కత్తులు తేవంగా కొడవండ్లు తేవంగా
సాకాలి సమ్మన్నా బట్టాలు సుట్టంగా బట్టాలు సుట్టంగా
మాదిగా ఐలన్నా డప్పులు కొట్టంగా సప్పుడు సేయంగా
గొల్లోల్ల సులోచనా మోదుగాకు తేవంగా ఇస్తర్లు కుట్టంగా
నలుగురి సేతులతోటి నైవేద్యం తియ్యంగా నైవేద్యం తియ్యంగా
పోశమ్మ కానే కాదు
మైసమ్మ కానే కాదు
శివుడికి కానే కాదు
రాముడికి కానే కాదు
మావూరి దేవుడు
మాగుట్ట దేవుడు
బొగ్గుట్ట దేవుడు
మావూరి పటేలుకు నైవేద్యం బెడతాముల్లా
మావూరి పటేలుకు నైవేద్యం బెడతాముల్లా
రామ రామ రామ రామ రామొజ్జ రామ రామ రామ రామ రామ రామ రామొజ్జ రామ రామ
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


