...
...
Next Story

రెండోసారి తండ్రి కాబోతున్న టాప్ డైరెక్టర్.. భార్య, కొడుకుతో కలిసి వెరైటీ ఫొటోషూట్.. కంగ్రాట్స్ చెప్పిన సమంత, కీర్తి

టాప్ పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ, అతని భార్య ప్రియ తమ రెండో సంతానాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఓ వెరైటీ ఫొటోషూట్ తో వాళ్లు ఈ విషయాన్ని చెప్పారు. దీంతో సమంత, కీర్తి సురేష్ లాంటి వాళ్లు విషెస్ చెబుతూ కామెంట్స్ చేశారు.

Published on: Jan 20, 2026, 14:08:06 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, ‘జవాన్’ ఫేమ్ అట్లీ (Atlee) ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. అట్లీ, అతని భార్య ప్రియ తమ కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తిని ఆహ్వానించడానికి సిద్ధమయ్యారు. ప్రియ రెండోసారి గర్భం దాల్చినట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

క్యూట్ ఫ్యామిలీ ఫోటోషూట్..

రెండోసారి తండ్రి కాబోతున్న టాప్ డైరెక్టర్.. భార్య, కొడుకుతో కలిసి వెరైటీ ఫొటోషూట్.. కంగ్రాట్స్ చెప్పిన సమంత, కీర్తి
రెండోసారి తండ్రి కాబోతున్న టాప్ డైరెక్టర్.. భార్య, కొడుకుతో కలిసి వెరైటీ ఫొటోషూట్.. కంగ్రాట్స్ చెప్పిన సమంత, కీర్తి

ఈ శుభవార్తను పంచుకుంటూ అట్లీ దంపతులు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని మనసుకు హత్తుకునే ఫోటోలను షేర్ చేశారు. మెహందీ గ్రీన్ రంగు దుస్తుల్లో ప్రియ తన బేబీ బంప్‌ను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తుండగా, అట్లీ ఆమె పక్కన ఆప్యాయంగా నిల్చున్నాడు.

ఈ ఫోటోలలో వారి మొదటి కుమారుడు మీర్ ‘బిగ్ బ్రదర్’గా పోజులివ్వడం హైలైట్‌గా నిలిచింది. అంతేకాకుండా, వారి పెంపుడు కుక్కలు (బెకీ, యుకీ, చాకీ, కాఫీ, గూఫీ) కూడా ఈ ఫ్రేమ్‌లో ఉండటం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సమంత, కీర్తి సురేష్ శుభాకాంక్షలు..

"మా ఇల్లు ఇప్పుడు మరింత అందంగా మారబోతోంది.. అవును! మేం మళ్లీ తల్లిదండ్రులం కాబోతున్నాం. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ మాకు కావాలి" అంటూ ప్రియ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. దీనిపై టాలీవుడ్ హీరోయిన్ సమంత స్పందిస్తూ.. "సో బ్యూటిఫుల్.. కంగ్రాట్స్ మై బ్యూటిఫుల్ మమ్మా" అని కామెంట్ చేసింది. కీర్తి సురేష్ కూడా హార్ట్ ఎమోజీలతో శుభాకాంక్షలు తెలిపింది.

ఎనిమిదేళ్ల తర్వాత తొలి సంతానం..

2014లో ప్రేమ వివాహం చేసుకున్న అట్లీ, ప్రియ దంపతులు.. ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత 2023 జనవరి 31న తమ మొదటి కుమారుడు మీర్‌కు జన్మనిచ్చారు. ఇప్పుడు రెండేళ్ల వ్యవధిలో రెండో బిడ్డకు స్వాగతం పలుకుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe