సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన 'కూలీ' (Coolie) ఆగస్టు 14న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కథలో దమ్ము లేదని, రైటింగ్ వీక్‌గా ఉందని విమర్శలు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా రూ. 500 కోట్లు కొల్లగొట్టింది. తాజాగా దీనిపై స్పందించిన లోకేష్.. విమర్శలను స్వీకరిస్తున్నానని, రజనీకాంత్ వల్లే సినిమా ఆడిందని నిజాయితీగా ఒప్పుకున్నాడు.
వెయ్యికిపైగా విమర్శలు వచ్చాయి

భారీ అంచనాల మధ్య విడుదలైన 'కూలీ' సినిమాపై వచ్చిన నెగటివ్ రివ్యూలపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఎట్టకేలకు మౌనం వీడాడు. శుక్రవారం (డిసెంబర్ 26) సాయంత్రం అతడు మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సినిమా స్క్రిప్ట్ గురించి వచ్చిన కామెంట్స్ పై లోకేష్ స్పందిస్తూ.. "'కూలీ' సినిమాపై వేలల్లో విమర్శలు వచ్చాయి. అవన్నీ గమనించాను. నా తర్వాతి సినిమాలో ఆ తప్పులు జరగకుండా చూసుకుంటా, సరిదిద్దుకుంటా. ఇన్ని విమర్శలు వచ్చినా జనాలు థియేటర్లకు వెళ్ళింది కేవలం రజనీకాంత్ సార్ కోసమే. ప్రొడ్యూసర్ ఈ సినిమా రూ. 500 కోట్లు కలెక్ట్ చేసిందని నాతో చెప్పారు. ఆదరించిన అందరికీ థాంక్స్," అని లోకేష్ చెప్పాడు.
వాళ్ల కోసం కథలు రాయను
అంతకుముందు కోయంబత్తూరులో జరిగిన ఒక ఈవెంట్‌లో కూడా లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "జనాల భారీ అంచనాలను దృష్టిలో పెట్టుకుని నేను కథలు రాయలేను. నేను రాసింది జనాలకు నచ్చితే సంతోషం.. నచ్చకపోతే మళ్ళీ ప్రయత్నిస్తా అంతే" అని క్లారిటీ ఇచ్చాడు.
'కూలీ' సినిమా విశేషాలు
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' సినిమాతో పోటీపడి రిలీజ్ అయినప్పటికీ.. 'కూలీ' తన సత్తా చాటింది. ఈ సినిమాలో రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్ లాంటి వాళ్లు నటించారు.
{{/usCountry}}హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' సినిమాతో పోటీపడి రిలీజ్ అయినప్పటికీ.. 'కూలీ' తన సత్తా చాటింది. ఈ సినిమాలో రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్ లాంటి వాళ్లు నటించారు.
{{/usCountry}}ఈ కూలీ మూవీ దేవా (రజనీకాంత్) అనే మాజీ కూలీ యూనియన్ లీడర్.. తన స్నేహితుడు రాజశేఖర్ (సత్యరాజ్) అనుమానాస్పద మృతి వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథ చుట్టూ తిరుగుతుంది. ఇందులో సైమన్ అనే గ్యాంగ్‌స్టర్‌గా నాగార్జున, అతని రైట్ హ్యాండ్‌గా సౌబిన్ సాహిర్ నటించారు.