Keerthy Suresh Dorothy: సినిమా చూడకుండానే విమర్శిస్తున్నారు.. క్లైమ్యాక్స్ చూసి చప్పట్లు కొడుతున్నారు: డోరతీ డైరెక్టర్

Keerthy Suresh Dorothy: కీర్తి సురేష్ నటించిన తమిళ బోల్డ్ మూవీ డోరతీ కంటెంట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దీనిపై డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ స్పందించారు. కొందరు సినిమా చూడకుండానే విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Published on: Sep 29, 2026, 22:13:49 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Keerthy Suresh Dorothy: తమిళ వర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన లేటెస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ 'డోరతీ' (Dorothy) ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో LGBTQ+ కమ్యూనిటీ, గే రిలేషన్‌షిప్‌ల అంశాలను స్పృశించడంతో నెటిజన్ల నుంచి విపరీతమైన హోమోఫోబిక్ ట్రోలింగ్ ఎదురవుతోంది.

Keerthy Suresh Dorothy: సినిమా చూడకుండానే విమర్శిస్తున్నారు.. క్లైమ్యాక్స్ చూసి చప్పట్లు కొడుతున్నారు: డోరతీ డైరెక్టర్
Keerthy Suresh Dorothy: సినిమా చూడకుండానే విమర్శిస్తున్నారు.. క్లైమ్యాక్స్ చూసి చప్పట్లు కొడుతున్నారు: డోరతీ డైరెక్టర్

ఈ ఆన్‌లైన్ హేట్‌పై డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఘాటుగా స్పందించారు. నెగెటివిటీ ప్రచారం చేస్తున్న వారిపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.

సినిమా చూడకుండానే సంస్కృతి పేరుతో దాడి

డోరతీ సినిమా థియేటర్లలోకి రాకముందే కొందరు సోషల్ మీడియాలో హడావుడి స్టార్ట్ చేశారని కార్తీక్ సుబ్బరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కథ ఏంటో కనీసం తెలుసుకోకుండానే కొందరు కల్చరల్ డిస్కషన్ అంటూ హంగామా చేశారని ఆయన మండిపడ్డారు.

మెయిన్‌స్ట్రీమ్ సినిమాలో ఇలాంటి బోల్డ్ కథలు చెప్పడాన్ని సమాజంలోని కొంతమంది అసలు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. తమ ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందో అనే భయంతోనే ఇలాంటి ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.

చెన్నై నుంచి మధురై వరకు.. థియేటర్లలో విజిల్స్

ఆన్‌లైన్‌లో జరుగుతున్న నెగెటివ్ ప్రచారాన్ని పక్కన పెడితే, థియేటర్లలో ఒరిజినల్ ఆడియన్స్ రెస్పాన్స్ అద్భుతంగా ఉందని కార్తీక్ తెలిపారు. సినిమా రిలీజ్ అయ్యాక తమిళనాడు వ్యాప్తంగా చెన్నై నుంచి మధురై వరకు దాదాపు 15 నుంచి 20 థియేటర్లు పర్సనల్‌‌గా విజిట్ చేసినట్లు చెప్పారు.

ప్రేక్షకులు సినిమాలో ఉన్న నిజమైన ఎమోషన్‌ను పర్ఫెక్ట్‌గా కనెక్ట్ చేసుకుంటున్నారని ఆయన వివరించారు. ప్రతి థియేటర్‌లోనూ సినిమా క్లైమాక్స్ పూర్తి కాగానే ఆడియన్స్ లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

కీర్తి సురేష్ బోల్డ్ అటెంప్ట్.. రా అండ్ రస్టిక్ డ్రామా

'పిజ్జా', 'జిగర్‌తాండా', 'పేట్టా', 'జిగర్‌తాండా డబుల్ ఎక్స్' లాంటి విభిన్నమైన బ్లాక్‌బస్టర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్.. ఈసారి 'డోరతీ' రూపంలో అత్యంత ప్రాణమున్న కథను అందించారు. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ ఎమోషనల్ డ్రామాకు ఇసైజ్ఞాని ఇళయరాజా అందించిన సంగీతం ప్రాణం పోసింది.

'మహానటి', 'దసరా' లాంటి సినిమాలతో మెప్పించిన కీర్తి సురేష్.. ఈ సినిమాలో తన రెగ్యులర్ కంఫర్ట్ జోన్ దాటి అత్యంత సాహసోపేతమైన పాత్రలో కనిపిస్తున్నారు. సనంత్, రిషికాంత్ కూడా కీలక పాత్రల్లో నటనతో ఆకట్టుకున్నారు.

ఆడియన్స్ సపోర్టే నా అసలైన బలం

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం చాలా ఈజీ అయిపోయిందని, కానీ థియేటర్‌కి వచ్చి సినిమా చూసే అసలైన ప్రేక్షకులు కంటెంట్‌ను ఆదరిస్తున్నారని కార్తీక్ సుబ్బరాజ్ అన్నారు.

సమాజంలో ఉన్న మూస ఆలోచనలను మార్చడానికి సినిమా ఒక గొప్ప సాధనమని, ఎన్ని వివాదాలు ఎదురైనా ఇలాంటి మంచి కథలు చెప్పడం ఆపేది లేదని ఈ స్టార్ డైరెక్టర్ తేల్చి చెప్పారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More