Karthik Subbaraj About Keerthy Suresh Dorothy Controversy: తమిళ విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన తాజా క్రైమ్ డ్రామా 'డోరతి' ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, డిజిటల్ స్పేస్‌లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఒకవైపు విమర్శకుల మెప్పు పొందుతుండగా, మరోవైపు ఇందులోని ట్రాన్స్‌జెండర్, LGBTQ+ కథాంశాల కారణంగా వివాదాలను ఎదుర్కొంటోంది.
హాస్య పాత్రలకే పరిమితం చేశారని

ఈ వివాదాలపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ స్పందిస్తూ, విమర్శలను పక్కనపెట్టి సినిమా తెచ్చే సానుకూల మార్పుపైనే తాము దృష్టి పెడుతున్నామని తేల్చి చెప్పారు. భారతీయ సినిమాల్లో చాలాకాలంగా ట్రాన్స్‌జెండర్లను కేవలం హాస్య పాత్రలకే పరిమితం చేశారని, ఆ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
సమాజంలో మార్పు తెచ్చే ప్రయత్నం!
హైదరాబాద్ టైమ్స్‌కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో కార్తీక్ సుబ్బరాజ్ తన ఆలోచనలను పంచుకున్నారు. "ఈ చిత్రం ద్వారా ట్రాన్స్‌జెండర్ల పట్ల సమాజంలో ఒక సానుకూల దృక్పథం ఏర్పడుతుందని ఆశిస్తున్నా. వారిని గౌరవంగా చూడటం, ఆమోదించడం, సమాజంలో ఒక భాగంగా గుర్తించడం చాలా అవసరం. వారి జీవిత పోరాటాలు, వాస్తవాలు వెండితెరపైకి రావాలి. ఈ సినిమా ఆ మార్పుకు కొంతైనా దోహదపడితే అది మాకు లభించిన విజయం" అని దర్శకుడు తెలిపారు.
విడుదలకు ముందే డోరతి సినిమాలోని ఒక ముద్దు సన్నివేశం ఆన్‌లైన్‌లో లీక్ కావడం, సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ రావడంపై ఆయన ప్రశాంతంగా స్పందించారు.
ఒప్పుకోడానికి ఇష్టపడని కఠిన నిజాలు
"మన సమాజంలో ఒప్పుకోవడానికి ఇష్టపడని కఠిన నిజాలకు ఈ సినిమా అద్దం పడుతోంది. సినిమా చూశాక చాలామంది భావోద్వేగానికి గురయ్యారు. గతంలో ట్రాన్స్‌జెండర్ల పట్ల ప్రవర్తించిన తీరును తలచుకుని కొందరు పురుషులు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం నన్ను కదిలించింది" అని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు.
1980ల నాటి నేపథ్యంలో క్రైమ్ డ్రామా
1980ల నాటి కాలం నేపథ్యంలో సాగే డోరతి చిత్రంలో ఇద్దరు బాల్య మిత్రుల జీవితాల్లోకి ఒక మహిళ ప్రవేశించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది ప్రధాన కథాంశం. తన లైంగిక గుర్తింపును తెలుసుకునే క్రమంలో ఒక ట్రాన్స్‌జెండర్ ఎదుర్కొన్న సవాళ్లను, సమాజం వారి పట్ల చూపించే వైఖరిని హృద్యంగా ఆవిష్కరించారు.
{{/usCountry}}1980ల నాటి కాలం నేపథ్యంలో సాగే డోరతి చిత్రంలో ఇద్దరు బాల్య మిత్రుల జీవితాల్లోకి ఒక మహిళ ప్రవేశించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది ప్రధాన కథాంశం. తన లైంగిక గుర్తింపును తెలుసుకునే క్రమంలో ఒక ట్రాన్స్‌జెండర్ ఎదుర్కొన్న సవాళ్లను, సమాజం వారి పట్ల చూపించే వైఖరిని హృద్యంగా ఆవిష్కరించారు.
{{/usCountry}}కీర్తి సురేష్ నటించిన డోరతి చిత్రాన్ని గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా నిర్మించారు. కీర్తి సురేష్‌తో పాటు సనాత్, రిషికాంత్ కీలక పాత్రల్లో అద్భుత నటనను కనబరిచారు.
టొరంటో నుంచి తెలుగు ల్యాండింగ్!
ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో డోరతి సినిమా ప్రదర్శితమై ప్రపంచవ్యాప్త సినీ ప్రముఖుల నుంచి నిలబడి చప్పట్లు (Standing Ovation) అందుకోవడం విశేషం. సెప్టెంబర్‌లో అంతర్జాతీయంగా విడుదలైన డోరతి చిత్రాన్ని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ప్రత్యేక శ్రద్ధతో అక్టోబర్ 2న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
డోరతి అంటే కానుక అని అర్థం
"డోరతి అంటే దేవుడు ఇచ్చిన కానుక అని అర్థం. సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పేరు అది. సినిమా చూశాక ఈ టైటిల్ ఎందుకు పెట్టారో అందరికీ అర్థమవుతుంది. దీనికి మించిన పేరు మరొకటి ఉండదేమో" అని రానా ఈ సినిమా శీర్షిక ప్రాముఖ్యతను వివరించారు. నెగెటివ్ ప్రచారాలను దాటుకుని 'డోరతి' విమర్శకుల ప్రశంసలతో థియేటర్లలో కొనసాగుతోంది.