ఒకే పాట మళ్లీ మళ్లీ పాడలేకే అరిజీత్ రిటైరయ్యాడు.. ఆ ఒక్క పాటతో 100 పాటలు చేశాడు.. అదీ అతని టాలెంట్: డైరెక్టర్ కామెంట్స్

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు అరిజీత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్‌కు గుడ్ బై చెప్పడం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. అయితే అతడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తాజాగా బయటపెట్టాడు. "ఒకే రకమైన విషాద గీతాలు పాడి పాడి అతను విసిగిపోయాడు" అని అనురాగ్ అనడం విశేషం.

Published on: Feb 16, 2026, 20:45:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ టాప్ సింగర్ అరిజీత్ సింగ్ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదీ అంటూ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన గొంతుతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న అరిజీత్ సింగ్.. ఇకపై సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్‌గా పాటలు పాడనని అనౌన్స్ చేసి అందరినీ షాక్‌కు గురిచేశాడు. ‘ట్రైడ్ అండ్ రెఫ్యూజ్డ్ ప్రొడక్షన్స్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ అనురాగ్.. అరిజీత్ మనసులో మాటను బయటపెట్టాడు.

ఒకే పాట మళ్లీ మళ్లీ పాడలేకే అరిజీత్ రిటైరయ్యాడు.. ఆ ఒక్క పాటతో 100 పాటలు చేశాడు.. అదీ అతని టాలెంట్: డైరెక్టర్ కామెంట్స్
ఒకే పాట మళ్లీ మళ్లీ పాడలేకే అరిజీత్ రిటైరయ్యాడు.. ఆ ఒక్క పాటతో 100 పాటలు చేశాడు.. అదీ అతని టాలెంట్: డైరెక్టర్ కామెంట్స్

"ఎప్పుడూ అదే పాట.. అదే ఏడుపు.."

అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. "అరిజీత్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించడానికి ప్రధాన కారణం.. అతను ఒకే రకమైన పాటలు పాడి పాడి అలసిపోయాడు. ఎప్పుడు చూసినా అదే ‘హార్ట్ బ్రేక్ సాంగ్’ పాడమంటారు. అరిజీత్ చాలా ప్రతిభావంతుడు. సాన్యా మల్హోత్రా నటించిన 'పగ్లైట్' (Pagglait) సినిమాకు అతను సంగీతం అందించాడు. అతను కేవలం గాయకుడే కాదు.. ఒక మంచి ఫిలిం మేకర్ కూడా. అతను చాలా ప్రైవేట్ వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఎప్పుడూ ఒకే మూసలో పాటలు పాడమంటే కష్టమే. విరహ గీతాల కంటే అరిజీత్ లో ఇంకా చాలా గొప్ప సంగీతం దాగి ఉంది" అని అనురాగ్ తెలిపాడు.

"మనసుతో పాడేవాడిని బంధించలేం.."

అరిజీత్ స్వేచ్ఛను కోరుకుంటాడని అనురాగ్ చెప్పాడు. "అతను చాలా కొత్తగా ఏదో చేయాలనుకుంటున్నాడు. మేము 'నిషాంచీ' (Nishaanchi) సినిమా చేసేటప్పుడు, అతను ఆ పాట కోసం 100 రకాలుగా ప్రయత్నించాడు. ఎందుకంటే అలాంటి పాట పాడమని అతన్ని అంతకుముందెవరూ అడగలేదు. సంగీతం అనేది మనసు నుంచి రావాలి. స్వచ్ఛమైన గాయకులు, సంగీతకారులు మనసుతో పని చేస్తారు. వాళ్లకు స్వేచ్ఛనిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. అలా కాకుండా.. 'మాకు ఇలాగే కావాలి' అని ఆర్డర్ వేస్తే, వాళ్లు తమ చేతులు కట్టేసినట్లుగా ఫీలవుతారు. తమని తాము కోల్పోతున్నట్లు భావిస్తారు" అని అనురాగ్ విశ్లేషించాడు.

అరిజీత్ షాకింగ్ ప్రకటన..

గత నెల 27న అరిజీత్ సింగ్ తన సోషల్ మీడియా ద్వారా ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. "అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇన్నేళ్లుగా శ్రోతలుగా మీరు నాకు ఇచ్చిన ప్రేమకు కృతజ్ఞతలు. ఇకపై నేను ప్లేబ్యాక్ వోకలిస్ట్‌గా కొత్త అసైన్‌మెంట్స్ తీసుకోనని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇదొక అద్భుతమైన ప్రయాణం" అని అతడు ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు.

అరిజీత్ కెరీర్ ఇలా..

2005లో ‘ఫేమ్ గురుకుల్’ అనే రియాలిటీ షో ద్వారా అరిజీత్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. 2011లో 'మర్డర్ 2' సినిమాలోని "ఫిర్ మొహబ్బత్" పాటతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే 2013లో వచ్చిన 'ఆషికి 2'లోని "తుమ్ హి హో" పాటతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు.

చన్నా మేరేయా, అగర్ తుమ్ సాత్ హో, రాబ్తా, కేసరియా, ఏ దిల్ హై ముష్కిల్ వంటి ఎన్నో ఐకానిక్ పాటలను అతడు పాడాడు. విశాల్ భరద్వాజ్ 'ఓ రోమియో' సినిమాలో కూడా అతడు అద్భుతమైన పాటలు పాడాడు. ప్లేబ్యాక్ సింగింగ్ ఆపేసినా, అతడు మ్యూజిక్ డైరెక్టర్‌గా, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ గా కొనసాగే అవకాశం ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More